బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ తన పవర్ ఫుల్ పోలీస్ పాత్ర 'శివాని శివాజీ రాయ్'గా మరోసారి బాక్సాఫీస్ వద్ద మెప్పించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో మూడవ భాగం 'మర్దానీ 3' (Mardaani 3) జనవరి 30న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను సాధించింది.
సాహసోపేతమైన ఐపీఎస్ ఆఫీసర్

ఇప్పుడు మర్దానీ 3 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కిడ్నాప్‌కు గురైన చిన్న పిల్లలను రక్షించేందుకు ఓ సాహసోపేతమైన ఐపీఎస్ ఆఫీసర్ చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. చైల్డ్ ట్రాఫికింగ్, బెగ్గర్ మాఫియా చుట్టూ సాగుతుంది. బెగ్గర్ మాఫియాను రన్ చేసే అమ్మను అంతు చూసే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథగా ఈ మూవీని రూపొందించారు.
93 మంది చిన్న పిల్లలు
మర్దానీ 3 చిత్రంలో రాణి ముఖర్జీతో పాటు జాంకీ బోడివాలా, మల్లికా ప్రసాద్, జిషూ సేన్‌గుప్తా కీలక పాత్రల్లో నటించారు. మూడు నెలల్లోనే దాదాపు 93 మంది చిన్న పిల్లలు అదృశ్యం కావడం, దాని వెనుక ఉన్న భయంకరమైన బెగ్గర్ మాఫియా నెట్‌వర్క్‌ను శివాని శివాజీ రాయ్ ఎలా ఛేదించిందనేది ఈ సినిమాలో ఉత్కంఠభరితంగా చూపించారు.
మర్దానీ 3 బడ్జెట్ అండ్ కలెక్షన్స్
'మర్దానీ' సిరీస్‌లో ఈ మూడవ భాగం అయిన మర్దానీ 3 అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మర్దానీ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 76.85 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అలాగే, ఇండియాలో ఇండియాలో ఈ సినిమా దాదాపు రూ. 47.55 కోట్ల నెట్ కలెక్షన్లను వసూలు చేసింది.
గత సినిమాల రికార్డ్స్
అదే గతంలో వచ్చిన మర్దానీ 1 (రూ. 35.86 కోట్లు), మర్దాని 2 (రూ. 47.51 కోట్లు) ఇండియన్ నెట్ కలెక్షన్స్ రికార్డులను మర్దానీ 3 అధిగమించింది. అంతేకాకుండా మర్దానీ 3 సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 7.5 రేటింగ్ ఉంది.
ప్రతి మహిళ గొంతుక ఇది
{{/usCountry}}అదే గతంలో వచ్చిన మర్దానీ 1 (రూ. 35.86 కోట్లు), మర్దాని 2 (రూ. 47.51 కోట్లు) ఇండియన్ నెట్ కలెక్షన్స్ రికార్డులను మర్దానీ 3 అధిగమించింది. అంతేకాకుండా మర్దానీ 3 సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 7.5 రేటింగ్ ఉంది.
ప్రతి మహిళ గొంతుక ఇది
{{/usCountry}}కాగా, మర్దానీ 3 సాధించిన విజయంపై రాణి ముఖర్జీ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. "మర్దానీ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. అణచివేతకు వ్యతిరేకంగా గళం ఎత్తే ప్రతి మహిళ గొంతుక ఇది" రాణి ముఖర్జీ అన్నారు.
సమాజం వైఫల్యమే
"సమాజంలో ఇలాంటి నేరాలు జరుగుతున్నప్పుడు మనం కళ్లు మూసుకోకూడదు. ఒక్క చిన్నారిపై దాడి జరిగినా అది మన సమాజం వైఫల్యమే. శివాని శివాజీ రాయ్ ప్రయాణానికి ప్రేక్షకులు అందిస్తున్న మద్దతు నాకు మరింత ధైర్యాన్ని ఇస్తోంది" అని రాణి ముఖర్జీ పేర్కొన్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మర్దానీ 3
అభిరాజ్ మినావాల దర్శకత్వం వహించిన మర్దానీ 3 ఓటీటీలోకి వచ్చేయనుంది. థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే సంప్రదాయాన్ని మర్దానీ 3 అనుసరిస్తుంది. మార్చి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో మర్దానీ 3 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటివరకు కేవలం హిందీ భాషలోనే మర్దానీ 3 ఓటీటీ రిలీజ్ కానుందని సమాచారు.