పాన్ ఇండియా లెవల్‌లో ఈ ఏడాది సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic) ఒకటి. శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదలైన టాక్సిక్ సినిమా టీజర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది.
వయోలెంట్ యాక్షన్

రాకీ భాయ్ యశ్ మరోసారి తన వయోలెంట్ యాక్షన్ అవతార్‌తో శత్రువుల అరాచకాన్ని ఊచకోత కోస్తూ కనిపించారు. యశ్ ఇంటెన్స్ లుక్ చూసి అభిమానులు మురిసిపోతుంటే, మరోవైపు నెటిజన్లు మాత్రం ఒక కీలక విషయాన్ని ప్రశ్నిస్తున్నారు.
హీరోయిన్ల ఆచూకీ ఏదీ? నెటిజన్ల ఫైర్
అయితే, టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ వంటి బిగ్గెస్ట్ హీరోయిన్స్ ఉన్న సంగతి తెలిసిందే. కానీ. టాక్సిక్ టీజర్‌లో మాత్రం వీరిలో ఏ ఒక్కరు కూడా కనిపించకపోవడం ప్రస్తుతం చర్చకు దారితీసింది.
ఎందుకీ వివక్ష
"సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు, కానీ, టీజర్‌లో ఒక్కరినీ చూపించలేదు.. ఎందుకీ వివక్ష?" అని ఒక యూజర్ ప్రశ్నించగా, మరొకరు మరింత ఘాటుగా స్పందించారు. "టాక్సిక్ సినిమాను ఒక మహిళా దర్శకురాలు (గీతూ మోహన్ దాస్) తెరకెక్కిస్తున్నారు. అయినా టీజర్‌లో కేవలం పురుష అహంకారాన్ని (Toxic Masculinity) మాత్రమే హైలైట్ చేశారు తప్ప, మహిళా నటీమణులకు ప్రాధాన్యత ఇవ్వలేదు" అని అసహనం వ్యక్తం చేశారు.
మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?
అయితే, అభిమానులు మాత్రం చిత్ర యూనిట్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. యష్ గడ్డం లేకుండా క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించడం పెద్ద సర్‌ప్రైజ్ అని, ఇది సినిమాపై అంచనాలను పెంచిందని వారు చెబుతున్నారు. హీరోయిన్లను చూపించకపోవడం వెనుక ఒక ‘తెలివైన వ్యూహం’ ఉందని సినీ వర్గాల టాక్.
హైప్ క్రియేట్ చేసేందుకే
{{/usCountry}}అయితే, అభిమానులు మాత్రం చిత్ర యూనిట్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. యష్ గడ్డం లేకుండా క్లీన్ షేవ్ లుక్‌లో కనిపించడం పెద్ద సర్‌ప్రైజ్ అని, ఇది సినిమాపై అంచనాలను పెంచిందని వారు చెబుతున్నారు. హీరోయిన్లను చూపించకపోవడం వెనుక ఒక ‘తెలివైన వ్యూహం’ ఉందని సినీ వర్గాల టాక్.
హైప్ క్రియేట్ చేసేందుకే
{{/usCountry}}"అందరినీ ఒకేసారి చూపించి సస్పెన్స్ వీడకుండా, సినిమాపై చర్చ జరిగేలా చేయడమే మేకర్స్ ప్లాన్. వచ్చే కొన్ని వారాల్లో ఒక్కొక్క నటి పాత్రకు సంబంధించిన చిన్న చిన్న హింట్స్ ఇస్తూ హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మార్చి 19న వెండితెరపై వారి పాత్రలు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలన్నదే దర్శక నిర్మాతల ఉద్దేశం" అని విశ్లేషకులు భావిస్తున్నారు.
బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం
ఇకపోతే కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న టాక్సిక్ మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సరిగ్గా అదే రోజున రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ కూడా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ‘టాక్సిక్’ తలపడటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.