ఓటీటీలు వచ్చాక ఏ సినిమా రెస్పాన్స్ ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం. థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమా ఓటీటీకి వచ్చాక యావరేజ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. కానీ, థియేటర్లలో ఫ్లాప్‌గా నిలిచిన సినిమాలు మాత్రం ఓటీటీలో సూపర్ హిట్ రెస్పాన్స్ తెచ్చుకుంటాయి.
థియేటర్లలో ఫ్లాప్ టాక్

ఇలా థియేటరల్లో ఫ్లాప్‌గా.. ఓటీటీల్లో హిట్‌గా నిలిచే సినిమాలే ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి ఓ తెలుగు క్రైమ్ కామెడీ మూవీనే ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. ఆ సినిమా మరేదే కాదు మిత్ర మండలి.
ప్రియదర్శి-నిహారిక ఎన్ఎమ్
నిర్మాత బన్నీ వాస్ సమర్పణలో బీవీ వర్క్స్, సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్స్‌పై విజయేందర్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'మిత్ర మండలి'. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్ హీరో హీరోయిన్లుగా జంటగా నటిస్తూ వెండి తెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.
మిత్ర మండలి నటీనటులు
కల్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన మిత్ర మండలి సినిమాకు ఆర్‌ఆర్ ధ్రువన్ సంగీతాన్ని అందించారు. సిద్ధార్థ సినిమాటోగ్రఫీ వర్క్ చూసుకున్నారు. హీరో హీరోయిన్లతోపాటు మిత్ర మండలి సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
ఐఎమ్‌డీబీ రేటింగ్
ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీన థియేటర్లలో విడుదలైన మిత్ర మండలి సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి పదికి కేవలం 4.2 రేటింగ్ తెచ్చుకుంది. అంటే బిలో యావరేజ్‌గా ఈ సినిమా నిలిచింది.
టాప్ 2 ట్రెండింగ్‌లో
ఇలా చెత్త రేటింగ్ తెచ్చుకున్న మిత్ర మండలి ఓటీటీలో మాత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో మిత్ర మండలి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో టాప్ #2 ట్రెండింగ్‌లో నిలిచింది మిత్ర మండలి సినిమా.
కాంతార సినిమాకు పోటీగా
{{/usCountry}}ఇలా చెత్త రేటింగ్ తెచ్చుకున్న మిత్ర మండలి ఓటీటీలో మాత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. నవంబర్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో మిత్ర మండలి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్‌లో టాప్ #2 ట్రెండింగ్‌లో నిలిచింది మిత్ర మండలి సినిమా.
కాంతార సినిమాకు పోటీగా
{{/usCountry}}ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో టాప్ #1 ట్రెండింగ్‌లో ఉన్న కాంతార చిత్రానికి పోటీగా నిలుస్తూ మరింత వేగంగా ప్రేక్షకులను అలరిస్తూ మిత్ర మండలి దూసుకు వెళ్తోందని మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు. చెత్త రేటింగ్ తెచ్చుకున్న మిత్ర మండలి ఓటీటీ ట్రెండింగ్‌లో హిట్‌తో దూసుకుపోవడం విశేషంగా మారింది.
నలుగురు మిత్రుల మధ్య
ఇకపోతే మిత్ర మండలి సినిమాలో ఒక పట్టణంలోని నలుగురు మిత్రుల మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలను సహజంగా చూపించారు. వారి మధ్య జరిగే సన్నివేశాలను, సందర్భాలను పూర్తి స్థాయిలో వినోదభరితంగా ఉందని కామెంట్స్ వినిపించాయి.
మేకర్స్ కామెంట్స్
మంచి విజువల్స్‌తో ఉన్నతమైన నిర్మాణ విలువలతో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా మిత్ర మండలి చిత్రం అన్ని జోనర్ల ప్రేక్షకులను అలరిస్తోందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.