తెలుగులో విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్న హీరో, నటుడు నవీన్ చంద్ర. హీరోగా డిఫరెంట్ మూవీస్ చేస్తూనే మరోవైపు నటుడిగా మెప్పించే పాత్రలతో ఆకట్టుకుంటున్నాడు. అలాంటి నవీన్ చంద్ర నటించిన మరో లేటెస్ట్ మూవీనే హనీ.
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్

నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన హనీ సినిమాకు కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించారు. హనీ మూవీని తెలుగు సైకలాజికల్ హారర్ జోనర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఓవీఏ (OVA) ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి హనీ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.
నిజ జీవిత సంఘటనలతో
హనీ సినిమాను నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణతో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజికల్ ఎలిమెంట్స్‌తో తీర్చి దిద్దారు. ఫిబ్రవరి 6న ఈ హనీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
హనీ నటీనటులు
హనీ మూవీలో హీరో హీరోయిన్ల నవీన్ చంద్ర, దివ్య పిళ్లైతోపాటు బిగ్ బాస్ దివి వాద్యా, నటుడు రాజా రవీంద్ర, బేబీ జయన్ని, బేబీ జయత్రి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. అజయ్ అరసాడ హనీ సినిమాకు సంగీతం అందిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, నగేష్ బన్నెల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
హనీ ఓటీటీ ప్లాట్‌ఫామ్
ఇదిలా ఉంటే, హనీ మూవీ చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. కానీ, అప్పుడే హనీ ఓటీటీ రైట్స్ అమ్ముడు పోయాయి. హనీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగులో చేసింది. అంటే, థియేట్రికల్ రిలీజ్ అనంతరం అమెజాన్ ప్రైమ్‌లోనే హనీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
హారర్ అంశాల సమ్మేళనం
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హనీ మూవీపై ఎంత క్రేజ్ ఉందో. ఇకపోతే సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది.
మాస్ జాతరలో విలన్‌గా
{{/usCountry}}దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు హనీ మూవీపై ఎంత క్రేజ్ ఉందో. ఇకపోతే సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది.
మాస్ జాతరలో విలన్‌గా
{{/usCountry}}కాగా, నవీన్ చంద్ర ఇటీవలే రవితేజ-శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన మాస్ జాతర సినిమాలో విలన్‌గా మెప్పించాడు. అంతకుముందు పలు ఓటీటీ సిరీస్‌లు, సినిమాలతో నవీన్ చంద్ర ఆకట్టుకున్నాడు. నవీన్ చంద్ర సినిమాలు ఎక్కువగా అమెజాన్ ప్రైమ్‌లోనే ఓటీటీ రిలీజ్ అవడం విశేషం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనే
నవీన్ చంద్ర డిఫరెంట్ థ్రిల్లర్స్ జోనర్లలో నటించిన లెవెన్, బ్లైండ్ స్పాట్, 28 డిగ్రీస్ సెల్సియస్ సినిమాలతోపాటు ఇన్‌స్పెక్టర్ రిషి సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలు, సిరీస్‌లన్నీ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.