Oh Sukumari OTT Release Details: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'మసూద', 'పరేషాన్' వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
జోడీగా ఐశ్వర్య రాజేష్

ఆ సినిమానే ఓ సుకుమారి. ఈ సినిమాలో తిరువీర్‌కు జోడీగా సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చేసింది. భరత్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోహీరోయిన్లతోపాటు మురళీధర్ గౌడ్, ఆమని, ఆనంద్, విష్ణు ఓయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. టీజర్, ట్రైలర్‌తో డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించుకున్న ఓ సుకుమారి నిన్న అంటే జూలై 17న థియేటర్లలో విడుదల అయింది. ప్రేమించిన అమ్మాయిని ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే వంటి వినూత్న కథాంశంతో ఈ సినిమాను మలిచారు.
తాత ఆస్తికి కండీషన్
నరాల యాదగిరి తన ఊరికి సర్పంచ్ కావాలని కలలు కంటాడు. మరోవైపు అతని తాత ఒక కండీషన్‌తో ఆస్తి వచ్చేలా వీలునామా రాస్తాడు. ఈ క్రమంలోనే దామినిని చూసి ఇష్టపడుతాడు యాదగిరి. ప్రేమించిన ఆమెతో పెళ్లి ప్రపోజల్ పెట్టి, అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.
కానీ, దామినికి ముట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే వింత సమస్య ఉంటుంది. అది దాచి అమాయకుడైన యాదగిరికి దామినిని ఇచ్చి పెళ్లి చేస్తారు ఊరి జనం. ఆ తర్వాత ఏమైంది? దామినికి ఆ సమస్య ఎలా వచ్చింది? యాదగిరికి తాత ఆస్తి దక్కిందా? తాత వీలునామాలో ఏముంది? మరి దామినితో యాదగిరి కాపురం చేశాడా? పిల్లలను కన్నాడా? అనేది తెలియాలంటే? ఓ సుకుమారి సినిమాను చూడాల్సిందే.
ఓ సుకుమారి రేటింగ్
ఓ సుకుమారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఫస్టాఫ్ సీన్లు, యాదగిరి అమాయకత్వం, లవ్ స్టోరీ, పెళ్లి వరకు అన్నీ ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. కానీ, సెకండాఫ్‌లో కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా వరకు నటీనటులు తమ టైమింగ్‌తో నవ్వించారు. దీంతో ఈ సినిమాకు బుక్ మై షోలో పదికి 8.4 రేటింగ్ (ప్రస్తుతానికి) ఉంది.
{{/usCountry}}ఓ సుకుమారి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఫస్టాఫ్ సీన్లు, యాదగిరి అమాయకత్వం, లవ్ స్టోరీ, పెళ్లి వరకు అన్నీ ఇంట్రెస్టింగ్గా సాగుతాయి. కానీ, సెకండాఫ్‌లో కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. చాలా వరకు నటీనటులు తమ టైమింగ్‌తో నవ్వించారు. దీంతో ఈ సినిమాకు బుక్ మై షోలో పదికి 8.4 రేటింగ్ (ప్రస్తుతానికి) ఉంది.
{{/usCountry}}ఇంతటీ క్రేజ్ తెచ్చుకుంటున్న ఓ సుకుమారి ఓటీటీ డీల్ రిలీజ్‌కు ముందే ఫిక్స్ అయిపోయింది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ సుకుమారి ఓటీటీ హక్కులను కొనేసుకుంది. కాబట్టి, అమెజాన్ ప్రైమ్‌లోనే ఓ సుకుమారి ఓటీటీ రిలీజ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
అయితే, మేకర్స్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఆగస్ట్ 7 అర్థరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఓ సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుందని సమాచారం. లాంగ్ రన్, బాక్సాఫీస్ కలెక్షన్స్, ఆడియెన్స్ టాక్‌ను బట్టి ఓ సుకుమారి ఓటీటీ రిలీజ్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఒక్క తెలుగులో మాత్రమే కాకుండా విభిన్న భాషల్లోనూ ఓ సుకుమారి ఓటీటీలోకి వచ్చేయనుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఓ సుకుమారి ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని ప్రస్తుతం ఉన్న సమాచారం.