టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన లేటెస్ట్ విలేజ్ కామెడీ సినిమా అనగనగా ఒక రాజు. జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
నవీన్ పోలిశెట్టి కామెంట్స్

ఈ నేపథ్యంలో ఇటీవల అనగనగా ఒక రాజు థాంక్యూ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ పోలిశెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. "అందరీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మాకు ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, మాకు మద్దతుగా నిలిచిన మీడియా మిత్రులకు పేరుపేరునా కృతఙ్ఞతలు" అని అన్నారు.
ఒకట్రెండు సినిమాలు అలా
"సితార ఎంటర్టైన్మెంట్స్ అనేది బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్. ఎన్నో మైలురాయి లాంటి చిత్రాలను అందించారు. అలాంటి సంస్థ నుంచి ఇటీవల ఒకట్రెండు సినిమాలు ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇలాంటి తరుణంలో 'అనగనగా ఒక రాజు' రూపంలో ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ ను అందించడం.. మా అందరికీ సంతోషాన్ని కలిగించింది. ముఖ్యంగా నాగవంశీ గారి ముఖంలో చిరునవ్వు చూడటం సంతోషాన్ని ఇచ్చింది. ఆయన ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను" అని నవీన్ పోలిశెట్టి తెలిపాడు.
"మా గురువు గారు త్రివిక్రమ్ గారు, చినబాబు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. త్రివిక్రమ్ గారు, చినబాబు గారు ఈ సినిమా విషయంలో మమ్మల్ని నమ్మి ఎంతగానో ప్రోత్సహించారు. మేము చెప్పింది నమ్మి ఏ ఎపిసోడ్లు అయితే సినిమాలో ఉంచడానికి వారు అంగీకరించారో.. ఇప్పుడు ఆ ఎపిసోడ్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది" అని నవీన్ పోలిశెట్టి పేర్కొన్నాడు.
మొదటి సన్నివేశం నుంచి
"ఫస్ట్ హాఫ్‌లో మొదటి సన్నివేశం నుంచి ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులు ఆగకుండా నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్‌లో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాము" అని నవీన్ పోలిశెట్టి వెల్లడించాడు.
{{/usCountry}}"ఫస్ట్ హాఫ్‌లో మొదటి సన్నివేశం నుంచి ఇంటర్వెల్ వరకు ప్రేక్షకులు ఆగకుండా నవ్వుతున్నారు. సెకండ్ హాఫ్‌లో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్కి కూడా అద్భుతమైన స్పందన లభిస్తోంది. నా సినిమాలలో వినోదానికి పెద్ద పీట వేస్తుంటాను. అయితే ఇందులో వినోదంతో పాటు మంచి భావోద్వేగాలను కూడా అందించాలి అనుకున్నాము" అని నవీన్ పోలిశెట్టి వెల్లడించాడు.
{{/usCountry}}"నాకు రాజ్‌కుమార్ హిరానీ (బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు) గారి సినిమాలంటే ఇష్టం. తెలుగులో అలాంటి సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేశాము. శ్రీరాములు లాంటి ఒక మాస్ థియేటర్లో ఈ సినిమా చూశాం. ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్‌ని ఎంతలా ఎంజాయ్ చేశారో, ఎమోషనల్ సీన్లకు అదే స్థాయిలో చప్పట్లు వర్షం కురిపించారు. మా కథ అన్ని వర్గాలు ప్రేక్షకులకు చేరువ అయిందని మాకు అప్పుడే అనిపించింది" అని నవీన్ పోలిశెట్టి చెప్పుకొచ్చాడు.
ఎవరెవరు పాల్గొన్నారంటే
ఇదిలా ఉంటే, అనగనగా ఒక రాజు థ్యాంక్యూ మీట్ కార్యక్రమంలో ఛాయాగ్రాకుడు యువరాజు, కళా దర్శకుడు గాంధీ, నటుడు చంద్ర, హీరో హీరోయిన్లు, రావు రమేష్ తదితరులు పాల్గొన్నారు. సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపారు.