Harnaaz Kaur Sandhu Reveals Her Addiction: 2021లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని ముద్దాడి భారత్‌కు గర్వకారణంగా నిలిచిన బ్యూటీ హర్నాజ్ సంధు. మిస్ యూనివర్స్ అందుకున్న తర్వాత హర్నాజ్ సంధు ఎదుర్కొన్న పరిస్థితులు అంత సులభమైనవేమీ కావట. కిరీటం గెలిచిన కొద్ది నెలలకే హర్నాజ్ సంధు బరువు పెరగడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.
ఒకరకమైన అలర్జీ

అయితే, ఆ సమయంలో తను 'సీలియాక్' (Celiac disease) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు హర్నాజ్ సంధు ప్రకటించారు. గోధుమలు, బార్లీ వంటి వాటిలో ఉండే గ్లూటెన్ పడకపోవడం వల్ల కలిగే అలర్జీ ఇది. ఈ నేపథ్యంలో హర్నాజ్ తీసుకున్న ఆహారం, జీవనశైలి ఆమె శరీరంపై తీవ్ర ప్రభావం చూపాయి.
కొంపముంచిన 'కాఫీ' వ్యసనం
తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్నాజ్ సంధు న్యూయార్క్‌లో ఉన్నప్పుడు తనకు అలవాటైన ఒక తీపి వ్యసనం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తను బరువు పెరగడానికి అనారోగ్యంతో పాటు ఒక పానీయం కూడా కారణమని హర్నాజ్ సంధు ఒప్పుకున్నారు.
జిమ్ తర్వాత చేసిన తప్పు
"నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు నా బిల్డింగ్‌లోనే స్టార్‌బక్స్ ఉండేది. జిమ్ పూర్తి చేసిన వెంటనే అక్కడికి వెళ్లి 'వెంటి కారామెల్ ఫ్రాపుచినో' (Venti Caramel Frappuccino) అనే కాఫీ ఆర్డర్ చేసేదాన్ని. అందులో ఎక్స్‌ట్రా డ్రిజిల్, ఎక్స్‌ట్రా షుగర్ ఉండేలా చూసుకునేదాన్ని. నిజానికి అది ఒక డ్రింక్ కాదు, ఒక డెజర్ట్ లాంటిది. జిమ్ చేసిన వెంటనే అంత చక్కెర ఉన్న పానీయం తీసుకోవడం వల్ల నా బాడీ షేప్ పూర్తిగా మారిపోయింది" అని హర్నాజ్ సంధు తన తప్పును ఒప్పుకున్నారు.
మనోవేదన.. మళ్లీ మునుపటి రూపం
బరువు తగ్గాలని కష్టపడుతున్న సమయంలో ఫలితం వెంటనే కనిపించకపోవడంతో హర్నాజ్ సంధు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. "జిమ్‌కు వెళ్లిన మొదటి నెలలో బాడీ ఇంకా ఉబ్బినట్లు అనిపించేది. అద్దంలో చూసుకున్నప్పుడు ఎలాంటి మార్పు కనిపించకపోయేసరికి బాధగా ఉండేది. కానీ, ఓపిక పట్టడం నేర్చుకున్నాను. బరువు చూసే మిషన్ వైపు చూడటం మానేసి, కేవలం వర్కవుట్స్పైనే దృష్టి పెట్టాను. సుమారు ఆరు నెలల తర్వాత నాలో మార్పు మొదలైంది" అని హర్నాజ్ సంధు తన ఫిట్నెస్ జర్నీని వివరించారు.
మళ్లీ పాత్ లుక్‌లోకి హర్నాజ్
{{/usCountry}}బరువు తగ్గాలని కష్టపడుతున్న సమయంలో ఫలితం వెంటనే కనిపించకపోవడంతో హర్నాజ్ సంధు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. "జిమ్‌కు వెళ్లిన మొదటి నెలలో బాడీ ఇంకా ఉబ్బినట్లు అనిపించేది. అద్దంలో చూసుకున్నప్పుడు ఎలాంటి మార్పు కనిపించకపోయేసరికి బాధగా ఉండేది. కానీ, ఓపిక పట్టడం నేర్చుకున్నాను. బరువు చూసే మిషన్ వైపు చూడటం మానేసి, కేవలం వర్కవుట్స్పైనే దృష్టి పెట్టాను. సుమారు ఆరు నెలల తర్వాత నాలో మార్పు మొదలైంది" అని హర్నాజ్ సంధు తన ఫిట్నెస్ జర్నీని వివరించారు.
మళ్లీ పాత్ లుక్‌లోకి హర్నాజ్
{{/usCountry}}సీలియాక్ సమస్యతోపాటు కాఫీ వ్యసనం తన బాడీని నాశనం చేసిందని హర్నాజ్ సంధు ఆ పాడ్‌కాస్ట్‌లో చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే, ప్రస్తుతం హర్నాజ్ సంధు మళ్లీ తన పాత లుక్‌లోకి వచ్చేసింది. మునుపటిలాగే నాజూకైన ఫిజిక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టైగర్ ష్రాఫ్ సరసన 'బాఘీ 4' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. హర్నాజ్ సంధు బరువు పెరగడానికి కారణమైన అనారోగ్య సమస్య ఏమిటి?
హర్నాజ్ 'సీలియాక్ డిసీజ్' (Celiac disease) తో బాధపడుతున్నారు. దీనివల్ల గ్లూటెన్ ఉన్న ఆహారం తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ ప్రతికూలంగా స్పందించి శరీరం ఉబ్బినట్లు అవుతుంది.
2. హర్నాజ్ సంధు ఏ వ్యసనం గురించి మాట్లాడారు?
న్యూయార్క్‌లో ఉన్న సమయంలో ఆమె అధిక చక్కెర కలిగిన 'కారామెల్ ఫ్రాపుచినో' అనే కాఫీ పానీయానికి అలవాటు పడ్డారు. వ్యాయామం చేసిన వెంటనే దీన్ని తీసుకోవడం వల్ల ఆమె బరువు పెరిగారు.
3. హర్నాజ్ సంధు తొలి బాలీవుడ్ సినిమా ఏది?
టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'బాఘీ 4' (Baaghi 4) చిత్రం ద్వారా బాలీవుడ్ వెండితెరపై హర్నాజ్ సంధు ఎంట్రీ ఇచ్చారు.