బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ తృప్తి డిమ్రి జంటగా నటించిన గ్యాంగ్‌స్టర్ లవ్ స్టోరీ చిత్రం'ఓ రోమియో'. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, హాట్ భామ దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించారు.
మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా

ప్రముఖ రచయిత హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' పుస్తకం ఆధారంగా ఓ రోమియో సినిమాను రూపొందించారు. అండర్‌వరల్డ్ మాఫియా, అధికారం కోసం జరిగే పోరాటం, వాటి మధ్య చిగురించిన ఒక సంక్లిష్టమైన ప్రేమకథే ఈ చిత్రం.
వాలంటైన్స్ డే కానుకగా
సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించిన ఈ సినిమాలో షాహిద్, తృప్తి, తమన్నా, దిశాతోపాటు సీనియర్ విలక్షణ నటుడు నానా పటేకర్, అవినాష్ తివారీ, విక్రాంత్ మాస్సే వంటి భారీ తారాగాణం నటించింది. ఈ సినిమా వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల అయింది.
థియేటర్లలో స్పందన ఎలా ఉంది?
ఈ ఏడాదే థియేటర్లలోకు వచ్చిన ఓ రోమియో సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. విశాల్ భరద్వాజ్ మార్క్ మేకింగ్, నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ, కథనం మరికాస్త వేగంగా ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ, డార్క్ క్రైమ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా బాగానే ఆకట్టుకుందని రివ్యూలు ఇచ్చారు.
స్పెయిన్‌లో అందమైన లొకేషన్లలో
ముంబైతో పాటు స్పెయిన్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా దృశ్యకావ్యంలా ఉంటుందని పేరు తెచ్చుకుంది. అయితే, షాహిద్, తమన్నా, తృప్తి, దిశా నటించిన ఈ రొమాంటిక్ డార్క్ క్రైమ్ డ్రామా సినిమా ఓ రోమియో ఓటీటీలోకి వచ్చేయనుంది.
ఓ రోమియో ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}ముంబైతో పాటు స్పెయిన్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన ఈ సినిమా దృశ్యకావ్యంలా ఉంటుందని పేరు తెచ్చుకుంది. అయితే, షాహిద్, తమన్నా, తృప్తి, దిశా నటించిన ఈ రొమాంటిక్ డార్క్ క్రైమ్ డ్రామా సినిమా ఓ రోమియో ఓటీటీలోకి వచ్చేయనుంది.
ఓ రోమియో ఓటీటీ స్ట్రీమింగ్
{{/usCountry}}ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ఓ రోమియో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 27న అంటే మరో ఆరు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓ రోమియో ఓటీటీ రిలీజ్ కానుంది. కానీ, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది.
రెంటల్ విధానంలో
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఓ రోమియో మార్చి 27 నుంచి ప్రైమ్ వీడియోలో 'రెంటల్' (అద్దె) ప్రాతిపదికన విడుదలవుతుంది. అంటే సబ్‌స్క్రిప్షన్ ఉన్నప్పటికీ, ఓ రోమియో సినిమా చూడాలంటే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
అయితే, అదనపు ఖర్చు లేకుండా చూడాలనుకునే వారు మాత్రం ఏప్రిల్ మిడ్ వీక్ వరకు వేచి చూడాల్సిందే. ఏప్రిల్ రెండో వారంలోనే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఓ రోమియో సినిమా ఫ్రీగా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి ఈ క్రైమ్ డ్రామాను ఆస్వాదించాలనుకునే వారు మరికొన్ని రోజుల్లో తమ ఇంట్లోనే కూర్చుని ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.