...
...
Next Story

నిన్ను కోరి డిసెంబర్ 30 ఎపిసోడ్: విరాట్, క్రాంతి అనురాగం- మండిపోతున్న శాలిని- రాజ్ ఇల్లు చూసి శ్రుతి షాక్‌

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 30 ఎపిసోడ్ లో క్రాంతికి విరాట్ స్వీట్ తినిపిస్తాడు. అన్నాదమ్ములు కలిసిపోవడంతో శాలినికి మండిపోతుంది. రాజ్ ఇల్లు చూసి శ్రుతి షాక్ అవుతుంది. అప్పుల వాళ్లు వచ్చి రాజ్ మీద పడతారు.

Published on: Dec 30, 2025, 07:18:51 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే డిసెంబర్ 30 ఎపిసోడ్ లో ముంబయి ప్రాజెక్ట్ ఓకే కావడంతో క్రాంతిని తెగ పొగిడేస్తాడు విరాట్. చంద్ర కంగ్రాట్స్ చెప్తే క్రాంతి పట్టించుకోడు. క్రాంతికి స్వీట్ తినిపిస్తాడు విరాట్. రఘురాం కూడా వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాడు. అమ్మానాన్నలకు స్వీట్ తినిపిస్తాడు క్రాంతి. విరాట్ కు కూడా ఇస్తాడు. అదంతా చూసి శాలినికి మండిపోతుంది. క్రాంతి మీటింగ్ కు ఆఫీస్ వెళ్లాలన్నావు కదా అని గుర్తు చేస్తుంది శాలిని.

రాజ్ ఇల్లు

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

చిన్న గుడిసె లాంటి రాజ్ ఇళ్లు చూసి శ్రుతి, కామాక్షి, శ్యామల షాక్ అవుతారు. రాజ్ పీక పట్టుకునేంత కోపం వస్తుంది శ్రుతికి. ఇంటిని చూడగానే నీ కూతురు కరెంట్ షాక్ తగిలిన కాకిలా అయిపోయిందని కామాక్షితో శ్యామల అంటుంది. ఎవరి తాహతుకు తగ్గట్లు వాళ్ల ఇల్లు ఉంటుంది. లేదంటే పుట్టింటి కట్నంగా పెద్ద ఇల్లు రాసి ఇవ్వండని సరోజా అంటుంది. పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇస్తానని శ్రుతి అంటుంది.

ఇల్లు లోపలి చూసి శ్రుతి, కామాక్షి, శ్యామల మరింత కంగారు పడతారు. టీవీ కూడా లేదా అనుకుంటారు. శ్యామల కూర్చోగానే కుర్చీ విరిగి కిందపడుతుంది. మన గది చూపిస్తానని శ్రుతిని లోపలికి తీసుకెళ్తాడు రాజ్. భోజనం చేయగానే వెళ్లిపోతానని శ్యామల అంటే, కామాక్షి రిక్వెస్ట్ చేస్తుంది.

చంద్ర హ్యాపీ

క్రాంతి ఎప్పట్లా నీలా మాట్లాడుతున్నాడు బావ అని విరాట్ తో హ్యాపీగా చెప్తుంది చంద్రకళ. మన టార్గెట్ ఫస్ట్ టైమ్ రీచ్ అయ్యామని చెప్తుంది. నీ విషయంలో ఎలా రియాక్టయ్యాడో తలుచుకుంటే బాధగా ఉంది. శాలిని కుట్రల గురించి తెలిస్తే కానీ నిన్ను క్రాంతి క్షమించలేడని విరాట్ అంటాడు. మనం సాధించిన ఈ సక్సెస్ కు ట్రీట్ ఇవ్వాలి బావ అని అడిగిన చంద్ర విరాట్ ను హగ్ చేసుకుంటుంది.

విరాట్ సంతకం

చేపల బుట్టలు, చిరిగిన బట్టలు. ఇక్కడ పూటకో రకం తిన్న శ్రుతి, అక్కడ పూట గడవడానికి ఇబ్బంది పడేలా ఉందని శ్యామల చెప్తుంది. శ్రుతి తప్పటడుగు వేసి ఉండొచ్చు కానీ శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. వాళ్లు ప్రేమగా ఉంటే మనం అక్కున చేర్చుకుందామని జగదీశ్వరి అంటుంది. ఆ అబ్బాయికి కష్టం విలువ తెలిసేలా చేయాలని రఘురాం అంటాడు.

ఈ దోమలు, వాసన పడట్లేదమ్మా వెళ్లిపోదామని శ్రుతి అంటుంది. మన ప్రేమ, ఆప్యాయత తెలిసేలా చేద్దామని తల్లితో రాజ్ అంటాడు. వాడు అప్పుల్లో లక్షాధికారే అని అప్పులోళ్లు వస్తారు. రెండు వేలు చేతిలో పెడుతుంది కామాక్షి, వాడు ఇవ్వాల్సింది రెండు లక్షలు అని అప్పులోళ్లు అంటారు. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe