...
...
Next Story

నిన్ను కోరి డిసెంబర్ 15 ఎపిసోడ్: కొడుకులను కలపాలని రఘురాం ఐడియా-గుడిలో శ్రుతి పెళ్లి-చంద్రను ఇరికించాలని శాలిని ప్లాన్

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 15 ఎపిసోడ్ లో రాజ్ ను పెళ్లి చేసుకోవడం కోసం గుడికి వెళ్తుంది శ్రుతి. వీళ్ల పెళ్లి కార్యక్రమం మొదలవుతుంది. మరోవైపు చంద్రను ఇరికించాలని శ్రుతి ప్లాన్ వేస్తుంది. కొడుకులను కలిపేందుకు రఘురాం మరో ఐడియా అమలు చేస్తాడు.

Published on: Dec 15, 2025, 07:33:58 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 15 ఎపిసోడ్ లో గుడిలో పెళ్లి ఏర్పాట్లు చేసేస్తాడు జల్ రాజ్. పెళ్లి బట్టలు డబుల్ అద్దెకు ఇచ్చారని రాజ్ తల్లి సరోజా అంటుంది. అప్పుడే శ్రుతి వస్తుంది. నాకు ఎవరూ లేరని శ్రుతికి చెప్పా కదా, నువ్వు నా పక్కన ఉండటం సేఫ్ కాదని తల్లిని పంపిస్తాడు రాజ్.

కొడుకులను కలిపేలా

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

శ్రుతిని తీసుకొచ్చిన డబ్బును తీసుకుంటాడు రాజ్. ఆ వెంటనే పక్కన ఉన్న తల్లి దగ్గరకు వెళ్లి చేతుల్లో రూ.2 లక్షలు పెడతాడు రాజ్. మరోవైపు విరాట్, క్రాంతిలను కలిపేందుకు రఘురాం ఐడియా వేస్తాడు. పాత జ్ణాపకాలు గుర్తు చేయాలని అనుకుంటాడు. పాత ఫొటో ఆల్బమ్స్ కావాలని జగదీశ్వరిని అడుగుతాడు. విరాట్, క్రాంతిని రమ్మని కామాక్షికి చెప్తాడు రఘురాం.

శాలిని ప్లాన్

చంద్రకళను బయటకు పంపించాలని శాలిని కావాలనే కిచెన్ లోకి వెళ్లి పనసపొట్టు కూర కింద పడేస్తుంది. పనసకాయలు తెచ్చేందుకు చంద్ర మార్కెట్ కు వెళ్తుంది. విరాట్, చంద్ర రాగానే పైన ఉన్న సూట్ కేస్ ఇవ్వమంటాడు రఘురాం. అన్నదమ్ముల స్పెషల్ ఫొటోరా ఇది. ఎంతో సరదాగా ఉండేవాళ్లు. ఈ ఫొటో చూస్తే అవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇలా అన్నదమ్ముల బంధం గురించి మాట్లాడుకుంటారు. అలాంటి రోజులు మళ్లీ వస్తే బాగుండని విరాట్ వెళ్లిపోతాడు.

శ్రుతి పెళ్లి

మరోవైపు గొప్పంటి అల్లుడిని కాబోతున్నానని సంబరపడిపోతుంటాడు రాజ్. కానీ శ్రుతి భయపడుతుంది. అమ్మకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నందుకు మనసులో ఏదో గాబరాగా ఉందని శ్రుతి చెప్తుంది. ఇంతదాకా వచ్చాక ఆలోచించి ఆగడం సరికాదు. నువ్వు కోరుకున్న లైఫ్ దక్కాలంటే కొన్ని వదిలేసుకోవాలని రాజ్ చెప్తాడు. ఇప్పుడు అమ్మతో మాట్లాడతానని శ్రుతి అంటుంది. కానీ ఫోన్ మర్చిపోయి వస్తుంది. పెళ్లి అయితే మీ అమ్మ మనల్ని యాక్సెప్ట్ చేస్తుందని పీటల మీద కూర్చోబెడతాడు రాజ్.

క్రాంతిలో ద్వేషం

చంద్ర వదిన వచ్చాకే అన్నయ్య మారిపోయాడని క్రాంతి అంటాడు. నువ్వు కూడా ముందు వదిన భజన చేశావు కదా అని క్రాంతితో శాలిని అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks