Nenu OTT Release Today: ప్రతి వారం ఓటీటీల్లోకి సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో తెలుగు ఓటీటీ రిలీజ్ అయిన తెలుగు సినిమాలు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అచ్చమైన తెలుగు కథలతో సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఓటీటీలోకి సరికొత్త తెలుగు ఫ్యామిలీ డ్రామా సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
ముగింపు లేని బాధ్యతల ప్రయాణం

ప్రతి ఇంట్లో ఒక ఇల్లాలు ఉంటుంది.. ఆమెకు అందరి ఇష్టాఇష్టాలు తెలుసు కానీ, ఆమె ఇష్టం ఏంటో మాత్రం ఎవరికీ అవసరం లేదు. సరిగ్గా ఇదే పాయింట్‌తో తెరకెక్కిన తెలుగు చిత్రమే 'నేను'. తెలుగు నటి శరణ్య ప్రదీప్ టైటిల్ రోల్ పోషించిన నేను ఓటీటీలోకి ఇవాళ (మే 10) వచ్చేసింది.
కేవలం ఒక భార్యగా, ఒక తల్లిగా మాత్రమే కాకుండా, ఇంటి బయట ఆఫీసు పనులను కూడా చక్కబెడుతూ.. ఆ క్రమంలో తన అస్తిత్వాన్ని వెతుక్కునే ఒక మహిళ ప్రయాణమే ఈ కథ. భార్య ఓపిక్ శాపంగా మారి భర్త, బాస్ మధ్య నలిగే ఇల్లాలి కథగా ఈ సినిమాను రూపొందించారు. గుండె తరుక్కుపోయే సన్నివేశాలతో ప్రతి మహిళ గురించి ఆలోచింపజేసేలా నేను మూవీ సాగుతుంది.
శరణ్య ప్రదీప్ నటన - చిత్రానికి వెన్నెముక
'ఫిదా' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న శరణ్య ప్రదీప్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, భామాకలాపం 2 వంటి సినిమాలతో ఆకట్టుకుంది. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శరణ్య ప్రదీప్ నేను మూవీలో తన రియల్ నేమ్ అయిన శరణ్య పాత్రలో జీవించేసింది.
కుటుంబ సభ్యుల అవసరాలు, పని ఒత్తిడి, సమాజం విధించే కట్టుబాట్లు.. వీటన్నింటి మధ్య ఓపికతో నలిగిపోయే సగటు మహిళ భావోద్వేగాలను శరణ్య ప్రదీప్ అద్భుతంగా పండించారు. అరుణాచల మహేష్, శ్రీనివాస్ నాయుడు, ఆర్కే నాయుడు వంటి నటీనటులు తమ పరిధి మేరకు చక్కగా నటించారు. కుషాలిని పులప, జ్యోతి స్వరూప్ పాత్రలు కూడా కథలో కీలక మలుపులుగా నిలుస్తాయి.
దర్శకత్వ ప్రతిభ, సాంకేతిక అంశాలు
నిహార్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన నేను చిత్రం మన పక్కింటి కథలా అనిపిస్తుంది. రిషిత గలంకి అందించిన కథలో సహజత్వం ఉట్టిపడుతుంది. రాకేష్ పొట్టా, నిహార్ కపూర్ కలిసి రాసిన స్క్రీన్‌ప్లే ఎమోషన్స్‌తో భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తుంది. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ మధ్యతరగతి ఇళ్లను, వాతావరణాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించింది.
కథలోని అంతరార్థం
{{/usCountry}}నిహార్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన నేను చిత్రం మన పక్కింటి కథలా అనిపిస్తుంది. రిషిత గలంకి అందించిన కథలో సహజత్వం ఉట్టిపడుతుంది. రాకేష్ పొట్టా, నిహార్ కపూర్ కలిసి రాసిన స్క్రీన్‌ప్లే ఎమోషన్స్‌తో భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తుంది. ప్రవీణ్ వనమాలి సినిమాటోగ్రఫీ మధ్యతరగతి ఇళ్లను, వాతావరణాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించింది.
కథలోని అంతరార్థం
{{/usCountry}}శశాంక్ తిరుపతి అందించిన సంగీతం సన్నివేశాలలోని గాఢతను పెంచింది. ఎడిటింగ్ విషయంలో మహేష్ వర్మ పనితీరు మెప్పించింది. "ఒక మహిళ అందరికీ అన్నీ చేస్తుంది.. కానీ ఆమెకు ఏం కావాలి?" అనే చిన్న ప్రశ్న చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.
ఇల్లాలు తన వ్యక్తిగత గుర్తింపును కోల్పోయి యంత్రంలా మారిపోతున్న వైనాన్ని ఈ చిత్రం ప్రశ్నిస్తుంది. రమేష్ పుప్పాల, నిహార్ కపూర్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి. ముఖ్యంగా నేటి కాలంలో వర్కింగ్ ఉమెన్ ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణను ఇందులో చాలా లోతుగా చూపించి ఆలోచింపజేసేలా చేశారు.
మహిళకు అంకితం ఇచ్చేలా
ప్రతి మహిళకు అంకితం ఇచ్చేలా మదర్స్ డే (మే 10) సందర్భంగా ఇవాళ నేను ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ ఈటీవీ విన్‌లో నేను ఓటీటీ రిలీజ్ అయింది. ప్రతి వారం వచ్చే ఈటీవీ విన్ ఓటీటీ వీక్లీ సిరీస్ కథా సుధలో భాగంగా నేటి నుంచి నేను ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈటీవీ విన్ ఓటీటీ
ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోని మహిళల పట్ల కలిగి ఉండాల్సిన గౌరవాన్ని, అవగాహనను, వారి అవసరాలను గుర్తు చేసే ఎమోషనల్ డ్రామా సినిమా నేను ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.