...
...
Next Story

OTT: ఓటీటీలోకి ఇవాళ సైలెంట్‌గా వచ్చిన మిస్టరీ థ్రిల్లర్- బిగ్ బాస్ అమన్, పాయల్ స్లో బర్న్ మూవీ- ఒకే సిట్టింగ్‌లో చూడాలట!

Mayookha OTT Release Today: న్యూయార్క్, కేన్స్ అంతర్జాతీయ వేదికలపై అవార్డులు సాధించిన సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మయూఖ ఓటీటీలోకి సైలెంట్‌గా వచ్చేసింది. పాయల్ చెంగప్ప, బిగ్ బాస్ అమన్ నటించిన ఈ సినిమాను ఒకే సిట్టింగ్‌లో చూడామంటూ డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్‌కే సూచించారు. మయూఖ ఓటీటీ రిలీజ్ ఎక్కడో చూద్దాం.

Published on: Nov 20, 2026, 13:52:23 IST
Advertisement

Mayookha OTT Streaming From Today: భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ ఉంటేనే సినిమాలు ఆడతాయనే పాత లెక్కలను తలకిందులు చేస్తూ, బలమైన కథనంతో సంచలనం సృష్టించిన చిత్రం 'మయూఖ'. థియేటర్లలో ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు న్యూయార్క్, కేన్స్ అంతర్జాతీయ చలనచిత్ర వేదికలపై అవార్డుల పంట పండించిన ఈ సైకలాజికల్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మయూఖ ఓటీటీలోకి వచ్చేసింది.

కొరియన్ తరహాలో సాగే థ్రిల్లర్

ఓటీటీలోకి ఇవాళ సైలెంట్‌గా వచ్చిన మిస్టరీ థ్రిల్లర్- బిగ్ బాస్ అమన్, పాయల్ స్లో బర్న్ మూవీ- ఒకే సిట్టింగ్‌లో చూడాలట!
ఓటీటీలోకి ఇవాళ సైలెంట్‌గా వచ్చిన మిస్టరీ థ్రిల్లర్- బిగ్ బాస్ అమన్, పాయల్ స్లో బర్న్ మూవీ- ఒకే సిట్టింగ్‌లో చూడాలట!

ఇటీవలి కాలంలో తెలుగు ఓటీటీ ప్రేక్షకుల అభిరుచిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే మలయాళం, కొరియన్ తరహాలో సాగే విభిన్నమైన థ్రిల్లర్లను ఆదరించేందుకు డిజిటల్ వీక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

అలాంటి అభిరుచి గల ప్రేక్షకులకు 'మయూఖ' ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది. బ్యూటిఫుల్ పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీ తేజ్ ఎస్‌కే ఎంతో వైవిధ్యంగా మలిచారు. ఇందులో బిగ్ బాస్ అమన్ మసూద్ కూడా కీలక పాత్ర పోషించడం విశేషం.

మలయాళ సినిమాలను గుర్తుచేసే స్లో బర్న్ కథనం

సాధారణంగా థ్రిల్లర్ సినిమాలంటే మొదటి నిమిషం నుంచే పరుగులు పెడుతుంటాయి. కానీ 'మయూఖ' విషయంలో దర్శకుడు భిన్నమైన పంథాను ఎంచుకున్నారు. సినిమా మొదటి భాగం మలయాళ చిత్రాల్లో కనిపించే తరహాలో ఎంతో సహజంగా, నెమ్మదిగా (స్లో బర్న్ నేరేషన్) సాగుతూ పాత్రల స్వభావాన్ని పరిచయం చేస్తుంది.

ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ఒక కీలక మలుపుతో అసలు కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ద్వితీయార్థం ఊపిరి బిగబట్టి చూసేలా, వేగవంతమైన మలుపులతో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కినప్పటికీ సాంకేతిక విలువల విషయంలో ఎక్కడా రాజీ పడలేదని సినిమా చూసిన విమర్శకులు ప్రశంసించారు.

మోనోక్రోమాటిక్ లైటింగ్.. హాలీవుడ్ స్థాయి మేకింగ్

థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో మయూఖ సినిమాను చూసేటప్పుడు ఒక చిన్న నియమం పాటించాలని చిత్రబృందం కోరుతోంది. "మయూఖ సినిమాను మధ్యలో ఆపకుండా, ఒకే సిట్టింగ్‌లో పూర్తిగా చూడాలి. అప్పుడే ఇందులోని సైకలాజికల్ అంశాలు, కథనంలోని సూక్ష్మమైన మలుపులు పూర్తి స్థాయిలో అనుభూతినిస్తాయి" అని దర్శకుడు శ్రీ తేజ్ ఎస్‌కే ప్రేక్షకులకు సూచించారు.

శశిధర్ నల్ల నిర్మాణంలో, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపుదిద్దుకున్న మయూఖ ఓటీటీలోకి ఇవాళ (నవంబర్ 20) సడెన్‌గా వచ్చేసింది. నవంబర్ 20 అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో ప్రత్యేకంగా మయూఖ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రైమ్, హాట్‌స్టార్ ఓటీటీల్లో

అలాగే, నవంబర్ 23న తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ వంటి 4 భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వేదికలపై మయూఖ అందుబాటులోకి రానుంది. అంటే మరో 3 రోజుల్లో ఇంకో ప్లాట్‌ఫామ్‌లో మయూఖ ఓటీటీ రిలీజ్ అవనుంది. అంతర్జాతీయ అవార్డుల గుర్తింపు, విభిన్నమైన విజువల్ స్టైల్ కలగలిసిన మయూఖ ఈ వీకెండ్‌లో ఓటీటీలో థ్రిల్లర్ ప్రియులకు మంచి విందు కానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks