...
...
Next Story

నిన్ను కోరి మార్చి 2 ఎపిసోడ్: విరాట్‌కు చంద్ర‌క‌ళ ముద్దు.. హ‌నీమూన్ ప్లాన్ లేదంటూ.. సింప‌తీ కోసం జ‌ల్ రాజ్ డ్రామా

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 2 ఎపిసోడ్ లో శోభనం గది నుంచి బయటకు వచ్చిన చంద్రకళ తులసి కోటకు పూజ చేస్తుంది. ఇప్పుడు హనీమూన్ ప్లాన్ లేదని చెప్తుంది. మరోవైపు రఘురాం ఫ్యామిలీ సింపతీ కోసం రాజ్ డ్రామా ఆడతాడు.

Published on: Mar 2, 2026, 08:00:09 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 2 ఎపిసోడ్ లో.. నిద్రపోతున్న శ్రుతిని రాజ్ రొమాంటిక్ గా చూస్తాడు. అయ్య బాబోయ్ టెంప్ట్ అయిపోతున్నానని రాజ్ అనుకుంటాడు. అప్పుడే నిద్రలో ఉన్న శ్రుతి తన చేయి, కాలును రాజ్ పై వేస్తుంది. ఇంత బరువు ఉన్నావేంటీ? అని రాజ్ పక్కకు నెట్టేస్తాడు.

విరాట్ కు ముద్దు

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

రేయ్ జల్ రాజ్ నా లైఫ్ ని గుడిసెలోకి తెచ్చావ్ కదా రా. లగ్జరీ కార్లో తిరిగే నన్ను చేపల కంపులో పడుకోబెడతావా? అని నిద్రలో శ్రుతి కలవరిస్తుంది. దీంతో అక్కడి నుంచి రాజ్ పారిపోతాడు. మరోవైపు చంద్రకళ పొద్దున లేచి విరాట్ కు ముద్దు పెట్టి శోభనం గది నుంచి బయటకు వెళ్తుంది. శ్యామల, కామాక్షి కాఫీ తాగుతారు. ఇక అన్ని పనులు మనమే చేయాలని కామాక్షి అంటుంది.

చంద్ర సిగ్గు

చంద్రకళ బయట తులసి కోటకు పూజ చేస్తుంది. అది చూసి జగదీశ్వరి, శ్యామల, కామాక్షి వెళ్తారు. నువ్వు అప్పుడే నిద్ర లేచావా? అని జగదీశ్వరి అడుగుతుంది. నేను ఈ ఇంటి కోడలిని, నా బాధ్యతలు మర్చిపోనని చంద్ర చెప్తుంది. వాడు రాత్రంతా నిద్ర పోనిచ్చాడా లేదా? అని శ్యామల అడిగితే, చంద్ర సిగ్గుపడుతుంది. విరాట్, చంద్ర ఫస్ట్ నైట్ ఆపలేకపోయినందుకు శాలిని తెగ ఫీల్ అవుతుంది.

గుడిలో యాగం

హనీమూన్ కు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారని చంద్రను శ్యామల అడుగుతుంది. మేం ఏం ప్లాన్ చేసుకోలేదు. కొత్త వెంచర్ పనులు స్టార్ట్ అయ్యాయి. ఆయన బిజీగా ఉన్నారు. ఆ వెంచర్ ను సక్సెస్ చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లమని చంద్ర చెప్తుంది. గుడిలో యాగం చేయిద్దామని రఘురాం అంటాడు. విరాట్, క్రాంతికి వీలు కాదని చెప్పడంతో మిగతా ఫ్యామిలీ అంతా గుడికి వెళ్తారు.

రాజ్ డ్రామా

చేతకానప్పుడు ఇలాంటి పనులు ఎందుకు అని డ్రామా ప్రకారం రాజ్ ను మరో వ్యక్తి తిడతాడు. ఇలాంటి వాడిని ఇంటి అల్లుడిగా ఎలా చేసుకున్నారని రఘురాంను ప్రశ్నిస్తాడు. నీకు చేపల బిజినెస్ ఉంది కదా, మళ్లీ ఈ పని ఎందుకు చేస్తున్నావని రాజ్ ను రఘురాం అడుగుతాడు. ఆ బిజినెస్ తో వచ్చే డబ్బులు శ్రుతి సోకులకే సరిపోతుందని రాజ్ అనడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe