ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో స్కూల్ పిల్లలు చూసేలా ఉండే అడ్వెంచర్ హారర్ మూవీస్‌పై పేరెంట్స్ నుంచి స్టూడెంట్స్ వరకు ఇంటిల్లిపాది చూడాలనుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు.
టీనేజ్ హారర అడ్వెంచర్ థ్రిల్లర్

అలాంటి టైమ్‌లో అదే కథతో వచ్చిన హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమానే మాన్‌స్టర్ సమ్మర్. ఇది ఒక టీనేజ్ హారర అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. అంటే, ఇందులో స్కూల్ పిల్లల చుట్టూ సాగే హారర్ అడ్వెంచర్ మిస్టరీ కథ ఇది. వేసవిలో స్కూల్ పిల్లలను వెంటాడే ఓ రాకాసి, దాంతో ఆ పిల్లల పోరాటం వంటి కథతో మాన్‌స్టర్ సమ్మర్ మూవీ సాగుతుంది.
మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ
ఇలాంటి మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీలోకి తెలుగులో కూడా వచ్చేసింది. హాలీవుడ్ సీనియర్ నటుడు మెల్ గిబ్సన్, ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’ ఫేమ్ మాసన్ థేమ్స్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే మాన్‌స్టర్ సమ్మర్. ఈ సినిమా గతేడాది అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైంది.
ఇండియన్ ఓటీటీ వేదికపై
ఆ తర్వాత సుమారు తొమ్మిది నెలలకు పారామౌంట్ ప్లస్ విత్ షో టైమ్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో మాన్‌స్టర్ సమ్మర్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. కానీ, ఈ ప్లాట్‌ఫామ్‌లో భారతీయులు కాకుండా అమెరికాలో మాత్రమే చూడగలరు. కానీ, ఇప్పుడు ఇండియన్ ఓటీటీ వేదికపైకి కూడా మాన్‌స్టర్ సమ్మర్ సినిమా వచ్చేసింది.
4 భాషల్లో స్ట్రీమింగ్
జియో హాట్‌స్టార్‌లో మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, ఇండియన్స్ కూడా హాట్‌స్టార్ ఓటీటీలో మాన్‌స్టర్ సమ్మర్ మూవీని ఎంచక్కా చూసేయొచ్చు. మార్చి 20న మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్ భాషలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అసలు కథేంటంటే?
{{/usCountry}}జియో హాట్‌స్టార్‌లో మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, ఇండియన్స్ కూడా హాట్‌స్టార్ ఓటీటీలో మాన్‌స్టర్ సమ్మర్ మూవీని ఎంచక్కా చూసేయొచ్చు. మార్చి 20న మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్ భాషలోనే కాకుండా తెలుగు, తమిళం, హిందీ వంటి నాలుగు భాషల్లో మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అసలు కథేంటంటే?
{{/usCountry}}ఒక ప్రశాంతమైన ఐలాండ్‌లో స్కూల్ స్నేహితులంతా కలిసి వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే, ఊహించని విధంగా ఒక రహస్యమైన అతీంద్రియ శక్తి వారి ఆనందాన్ని ఆవిరి చేస్తుంది. ద్వీపంలోని వారందరినీ ప్రమాదంలోకి నెడుతుంది.
మూవీ ట్విస్టులు
ఈ క్రమంలో రిటైర్డ్ పోలీస్ డిటెక్టివ్ (మెల్ గిబ్సన్) సాయంతో ఆ స్కూల్ పిల్లల బృందం ఆ వింత శక్తుల వెనుక ఉన్న నిజాన్ని ఎలా కనిపెట్టారు? ఆ రాకాసితో ఎలా పోరాటం చేశారు? అసలు ఆ రాకాసి వల్ల వచ్చిన ప్రమాదం ఏంటీ? దాని బారిన పడిన పిల్లలకు ఏమైంది? స్కూల్ పిల్లల వెంటే ఆ మాన్‌స్టర్ ఎందుకు పడింది? తమ ద్వీపాన్ని పిల్లలు ఎలా కాపాడుకున్నారు? అన్నదే ఈ సినిమా ఇతివృత్తం.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
మాన్‌స్టర్ సమ్మర్ సినిమాలో మెల్ గిబ్సన్‌తో పాటు జూలియన్ లెర్నర్, అబ్బీ జేమ్స్ విదర్‌స్పూన్ వంటి తారలు నటించారు. మరి ఈ స్కూల్ పిల్లలు, రాకాసి, పోరాటం వంటి కాన్సెప్ట్‌తో వచ్చిన గంట 37 నిమిషాలు గల మాన్‌స్టర్ సమ్మర్ సినిమాను జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.