భారతీయ చలనచిత్ర దిగ్గజం మణిరత్నం తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో గతేడాది విడుదలైన 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో మణిరత్నం ఒక క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తేలిపోయింది!

మణిరత్నం కొత్త చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, ‘నేచురల్ బ్యూటీ’ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గురువారం (మార్చి 19) మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఈ చిత్రానికి సోనీ మ్యూజిక్ సౌత్ ఆడియో పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.
‘ఆస్కార్’ విజేత
అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ రూమర్లకు చెక్ పెడుతూ.. ఈ చిత్రానికి ‘ఆస్కార్’ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.
మ్యాజిక్ అని భావించే అభిమానులు
మణిరత్నం-రెహమాన్ కాంబినేషన్ అంటేనే ఒక మ్యాజిక్ అని భావించే అభిమానులు ఈ ప్రకటనతో ఖుషీ అవుతున్నారు. "మరో సోల్ ఫుల్ ఆల్బమ్ లోడింగ్" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్, సాయి పల్లవి బిజీ బిజీ..
కాగా మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతికి ఇది రెండో సినిమా. గతంలో వీరు ‘చెక్క చివంద వానమ్’ (నవాబ్) కోసం కలిసి పనిచేశారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేతిలో ‘జైలర్ 2’, ‘ట్రైన్’, ‘అరసన్’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.
సాయి పల్లవికి ఇదే తొలిసారి
ఇక సాయి పల్లవి విషయానికి వస్తే, ఆమె మణిరత్నం సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. తెలుగులో చివరిగా ‘తండేల్’తో ఆకట్టుకున్న సాయి పల్లవి హిందీలో ప్రతిష్టాత్మక ‘రామాయణ’ పార్ట్ 1 అండ్ 2 చిత్రాల్లో నటిస్తోంది.
'థగ్ లైఫ్' చేదు జ్ఞాపకాలు..
{{/usCountry}}ఇక సాయి పల్లవి విషయానికి వస్తే, ఆమె మణిరత్నం సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. తెలుగులో చివరిగా ‘తండేల్’తో ఆకట్టుకున్న సాయి పల్లవి హిందీలో ప్రతిష్టాత్మక ‘రామాయణ’ పార్ట్ 1 అండ్ 2 చిత్రాల్లో నటిస్తోంది.
'థగ్ లైఫ్' చేదు జ్ఞాపకాలు..
{{/usCountry}}కమల్ హాసన్ హీరోగా వచ్చిన ‘థగ్ లైఫ్’ మీద భారీ అంచనాలు ఉండటంతో.. అది ‘నాయకన్’ (నాయకుడు) స్థాయి మ్యాజిక్ రిపీట్ చేస్తుందని అందరూ భావించారు. కానీ, సుమారు రూ. 200-300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.
తన మార్క్ చూపించాలని
ఈ నేపథ్యంలో మణిరత్నం తన తర్వాతి సినిమాతో మళ్లీ తన మార్క్ చూపించాలని కంకణం కట్టుకున్నారు. త్వరలోనే విజయ్ సేతుపతి, సాయి పల్లవి, ఏఆర్ రెహమాన్, మణిరత్నం ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.