...
...
Next Story

నిన్ను కోరి నవంబర్ 17 ఎపిసోడ్: బావకు చంద్ర ముద్దు-చిచ్చురేపేలా శాలిని కుట్ర-క్రాంతికి విరాట్ ఫ‌స్ట్ విషెస్

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 17 ఎపిసోడ్ లో ముద్దు కోసం భార్యతో విరాట్ గేమ్ ఆడతాడు. చివరకు బావకు ముద్దు పెడుతుంది చంద్రకళ. క్రాంతి బర్త్ డే రోజు ఇంట్లో చిచ్చు రేగేలా శాలిని ప్లాన్ వేస్తుంది. క్రాంతికి ఫస్ట్ విష్ చెప్తాడు విరాట్.

Published on: Nov 17, 2025, 07:15:35 IST
Advertisement

నిన్ను కోరి సీరియల్ టుడే నవంబర్ 17 ఎపిసోడ్ లో ఇప్పుడు మనం ఒక ఆట ఆడాలి. ఓడిపోయినవాళ్లు గెలిచిన వాళ్లకు ముద్దు పెట్టాలని విరాట్ అంటాడు. పులుసు ఆటలో కావాలనే ఓడిపోతావ్, నేను ఆడను అని చంద్ర అంటుంది. కానీ జెన్యూన్ గా ఆడదామని విరాట్ అనడంతో గేమ్ స్టార్ట్ చేస్తారు. ఎవరు గెలిచినా పెట్టేదే ముద్దే కదా అని విరాట్ ఉత్సాహంతో ఉంటాడు.

విరాట్ కు ముద్దు

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)
నిన్ను కోరి టుడే ఎపిసోడ్ (jiohotstar)

నువ్వు 12 సార్లు ఓడిపోయావు, నేను 13 సార్లు ఓడిపోయా. 12 ముద్దులు చెల్లు. ఒకటే పెట్టాలని విరాట్ చెంప మీద ముద్దు పెడుతుంది చంద్రకళ. మరోవైపు చంద్రను వెనకేసుకొస్తూ జగదీశ్వరి మాట్లాడటం శ్యామల, కామాక్షికి నచ్చదు. ఇంట్లో ఉన్న సమస్యకు, వాళ్ల భార్యాభర్తల బంధానికి ఏ సంబంధం లేదు. మీకు నచ్చకపోయినా సరే కొన్ని చూసీచూడనట్లు వదిలేయాలి. మీ అన్నయ్యకు చెప్పి నీకు మంచి సంబంధం చూడమంటావా అని శ్యామలతో సరదాగా అంటుంది జగదీశ్వరి.

శాలిని ప్లాన్

డాక్టర్ కు కాల్ చేసి మాట్లాడుతుంది శాలిని. ఎప్పుడు నా గురించి ఇంట్లో వాళ్లకు తెలిసిపోతుందేమోనని భయపడుతున్నా. మళ్లీ పాత స్థితిలోకి తీసుకెళ్లాలంటే ఏం చేయాలో చెప్పమంటుంది శాలిని. మీ మామయ్య ముందు జరిగేవన్ని అబద్దాలేనని తెలిసేలా చేసి స్ట్రెస్ పెంచి, నా దగ్గరకు తీసుకు రమ్మని డాక్టర్ చెప్తాడు. అప్పుడే క్రాంతి వస్తుంది. శాలిని ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది.

ఫస్ట్ విష్

విరాట్ ను నానా మాటలు అనేలా మళ్లీ క్రాంతిని రెచ్చగొట్టి బయటకు తీసుకొస్తుంది శాలిని. ఇంటి కోడలు అంటే శాలినిలా ఉండాలని శ్యామల కావాలనే అంటుంది. ముందు చెప్పాల్సిన వాడు చెప్పాలి కదా అని విరాట్ ను పిలుస్తాడు రఘురాం. హ్యాపీ బర్త్ డే క్రాంతి అని విరాట్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. తండ్రిని చూసి క్రాంతి కూడా పాజిటివ్ గా రియాక్టవుతాడు. కానీ ముందుగా నువ్వుగా విష్ చేస్తే బాగుండేదని తండ్రితో అంటాడు క్రాంతి.

ఇలాగే ఉండాలని

మీ బాండ్ చాలా స్పెషల్. నీకు ముందుగా అన్నయ్యనే విష్ చేయాలి. చిన్నప్పటి నుంచి అదే కదా జరుగుతుంది. మీరు ఇలాగే ఉండాలని రఘురాం అంటాడు. క్రాంతికి ఇష్టమని విరాట్ ఆత్రేయపురం నుంచి పూతరేకులు తెప్పిస్తాడు. క్రాంతి వాటిని తీసుకోవడంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks