...
...
Next Story

తెలుగు హీరోల సత్తా.. ఇండియాలో టాప్ 10 హీరోల లిస్ట్ లో ఆరుగురు మనోళ్లే.. ప్రభాస్‌దే టాప్ ప్లేస్‌

ఇండియాలో టాలీవుడ్ హీరోల డామినెన్స్ కొనసాగుతోంది. హిందీ హీరోలను వెనక్కినెట్టి మరి మన తెలుగు కథానాయకులు జోరు కొనసాగిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ఇండియన్ టాప్ 10 హీరోల లిస్ట్ పై ఓ లుక్కేయండి. ఇందులో ప్రభాస్ నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.

Published on: Dec 22, 2025, 13:11:09 IST
Advertisement

ఇండియాలో తెలుగు హీరోల డామినెన్స్ కొనసాగుతోంది. ఓ వైపు తెలుగు సినిమాలు ఇండియన్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్నాయి. మరోవైపు టాలీవుడ్ హీరోలు క్రేజ్ పరంగా మిగతా ఇండస్ట్రీల కథానాయకులను వెనక్కి నెడుతున్నారు. ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన నవంబర్ 2025 ఇండియా టాప్ 10 హీరోల లిస్ట్ లో ప్రభాస్ నంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు.

ప్రభాస్ నంబర్ వన్

ప్రభాస్
ప్రభాస్

బాహుబలి సినిమాలతో తిరుగులేని క్రేజ్ దక్కించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన హీరోగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. నవంబర్ నెలకు గాను అతనిదే నంబర్ వన్ స్థానం. సలార్, కల్కి లాంటి మూవీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాస్. 2026 సంక్రాంతికి రాజాసాబ్ అంటూ థియేటర్లకు రాబోతున్నాడు.

దళపతి విజయ్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ తన చివరి సినిమా జన నాయగన్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ మూడో స్థానంలో నిలిచాడు. కింగ్ షారుక్ కు క్రేజ్ కొనసాగుతూనే ఉంది.

అల్లు అర్జున్

నవంబర్ నెలకు గాను ఇండియా టాప్ 10 హీరోల లిస్ట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాలుగో ప్లేస్ లో నిలిచాడు. పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ గ్రాఫ్ మరో లెవల్ కు చేరుకుంది. అతను ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.

మహేష్ బాబు

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. ఆర్మాక్స్ ఇండియా టాప్ 10 హీరోల్లో రామ్ చరణ్ ఏడో ప్లేస్ లో ఉన్నాడు. ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఇక ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చేస్తున్న తారక్ ఏమో ఎనిమిదో ప్లేస్ లో ఉన్నాడు. మరోవైపు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ 9వ ప్లేస్ లో ఉన్నాడు.

లిస్ట్ లో పవన్

ఆర్మాక్స్ మీడియా ఇండియా టాప్ 10 హీరోల లిస్ట్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఉన్నాడు. ఓజీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ క్రేజ్ మరింత పెరిగింది. ఆయన ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe