Oscar 2027 Indian Entry Movie Gondhal: ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలో నిలిచే భారత అధికారిక చిత్రాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ప్రకటించింది. మహారాష్ట్ర సంస్కృతి, సంప్రదాయ నేపథ్యంతో రూపొందిన మరాఠీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'గోంధాల్' (Gondhal) 99వ అకాడమీ అవార్డుల్లో (ఆస్కార్ 2027) ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ తరఫున పోటీపడనుంది.
33 చిత్రాలను వెనక్కి నెట్టి..

సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరాఠీ చిత్రసీమకు అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ భాషల నుంచి ఆస్కార్ పరిశీలనకు వచ్చిన 33 చిత్రాలను అధిగమించి 'గోంధాల్' ఈ గౌరవాన్ని దక్కించుకుంది.
ఈ విషయాన్ని ఎంపిక కమిటీ చైర్‌పర్సన్ పి. శేషాద్రి వెల్లడించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకున్న గోంధాల్ సినిమా, భారత్ 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో (IFFI) సంతోష్ దావఖర్‌కు ఉత్తమ దర్శకుడిగా 'సిల్వర్ పీకాక్' పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.
'గోంధాల్' కథాంశం ఏమిటంటే?
మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యంలో ఒకే ఒక్క రాత్రి జరిగే ఉత్కంఠభరిత సంఘటనల సమాహారంగా ఈ 117 నిమిషాల చిత్రం సాగుతుంది. 'గోంధాల్' అనే సంప్రదాయ అర్థరాత్రి పూజా క్రతువు ప్రధాన నేపథ్యంగా సినిమా కథ ఉంటుంది.
సుమన్ (ఇషితా దేశ్‌ముఖ్) అనే యువతి, ధనవంతుడైన ఆనంద్ (యోగేష్ సోహోని)తో పెళ్లయినా జీవితంలో అసంతృప్తిగా ఉంటుంది. ఈ క్రమంలో సంప్రదాయ గోంధాల్ కళాకారుడైన సాహెబాతో సుమన్ ప్రేమలో పడుతుంది.
హత్యకు దారి తీసిన స్వేచ్ఛ కోసం వేసిన అడుగు
తన పెళ్లి బంధం నుంచి బయటపడాలనే ఆలోచనతో సుమన్ ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేసి, ఆనంద్ బావమరిది సర్జేరావ్ (నిషాద్ భోయిర్)ను అందులోకి లాగుతుంది. స్వేచ్ఛ కోసం వేసిన ఈ అడుగు చివరకు ఓ హత్యకు దారితీస్తుంది. ప్రేమ, నమ్మకద్రోహం, స్వార్థం, ప్రాణభయం కలబోతగా ఈ కథ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ఆస్కార్ రేసులో మరాఠీ చిత్రాల ఘనత
ఆస్కార్ పోటీకి భారత్ అధికారికంగా పంపిన మరాఠీ చిత్రాల్లో 'గోంధాల్' నాల్గవది. గతంలో 'శ్వాస్' (2004), 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ' (2009), 'కోర్ట్' (2015) సినిమాలు భారత్ తరఫున ఆస్కార్ బరిలో నిలిచాయి.
{{/usCountry}}ఆస్కార్ పోటీకి భారత్ అధికారికంగా పంపిన మరాఠీ చిత్రాల్లో 'గోంధాల్' నాల్గవది. గతంలో 'శ్వాస్' (2004), 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ' (2009), 'కోర్ట్' (2015) సినిమాలు భారత్ తరఫున ఆస్కార్ బరిలో నిలిచాయి.
{{/usCountry}}ఇప్పటివరకు భారత చలనచిత్ర చరిత్రలో 'మదర్ ఇండియా', 'సలామ్ బాంబే', 'లాగాన్' చిత్రాలు మాత్రమే ఆస్కార్ చివరి నామినేషన్ల (టాప్-5) వరకు వెళ్లాయి. గతేడాది నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో వచ్చిన జాన్వీ కపూర్ 'హోమ్‌బౌండ్' ఎంపికైనప్పటికీ తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది.
చేజార్చుకున్న రామ్ చరణ్ పెద్ది
ఇదిలా ఉంటే, ఆస్కార్ 2027 కోసం తెలుగు నుంచి రామ్ చరణ్ పెద్ది సినిమాను పంపారు ఎఫ్‌ఎఫ్‌ఐ సభ్యులు. పెద్దితోపాటు ఇండియా వైడ్‌గా 33 సినిమాలు పోటీ పడ్డాయి. అందులో సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’, రణ్‌వీర్ సింగ్ ‘ధురందర్’, ‘ధురందర్: ది రివెంజ్’, యామీ గౌతమ్ ‘హక్’, ఫర్హాన్ అక్తర్ ‘120 బహదూర్’, ఇంతియాజ్ అలీ ‘మై వాపస్ ఆవుంగా’, ‘హనుమాన్ అంశ్’ వంటి గొప్ప సినిమాలు ఉన్నాయి.
ఈ 33 సినిమాలన్నింటిని గత 10 రోజులుగా వీక్షించిన కమిటీ ‘గోంధాల్’, ‘అంఘ్’, ‘ఇక్కిస్’ చిత్రాలని టాప్ 3గా సెలెక్ట్ చేశాయి. ఇక వీటిలో ఫైనల్‌గా గోంధాల్ సినిమాను ఆస్కార్ బరిలో నిలిపేందుకు నిర్ణయం తీసుకుంది కమిటీ. దీంతో పెద్ది, ధురంధర్ సినిమాలు ఆస్కార్ పోటీని చేజార్చుకున్నాయి.