...
...
Next Story

Mark K Robin Gaddar Award: టాలీవుడ్ టు బాలీవుడ్, సైమా నుంచి గద్దర్ వరకు- మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్క్ కె రాబిన్ సత్తా!

Mark K Robin Best Music Director Gaddar Award: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గద్దర్ అవార్డుల్లో హైదరాబాద్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ సత్తా చాటారు. దండోరా సినిమాతోనే కాకుండా టాలీవుడ్ టు బాలీవుడ్ దాకా సైమా నుంచి గద్దర్ వరకు అవార్డులను వరించిన మార్క్ కె రాబిన్ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.

Published on: Mar 11, 2026, 06:15:02 IST
Advertisement

టాలీవుడ్‌లో ‘అ!’ సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ అనతి కాలంలోనే మంచి పేరుని సంపాదించుకున్నారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న తేడాను చూడకుండా తన వద్దకు వచ్చిన, తనకు నచ్చిన, తాను మెచ్చిన కథలకు జీవం పోస్తూ, తన మార్క్‌ను చూపిస్తూ వచ్చారు మార్క్ కె రాబిన్.

హైదరాబాద్‌లో పుట్టి

టాలీవుడ్ టు బాలీవుడ్, సైమా నుంచి గద్దర్ వరకు- మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్క్ కె రాబిన్ సత్తా!
టాలీవుడ్ టు బాలీవుడ్, సైమా నుంచి గద్దర్ వరకు- మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్క్ కె రాబిన్ సత్తా!

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మార్క్ కె రాబిన్ తన సంగీతంతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు మార్క్ కె రాబిన్‌కి ఎన్నో అవార్డులు, ఎంతో గుర్తింపు లభించింది. కానీ, తాజాగా తెలంగాణ ప్రభుత్వం మార్క్ కె రాబిన్ ప్రతిభకి తగ్గ పురస్కారాన్ని అందించినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

"8AM Metro"తో మార్క్ కె రాబిన్ బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. అక్కడ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా ఐరా అవార్డును సాధించారు. అలా మెట్టు మెట్టు ఎదుగుతూ వస్తున్న మార్క్ కె రాబిన్‌కి గద్దర్ అవార్డుతో ఇప్పుడు తగిన గుర్తింపు లభించినట్టు అయింది.

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా

‘దండోరా’ చిత్రానికి గానూ మార్క్ కె రాబిన్‌కి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గద్దర్ అవార్డ్ లభించింది. మార్క్ కె రాబిన్ అందించిన పాటలు, ఇచ్చిన సోల్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి, మరీ ముఖ్యంగా "దండోరా" టైటిల్ సాంగ్ ప్రేక్షకులను కదిలించాయి. ‘దండోరా’ సినిమాని తన ఆర్ఆర్‌తో మరో స్థాయికి తీసుకు వెళ్లిన మార్క్ కె రాబిన్‌కి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవాన్ని, అవార్డుని ఇచ్చింది.

అలాంటి మార్క్‌కి ‘మళ్లీ కలుద్దాం’తో సైమా 2017 బెస్ట్ మ్యూజిక్ అవార్డు వచ్చింది. నోయిడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో డిలి బిలీకి సైతం అవార్డు వచ్చింది. ‘సూర్యకాంతం’ సినిమాకి గానూ మార్క్ ఇచ్చిన సంగీతానికి మిర్చి మ్యూజిక్‌ వారి నుంచి బెస్ట్ అప్ కమింగ్ కంపోజర్ అవార్డు వచ్చింది.

‘మల్లేశం’ సినిమాలోని ‘నాకు నువ్వని’ పాటకి బెస్ట్ కంపోజర్‌గా మిర్చి మ్యూజిక్ అవార్డ్ లభించింది. ఐరా అవార్డుల్లో భాగంగా బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా మార్క్‌కి గుర్తింపు దక్కింది. ఇప్పటి వరకు ఆయన దాదాపు 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

గద్దర్ పాటలంటే ఇష్టమని

చిన్నప్పటి నుంచీ గద్దర్ పాటలు అంటే ఇష్టమని, అవి పాటలు కాదు ఫైర్ అని, ఆయన పాటలు వింటూ పెరిగిన తనకు ఈనాడు గద్దర్ అవార్డు రావడం ఆనందంగా ఉందని మార్క్ కే రాబిన్ అన్నారు. తనకు ఈ అవార్డుని, గుర్తింపును ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వంకు, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి, జ్యూరీ మెంబర్లకు మార్క్ కె రాబిన్ ధన్యవాదాలు తెలిపారు.

తనకు ఇంత మంచి స్టోరీని, సినిమాని ఇచ్చిన దండోరా దర్శకుడు మురళీకాంత్, నిర్మాత రవీంద్ర బెనర్జీ గారికి, తనకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన తన లిరిసిస్ట్, సింగర్స్‌కి మార్క్ కె రాబిన్ థాంక్స్ చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks