...
...
Next Story

Naveen Polishetty:ఒకే ఫ్రేమ్‌లో 5500 కోట్ల దర్శకులు, నిర్మాతలు- నవీన్ పోలిశెట్టి మాటలకు నవ్వులే నవ్వులు-ఎవరెవరున్నారంటే?

Naveen Polishetty In 5500 Cr Frame: టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇండస్ట్రీలోని టాప్ దర్శకులు, నిర్మాతలతో కలిసి ఆయన చేసిన హంగామా చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నవీన్ పోలిశెట్టి మాటలకు ప్రశాంత్ నీల్ అస్సలు నవ్వు ఆపుకోలేకపోయారు.

Published on: Jun 25, 2026, 17:32:08 IST
Advertisement

Naveen Polishetty In 5500 Cr Frame: ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో సూపర్ హిట్ హీరోగా పేరు తెచ్చుకుని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పొలిశెట్టి. ఆ తర్వాత వచ్చిన ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి ‘స్టార్ ఎంటర్‌టైనర్’గా మారిపోయారు.

నవీన్ పోలిశెట్టి సర్‌ప్రైజ్

ఒకే ఫ్రేమ్‌లో 5500 కోట్ల దర్శకులు, నిర్మాతలు- నవీన్ పోలిశెట్టి మాటలకు నవ్వులే నవ్వులు-ఎవరెవరున్నారంటే?
ఒకే ఫ్రేమ్‌లో 5500 కోట్ల దర్శకులు, నిర్మాతలు- నవీన్ పోలిశెట్టి మాటలకు నవ్వులే నవ్వులు-ఎవరెవరున్నారంటే?

కేవలం వెండితెరపైనే కాదు, బయట కూడా ఎక్కడ కనిపించినా తనదైన కామెడీ టైమింగ్‌తో వంద శాతం వినోదాన్ని పంచడం నవీన్ ప్రత్యేకత. కొంతకాలంగా కొత్త సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నవీన్ పోలిశెట్టి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు.

తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పాన్ ఇండియా డైరెక్టర్లతో కలిసి ఉన్న ఒక ఫన్నీ వీడియోను షేర్ చేసి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు నవీన్ పోలిశెట్టి.

సాధారణంగా స్టార్ హీరోలు పెద్ద దర్శకులతో ఫొటోలు దిగితేనే అదొక సంచలనం అవుతుంది.

డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు

అలాంటిది నవీన్ పొలిశెట్టి ఏకంగా భారతీయ చిత్ర పరిశ్రమను శాసిస్తున్న అగ్ర దర్శకులు, ప్రొడ్యూసర్లను ఒకే ఫ్రేమ్‌లోకి తెచ్చి, తన మార్క్ కామెడీతో ఆటపట్టించారు. తన జీవితంలోనే అత్యంత ఖరీదైన ఫ్రేమ్ ఇదంటూ నవీన్ పోలిశెట్టి ఈ వీడియోను పంచుకోవడం విశేషం.

రూ. 5,500 కోట్ల ఫ్రేమ్.. ఎవరెవరు ఉన్నారంటే?

ఈ వీడియోలో నవీన్ పొలిశెట్టి తన పక్కన ఉన్న సెలబ్రిటీల పేర్లు చెప్పకుండా, వారు బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షన్ల నంబర్లను చెప్తూ వినోదాన్ని పండించారు. మొదటగా రజనీకాంత్ ‘కూలీ’ సినిమా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌ను చూపిస్తూ ‘500 కోట్లు’ అని లెక్కేశారు.

నవీన్ పొలిశెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వందల, వేల కోట్ల లెక్కలు చెబుతుండటంతో పక్కనే ఉన్న ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ నవ్వు ఆపుకోలేకపోయారు. కెమెరా వైపు చూడలేక వెనక్కి తిరిగేసి గట్టిగా నవ్వేశారు. ఈ క్రేజీ ఫ్రేమ్‌లో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా కనిపించారు.

వీళ్లందరి బాక్సాఫీస్ స్టామినాను టోటల్ చేసి, ఇదంతా కలిపి ‘రూ. 5500 కోట్ల ఫ్రేమ్’ అని నవీన్ పంచ్ వేయడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ‘నవీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు తిరుగులేదు’ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

త్వరలోనే కొత్త సినిమా అప్‌డేట్

నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమాలో సంక్రాంతి బరిలో నిలిచి మంచి హిట్టే అందుకుంది. అయితే, ఇటీవల నవీన్ పోలిశెట్టికి జరిగిన ఒక చిన్న ప్రమాదం వల్ల కొంతకాలం షూటింగులకు బ్రేక్ పడింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన నవీన్, ఈ ఫన్నీ వీడియో ముగింపులో అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు.

"నా కొత్త సినిమా అప్‌డేట్‌ను చాలా త్వరలోనే మీ ముందుకు తెస్తాను" అని నవీన్ పొలిశెట్టి తన పోస్టులో స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఈ రూ. 5,500 కోట్ల ఫ్రేమ్‌లోని దర్శకుల్లో ఎవరితోనైనా నవీన్ తదుపరి సినిమా ఉండనుందా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe