...
...
Next Story

Mandaadi OTT: రూ. 150 కోట్ల బ్లాక్ బస్టర్- ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మండాడి- తమిళంలో సుహాస్ విలనిజం- తెలుగులో స్ట్రీమింగ్!

₹150 Cr Collection Movie Mandaadi OTT Release Today: బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డులు తిరగరాసిన స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మండాడి ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇవాళ వచ్చేసింది. సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన మండాడి ఓటీటీలోకి తెలుగు సహా 5 భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Published on: Oct 8, 2026, 10:51:06 IST
Advertisement

₹150 Cr Collection Movie Mandaadi OTT Streaming Today: థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టించిన తెలుగు, తమిళ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ మండాడి ఓటీటీలో సందడి చేసేందుకు ఇప్పుడు సిద్ధమైంది. తమిళనాడుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలన విజయం సాధించిన మండాడి ఓటీటీలోకి ఇవాళ (అక్టోబర్ 8) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

సూరి, సుహాస్ కాంబినేషన్

రూ. 150 కోట్ల బ్లాక్ బస్టర్- ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మండాడి- తమిళంలో సుహాస్ విలనిజం- తెలుగులో స్ట్రీమింగ్!
రూ. 150 కోట్ల బ్లాక్ బస్టర్- ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మండాడి- తమిళంలో సుహాస్ విలనిజం- తెలుగులో స్ట్రీమింగ్!

తమిళంలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని హీరోగా మారిన సూరి, తెలుగులో తన విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న సుహాస్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇద్దరి కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి తెలుగు రాష్ట్రాల్లో మండాడి చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేసింది.

రూ. 150 కోట్ల కలెక్షన్స్

తమిళనాడులోనే ఏకంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన మండాడి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల మార్కును దాటి కొత్త రికార్డులను నెలకొల్పింది. దర్శకుడు మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ మండాడి చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.

సముద్రం నేపథ్యంలో సాగే ఉత్కంఠభరిత యాక్షన్

సముద్రం నేపథ్యంలో సాగే బోట్ రేసింగ్ సీక్వెన్స్, యాక్షన్ సీన్లు థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెట్టాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ఉద్రేకపూరితమైన నేపథ్య సంగీతం, ఎస్.ఆర్. కథిర్ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ కంపోజ్ చేసిన స్టంట్ సీక్వెన్సులు ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించాయి.

నటనతో ప్రాణం పోసిన యాక్టర్స్

"మండాడి లాంటి వినూత్నమైన స్పోర్ట్స్ థ్రిల్లర్‌ను వెండితెరపై ఆవిష్కరించిన తీరు అద్భుతం" అని ప్రదర్శన చూసిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ మండాడి చిత్రబృందాన్ని కొనియాడారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ భారీ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వెట్రిమారన్ వ్యవహరించారు.

మండాడి ఓటీటీ స్ట్రీమింగ్

థియేటర్లలో రూ. 150 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన మండాడి ఓటీటీలోకి నేడు రానేవచ్చేసింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో మండాడి ఓటీటీ రిలీజ్ అయింది. నేటి నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి 5 భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో మండాడి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో

థియేటర్లలో 150 కోట్లు కొల్లగొట్టిన మండాడి ఓటీటీలో ఎంలాటి వ్యూస్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి. అలాగే, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో మంచి రా అండ్ రస్టిక్ ఫిల్మ్ చూడాలనుకునే ఓటీటీ లవర్స్‌కి నెట్‌ఫ్లిక్స్‌లోని మండాడి మంచి ఆప్షన్.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks