హ్యాపీడేస్ సినిమాతో హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ వంటి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అనంతరం కుర్రాడు, మరో చరిత్ర, ఇందువదన, నింద, విరాజి వంటి చిత్రాలతో అలరించాడు వరుణ్ సందేశ్.
ఓటీటీలోకి వరుణ్ సందేశ్

ఈ ఏడాది రాచరికం సినిమాలో కనిపించాడు వరుణ్ సందేశ్. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు హీరో వరుణ్ సందేశ్. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. వరుణ్ సందేశ్ నటించిన లేటెస్ట్ సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్ ఓటీటీ సిరీసే నయనం.
సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్
ఇప్పటికే భిన్నమైన జోనర్స్‌తో అలరించిన వరుణ్ సందేశ్ మరోసారి విలక్షణమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో రానున్నట్లు తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కున్న నయనం వెబ్ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించనున్నారు.
నయనం ఫస్ట్ లుక్ రిలీజ్
ఇదిలా ఉంటే, తాజాగా ఇవాళ (డిసెంబర్1) నయనం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. కర్లీ హెయిర్‌తో స్పెక్ట్స్ పెట్టుకుని సీరియస్‌గా చూస్తున్న వరుణ్ సందేశ్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ సిరీస్‌తో వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
6 ఎపిసోడ్స్‌తో సిరీస్
ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ నయనంలో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ పరిచయం కాబోతున్నాడు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో ఆవిష్కరించారు.
జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్
{{/usCountry}}ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ నయనంలో ఆరు ఎపిసోడ్స్ ఉన్నాయి. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ పరిచయం కాబోతున్నాడు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో ఆవిష్కరించారు.
జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్
{{/usCountry}}ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో మెప్పిస్తోన్న జీ5 ఇండియాలో అతి పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఒకటి. అలాంటి జీ5 ఓటీటీ మరోసారి తనదైన శైలిలో డిఫరెంట్ ఒరిజినల్ సిరీస్‌తో ఆడియెన్స్‌ను అలరించనుంది. అంటే జీ5లో నయనం ఓటీటీ రిలీజ్ కానుంది.
వరుణ్ సందేశ్ కామెంట్స్
డిసెంబర్ 19 నుంచి జీ5లో నయనం ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. లేటెస్ట్‌గా ఈ ఒరిజినల్ ఫస్ట్ లుక్‌ను జీ5 విడుదల చేసి వరుణ్ సందేశ్ ఓటీటీ ఎంట్రీపై అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
విభిన్నమైన పాత్రలో
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ "నటుడిగా నాకు ఇది సరికొత్త ప్రయాణం. ఇప్పటి వరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నాను. పోస్టర్‌ను గమనిస్తే నా పాత్రలో ఇంటెన్సిటీ అర్థమవుతుంది" అని అన్నాడు.
జీ5 ఓటీటీలో నయనం
"ఓటీటీలో యాక్ట్ చేయటం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్‌ను మరింతగా ఎలివేట్ చేసినట్లయ్యింది. డిసెంబర్ 19న జీ5 ఓటీటీలో ప్రీమియర్ కానున్న నయనంను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలని చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను" అని వరుణ్ సందేశ్ తెలిపాడు.