...
...
Next Story

Met Gala 2026: న్యూయార్క్ ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలాలో కరణ్ జోహార్ ఎంట్రీ, దీపికా మిస్- భారత్ నుంచి వెళ్లేది ఇంకా ఎవరంటే?

Met Gala 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ ఈవెంట్ 'మెట్ గాలా 2026'కు సర్వం సిద్ధమైంది. న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో జరగనున్న ఈ వేడుకలో గ్లోబల్ స్టార్లతో పాటు మన భారతీయ తారలు కూడా సందడి చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో కరణ్ ఎంట్రీ ఇస్తుంటే దీపికా మిస్ అవనుంది.

Published on: May 2, 2026, 13:26:27 IST
Advertisement

Met Gala 2026: ప్రతి ఏటా మే నెల మొదటి సోమవారం నిర్వహించే మెట్ గాలాకు ఈసారి ఈ నెల 4న నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈవెంట్ కోసం "కాస్ట్యూమ్ ఆర్ట్" (Costume Art) అనే థీమ్‌ను ఎంచుకున్నారు. దీనికి తగ్గట్టుగానే డ్రెస్ కోడ్‌ను "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" (Fashion Is Art) అని నిర్ణయించారు.

అంటే, కేవలం బట్టలు వేసుకోవడం మాత్రమే కాదు, ధరించే దుస్తులు ఒక అద్భుతమైన కళాఖండాలుగా ఉండాలన్నమాట. ఈ రెడ్ కార్పెట్ వేడుకలో హాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ వేత్తలు, అగ్రశ్రేణి క్రీడాకారులు తమదైన శైలిలో మెరిసిపోనున్నారు.

బాధ్యతల్లో దిగ్గజాలు.. కో-చైర్స్‌గా ఎవరంటే?

మెట్ గాలా అంటేనే అన్నా వింటూర్ పేరు వినిపిస్తుంది. దశాబ్దాలుగా ఈ వేడుకను ముందుండి నడిపిస్తున్న ఆమెతో పాటు ఈసారి పాప్ క్వీన్ బియాన్సే, హాలీవుడ్ నటి నికోల్ కిడ్మాన్, టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్ కో-చైర్స్‌గా వ్యవహరించనున్నారు.

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఆయన భార్య లారెన్ సాంచెజ్ గౌరవ కో-చైర్స్‌గా హాజరుకావడం విశేషం. అంతేకాకుండా, బ్లాక్ పింక్ స్టార్ 'లిసా' హోస్ట్ కమిటీలో చేరిన తొలి కె-పాప్ ఆర్టిస్ట్‌గా రికార్డు సృష్టించింది. సబ్రినా కార్పెంటర్, ఎంజెలా బాసెట్ వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

బాలీవుడ్ నుంచి వెళ్తున్నది ఎవరు?

ఈసారి భారత్ నుంచి వినిపిస్తున్న అతిపెద్ద పేరు కరణ్ జోహార్. బాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ తొలిసారిగా మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టనున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. "ఫ్యాషన్, సినిమాలకు మారుపేరైన కరణ్ జోహార్ కోసం ఈసారి నేను ప్రత్యేకంగా దుస్తులను రూపొందిస్తున్నాను" అని మనీష్ పేర్కొన్నారు.

మెట్ గాలా వేడుకను ప్రత్యక్షంగా చూడాలనుకునే భారతీయ అభిమానులు వోగ్ (Vogue) యూట్యూబ్ ఛానల్‌లో వీక్షించవచ్చు. అమెరికా కాలమానం ప్రకారం మే 4 సాయంత్రం ప్రారంభమయ్యే ఈ వేడుక, భారత కాలమానం ప్రకారం మే 5వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటలకు మొదలవుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. మెట్ గాలా 2026 ఎప్పుడు జరుగుతుంది?

ఈ ఏడాది మెట్ గాలా మే 4న న్యూయార్క్‌లో జరుగుతుంది. భారత్‌లో ఉండేవారు మే 5న తెల్లవారుజామున దీన్ని చూడొచ్చు.

2. ఈసారి మెట్ గాలా థీమ్ ఏమిటి?

"కాస్ట్యూమ్ ఆర్ట్" (Costume Art) అనేది ఈ ఏడాది థీమ్. అతిథులంతా "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" అనే డ్రెస్ కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది.

3. కరణ్ జోహార్ దుస్తులను ఎవరు డిజైన్ చేస్తున్నారు?

ప్రముఖ భారతీయ డిజైనర్ మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్ మెట్ గాలా అరంగేట్రం కోసం ప్రత్యేక దుస్తులను సిద్ధం చేస్తున్నారు.

4. దీపికా పదుకొణె మెట్ గాలా 2026కు హాజరవుతున్నారా?

లేదనే సమాచారం. దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ బ్రేక్‌లో ఉండటం వల్ల ఈ ఏడాది వేడుకకు హాజరుకావడం లేదు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe