...
...
Next Story

Mrunal Thakur: అతను నా లక్కీ చార్మ్, ఆయన లేకపోతే నేను లేను.. హీరోపై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ కామెంట్స్

Mrunal Thakur Praises Ranveer Singh: అడివి శేష్ హీరోగా తెరకెక్కిన లవ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా డెకాయిట్. ఈ సినిమాలో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. డెకాయిట్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ ధురంధర్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను పొగిడింది.

Updated on: Apr 8, 2026, 12:56:34 IST
Advertisement

Mrunal Thakur Praises Ranveer Singh: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు వారి మనసు దోచుకుంది. ఇప్పుడు అడివి శేష్ డెకాయిట్ మూవీతో మరోసారి టాలీవుడ్ ఆడియెన్స్‌ను అలరించడానికి రెడీగా ఉంది. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రణ్‌వీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో

అతను నా లక్కీ చార్మ్, ఆయన లేకపోతే నేను లేను.. హీరోపై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ కామెంట్స్
అతను నా లక్కీ చార్మ్, ఆయన లేకపోతే నేను లేను.. హీరోపై మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రూ. 1600 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో హీరో రణ్‌వీర్ సింగ్‌పై డేకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రశంసల వర్షం కురిపించారు. రణ్‌వీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ తన సినీ ప్రయాణంలో రణ్‌వీర్ ఏ విధంగా అండగా నిలిచారో చెప్పుకొచ్చింది.

రణ్‌వీర్ వల్లే ఇండస్ట్రీలో ఉన్నాను

"రణ్‌వీర్ నా లక్కీ చార్మ్. ఈ రోజు నేను చిత్ర పరిశ్రమలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే" అంటూ మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అయింది. తన కెరీర్ తొలినాళ్లలో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఒక హెయిర్ బ్రాండ్ యాడ్ (Commercial)లో నటించానని, ఆ యాడ్ విడుదలయ్యాకే తనను ఫిల్మ్ మేకర్స్ గుర్తించడం ప్రారంభించారని ఆమె తెలిపింది. రణ్‌వీర్ ఎంతో పాజిటివ్ వ్యక్తి అని, ఆయనకు దక్కుతున్న ఈ విజయానికి తాను అర్హుడని మృణాల్ పేర్కొంది.

హీరోలా కాదు.. హమ్జాగా జీవించాడు!

ఇదిలా ఉంటే, మార్చి 19న విడుదలైన ‘ధురంధర్ 2’ కేవలం 20 రోజుల్లోనే ఇండియాలో రూ. 1032 కోట్ల వసూళ్లను సాధించి, ‘బాహుబలి 2’ లైఫ్‌టైమ్ రికార్డులను కూడా అధిగమించింది. పాకిస్థాన్ అండర్ వరల్డ్‌లో ఇండియన్ స్పైగా రణ్‌వీర్ సింగ్ చేసిన యాక్టింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రణ్‌వీర్‌తో పాటు ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు.

మృణాల్ ఠాకూర్ ప్రాజెక్ట్

మరోవైపు మృణాల్ ఠాకూర్ కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ (Dacoit) ఏప్రిల్ 10న విడుదల కానుంది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో డైరెక్టర్, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe