నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 5 ఎపిసోడ్ లో.. ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలు అమ్మి మరి ముష్టివాళ్లకు చికెన్ వండిపెడుతుంది శ్రుతి. మా పుట్టింటివాళ్లు పెట్టిన బిందెలు అమ్మేసిందని సరోజా ఫీల్ అవుతుంది. గల్లాపెట్టె దగ్గర కూర్చోనివ్వలేదని నా ఇల్లు గుల్ల చేస్తావా? అని శ్రుతిని అడుగుతుంది సరోజా.
శాలినికి తెలిసిన నిజం

అప్పులవాళ్లను కూడా శ్రుతి పిలుస్తుంది. ఎంత మంచిదానివి చెల్లి, చాలా సంతోషంగా ఉంది బావ అని అప్పులవాళ్లు అంటారు. సరోజా కొంగున కట్టుకున్న డబ్బులను ఇచ్చేస్తుంది. మరోవైపు పాపను హాస్పిటల్ కు తీసుకెళ్లారు కదా ఏమైందని చంద్రకళను అడుగుతాడు విరాట్. పాప కోలుకుంటుందని చంద్ర చెప్తుంది. ఈ మాటలను విన్న శాలిని.. ఈ పాయింట్ ను వాడుకుని మీ ఇద్దరితో ఎలా ఆడుకుంటానో వెయిట్ అండ్ వాచ్ అని అనుకుంటుంది.
నా బిజినెస్ వేరు
క్రాంతి రెడీ కాకుండా వర్క్ చేసుకుంటాడు. పూజకు టైమ్ అవుతుంది కదా రెడీ అవ్వమని రఘురాం, విరాట్ చెప్తారు. నాది ల్యాండ్ కు సంబంధించిన బిజినెస్ కాదు నాన్న. దానికదే భూమ్ అయి తిరిగి సక్సెస్ అయ్యేందుకు అని క్రాంతి అంటాడు. ఇది మన బిజినెస్ అని విరాట్ అంటాడు. అంత జాలి నా మీద చూపించొద్దు అన్నయ్య. నా బిజినెస్ వేరు అని క్రాంతి అంటాడు.
బావకు ప్రేమ
సరే నీ ఇష్టం, నువ్వు వచ్చినా రాకపోయినా పూజ అయితే ఆగదని రఘురాం అంటాడు. ఒక్క నిమిషం, క్రాంతి నువ్వు రాకపోవడానికి కారణం నీ పనా? లేకపోతే జెలసీనా? అని శాలిని అడుగుతుంది. ఒకరి సక్సెస్ ను చూసి ఓర్వలేని వాడిని కాదని క్రాంతి అంటాడు. అయితే వెళ్లి రెడీ అవ్వు. బావకు నీ మీద వల్లమాలిన ప్రేమ. ఆయన సారీ కూడా చెప్పారు కదా అని శాలిని అంటుంది. సారీ అన్నయ్య అని క్రాంతి రెడీ అయి వస్తాడు.
అర్జున్ ఎంట్రీ
{{/usCountry}}సరే నీ ఇష్టం, నువ్వు వచ్చినా రాకపోయినా పూజ అయితే ఆగదని రఘురాం అంటాడు. ఒక్క నిమిషం, క్రాంతి నువ్వు రాకపోవడానికి కారణం నీ పనా? లేకపోతే జెలసీనా? అని శాలిని అడుగుతుంది. ఒకరి సక్సెస్ ను చూసి ఓర్వలేని వాడిని కాదని క్రాంతి అంటాడు. అయితే వెళ్లి రెడీ అవ్వు. బావకు నీ మీద వల్లమాలిన ప్రేమ. ఆయన సారీ కూడా చెప్పారు కదా అని శాలిని అంటుంది. సారీ అన్నయ్య అని క్రాంతి రెడీ అయి వస్తాడు.
అర్జున్ ఎంట్రీ
{{/usCountry}}విరాట్, చంద్ర కలిసి భూమి పూజ స్టార్ట్ చేస్తారు. అప్పుడే అర్జున్ వస్తాడు. ఇక శాలిని ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. అర్జున్ మీరు ఒక్కరే వచ్చారా? ఫ్యామిలీని తీసుకురాలేదా? అని అడుగుతుంది. అర్జున్ అనాథ కదా అని కామాక్షి అంటే, అవును మర్చిపోయానని శాలిని అంటుంది. కాసేపట్లో ఈ ఆనందం మాయమైపోతుందని శాలిని అనుకుంటుంది.
యాక్సిడెంట్ అయిందని
ఓ వ్యక్తితో కొత్త సిమ్ వేయించి తేజును చూసుకునే డాక్టర్ కు కాల్ చేయిస్తుంది శాలిని. అర్జున్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. తేజు తేజు అని కలవరిస్తున్నాడు. త్వరగా రండి. పాపం ప్రాణాలు పోయేలా ఉన్నాయి. తేజును తీసుకొని రమ్మని చెప్తాడు ఆ వ్యక్తి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గేమ్ అని శాలిని అనుకుంటుంది.
మరోవైపు శ్రుతిని ఎలా కట్టడి చేయాలోనని రాజ్, సరోజా ప్లాన్ వేస్తారు. నువ్వు మార్కెట్ కు రావొద్దు బేబీ అని రాజ్ అంటాడు. ముష్టివాళ్లకు, అప్పులవాళ్లకు కాల్ చేయాలా? అని శ్రుతి అంటుంది. ఇక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.