Harnaaz Sandhu: మిస్ యూనివర్స్ బాడీని నాశనం చేసిన ఆ ఒక్క వ్యసనం- జిమ్ తర్వాత చేసిన తప్పు ఒప్పుకున్న హర్నాజ్ సంధు

Harnaaz Kaur Sandhu Reveals Her Addiction: మిస్ యూనివర్స్ కిరీటం గెలిచిన తర్వాత విపరీతమైన బాడీ షేమింగ్‌కు గురైన హర్నాజ్ సంధు తాజాగా తన బరువు పెరగడానికి గల అసలు కారణాన్ని బయటపెట్టారు. ఒక వ్యసనం తన శరీరాకృతిని ఎలా దెబ్బతీసిందో వివరిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Published on: Apr 23, 2026, 15:13:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Harnaaz Kaur Sandhu Reveals Her Addiction: 2021లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని ముద్దాడి భారత్‌కు గర్వకారణంగా నిలిచిన బ్యూటీ హర్నాజ్ సంధు. మిస్ యూనివర్స్ అందుకున్న తర్వాత హర్నాజ్ సంధు ఎదుర్కొన్న పరిస్థితులు అంత సులభమైనవేమీ కావట. కిరీటం గెలిచిన కొద్ది నెలలకే హర్నాజ్ సంధు బరువు పెరగడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు.

మిస్ యూనివర్స్ బాడీని నాశనం చేసిన ఆ ఒక్క వ్యసనం- జిమ్ తర్వాత చేసిన తప్పు ఒప్పుకున్న హర్నాజ్ సంధు
మిస్ యూనివర్స్ బాడీని నాశనం చేసిన ఆ ఒక్క వ్యసనం- జిమ్ తర్వాత చేసిన తప్పు ఒప్పుకున్న హర్నాజ్ సంధు

ఒకరకమైన అలర్జీ

అయితే, ఆ సమయంలో తను 'సీలియాక్' (Celiac disease) అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు హర్నాజ్ సంధు ప్రకటించారు. గోధుమలు, బార్లీ వంటి వాటిలో ఉండే గ్లూటెన్ పడకపోవడం వల్ల కలిగే అలర్జీ ఇది. ఈ నేపథ్యంలో హర్నాజ్ తీసుకున్న ఆహారం, జీవనశైలి ఆమె శరీరంపై తీవ్ర ప్రభావం చూపాయి.

కొంపముంచిన 'కాఫీ' వ్యసనం

తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్నాజ్ సంధు న్యూయార్క్‌లో ఉన్నప్పుడు తనకు అలవాటైన ఒక తీపి వ్యసనం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తను బరువు పెరగడానికి అనారోగ్యంతో పాటు ఒక పానీయం కూడా కారణమని హర్నాజ్ సంధు ఒప్పుకున్నారు.

జిమ్ తర్వాత చేసిన తప్పు

"నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు నా బిల్డింగ్‌లోనే స్టార్‌బక్స్ ఉండేది. జిమ్ పూర్తి చేసిన వెంటనే అక్కడికి వెళ్లి 'వెంటి కారామెల్ ఫ్రాపుచినో' (Venti Caramel Frappuccino) అనే కాఫీ ఆర్డర్ చేసేదాన్ని. అందులో ఎక్స్‌ట్రా డ్రిజిల్, ఎక్స్‌ట్రా షుగర్ ఉండేలా చూసుకునేదాన్ని. నిజానికి అది ఒక డ్రింక్ కాదు, ఒక డెజర్ట్ లాంటిది. జిమ్ చేసిన వెంటనే అంత చక్కెర ఉన్న పానీయం తీసుకోవడం వల్ల నా బాడీ షేప్ పూర్తిగా మారిపోయింది" అని హర్నాజ్ సంధు తన తప్పును ఒప్పుకున్నారు.

మనోవేదన.. మళ్లీ మునుపటి రూపం

బరువు తగ్గాలని కష్టపడుతున్న సమయంలో ఫలితం వెంటనే కనిపించకపోవడంతో హర్నాజ్ సంధు ఎంతో మానసిక వేదనను అనుభవించారు. "జిమ్‌కు వెళ్లిన మొదటి నెలలో బాడీ ఇంకా ఉబ్బినట్లు అనిపించేది. అద్దంలో చూసుకున్నప్పుడు ఎలాంటి మార్పు కనిపించకపోయేసరికి బాధగా ఉండేది. కానీ, ఓపిక పట్టడం నేర్చుకున్నాను. బరువు చూసే మిషన్ వైపు చూడటం మానేసి, కేవలం వర్కవుట్స్‌పైనే దృష్టి పెట్టాను. సుమారు ఆరు నెలల తర్వాత నాలో మార్పు మొదలైంది" అని హర్నాజ్ సంధు తన ఫిట్‌నెస్ జర్నీని వివరించారు.

మళ్లీ పాత్ లుక్‌లోకి హర్నాజ్

సీలియాక్ సమస్యతోపాటు కాఫీ వ్యసనం తన బాడీని నాశనం చేసిందని హర్నాజ్ సంధు ఆ పాడ్‌కాస్ట్‌లో చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే, ప్రస్తుతం హర్నాజ్ సంధు మళ్లీ తన పాత లుక్‌లోకి వచ్చేసింది. మునుపటిలాగే నాజూకైన ఫిజిక్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టైగర్ ష్రాఫ్ సరసన 'బాఘీ 4' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. హర్నాజ్ సంధు బరువు పెరగడానికి కారణమైన అనారోగ్య సమస్య ఏమిటి?

హర్నాజ్ 'సీలియాక్ డిసీజ్' (Celiac disease) తో బాధపడుతున్నారు. దీనివల్ల గ్లూటెన్ ఉన్న ఆహారం తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ ప్రతికూలంగా స్పందించి శరీరం ఉబ్బినట్లు అవుతుంది.

2. హర్నాజ్ సంధు ఏ వ్యసనం గురించి మాట్లాడారు?

న్యూయార్క్‌లో ఉన్న సమయంలో ఆమె అధిక చక్కెర కలిగిన 'కారామెల్ ఫ్రాపుచినో' అనే కాఫీ పానీయానికి అలవాటు పడ్డారు. వ్యాయామం చేసిన వెంటనే దీన్ని తీసుకోవడం వల్ల ఆమె బరువు పెరిగారు.

3. హర్నాజ్ సంధు తొలి బాలీవుడ్ సినిమా ఏది?

టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'బాఘీ 4' (Baaghi 4) చిత్రం ద్వారా బాలీవుడ్ వెండితెరపై హర్నాజ్ సంధు ఎంట్రీ ఇచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More