...
...
Next Story

Mr Deyyam: ఎన్నడూ చూడని హారర్ ఎలిమెంట్స్‌తో మిస్టర్ దెయ్యం- కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ ప్రధాన పాత్ర- పూజకు మంచు మనోజ్

Mr Deyyam Pooja Ceremony Manchu Manoj: విజయ్ శంకర్, సిరి చౌదరి, ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో సంజన అన్నే దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘మిస్టర్ దెయ్యం’ పూజా కార్యక్రమాలతో ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంచు మనోజ్ నుంచి కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి వరకు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Published on: Oct 23, 2026, 18:26:20 IST
Advertisement

Mr Deyyam Pooja Ceremony Manchu Manoj: శౌర్య ఆర్య సమర్పణలో అన్నే క్రియేషన్స్ బ్యానర్ మీద వెంకట్ నిమ్మలపూడి, సింధు అన్నే నిర్మిస్తున్న సరికొత్త తెలుగు చిత్రం ‘మిస్టర్ దెయ్యం’. తాజాగా ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 23) మిస్టర్ దెయ్యం సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

ప్రధాన పాత్రలో అలీ తమ్ముడు ఖయ్యూమ్

ఎన్నడూ చూడని హారర్ ఎలిమెంట్స్‌తో మిస్టర్ దెయ్యం- కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ ప్రధాన పాత్ర- పూజకు మంచు మనోజ్
ఎన్నడూ చూడని హారర్ ఎలిమెంట్స్‌తో మిస్టర్ దెయ్యం- కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ ప్రధాన పాత్ర- పూజకు మంచు మనోజ్

మిస్టర్ దెయ్యం సినిమాలో విజయ్ శంకర్, సిరి చౌదరి, కమెడియన్ అలీ తమ్ముడు ఖయ్యూమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంజన అన్నే దర్శకత్వం వహించనున్నారు.

మిస్టర్ దెయ్యం పూజా కార్యక్రమం

ఈరోజు నిర్వహించిన మిస్టర్ దెయ్యం పూజా కార్యక్రమానికి రాకింగ్ స్టార్ మంచు మనోజ్, కమెడియన్ అలీ, డైరెక్టర్ విజయ్ కనకమేడల, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్, పట్నం మహేందర్ రెడ్డి, రమేష్ పుప్పాల, నటుడు సమీర్, చింటు, వీర శంకర్, రాజా వన్నెం రెడ్డి, వీఎన్ ఆదిత్య, జ్యోత్స, లేబర్ కమిషనర్ గంగాధర్, కొరియోగ్రాఫర్ విజయ్ పోలకి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

సెలబ్రిటీల ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ముహుర్తపు సన్నివేశానికి మంచు మనోజ్ క్లాప్ కొట్టగా, అలీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విజయ్ కనకమేడల ఫస్ట్ షాట్‌కి డైరెక్షన్ చేయగా.. వీఎన్ ఆదిత్య, ఆర్పీ పట్నాయక్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ పూజా కార్యక్రమం అనంతరం సెలబ్రిటీలంతా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నా ప్రయాణంలో మీడియా సపోర్ట్

నటుడు ఖయ్యూమ్ మాట్లాడుతూ .. "‘మిస్టర్ దెయ్యం’ టైటిల్ బాగుంది. ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించబోతోన్నాను. ఎప్పటిలానే నన్ను, నా ఈ మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నాను" అని తెలిపారు.

ఎప్పుడు చూడని హారర్ ఎలిమెంట్స్

విజయ్ శంకర్ మాట్లాడుతూ .. "‘మిస్టర్ దెయ్యం’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇలాంటి అద్భుతమైన సంస్థలో పని చేస్తుండటం ఆనందంగా ఉంది. సంజన గారు ఈ మూవీని అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా రానుంది. ఇది వరకెన్నడూ చూడనటువంటి హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇదొక బెస్ట్ హారర్ మూవీగా నిలుస్తుంది" అని చెప్పుకొచ్చారు.

నవంబర్ మొదటి వారంలో షూటింగ్

సిరి చౌదరి మాట్లాడుతూ .. "‘మిస్టర్ దెయ్యం’ మూవీ ఓపెనింగ్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నవంబర్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. మా సినిమాను ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను" అని కోరారు.

అందరిని భయపెడుతూ నవ్వించేలా

పింగ్ పాంగ్ సూర్య మాట్లాడుతూ .. "‘మిస్టర్ దెయ్యం’ అందరినీ భయపెడుతూ, నవ్వించేలా ఉంటుంది. సంజన గారితో ఇది వరకు నేను పని చేశాను. ఈ సినిమా అందరినీ అలరించేలా ఉంటుంది" అని పేర్కొన్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks