ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వివిధ జోనర్లలో, విభిన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిజిటల్ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బ్లాక్ ఫోన్ 2 ఓటీటీ: ఇంగ్లీష్‌లో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. 15 ఏళ్ల గ్వెన్‌కు ఒక టెలిఫోన్ బూత్‌లోని బ్లాక్ కలర్ ఫోన్ నుంచి కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ లిఫ్ట్ చేస్తే ఊహించని భయంకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఆ డ్రీమ్స్ నుంచి గ్వెన్ ఎలా తప్పించుకున్నాడనే కథతో తెరకెక్కిన బ్లాక్ ఫోన్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్ ఓటీటీ: కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 16న ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
భా భా భా ఓటీటీ: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దిలీప్, వినీత్ శ్రీనివాసన్ నటించిన మలయాళ యాక్షన్ కామెడీ చిత్రం భా భా భా. సీఎమ్‌ను ఓ సామాన్యుడు కిడ్నాప్ చేస్తే అనే కథాంశంతో తెరకెక్కిన భా భా భా జీ5 ఓటీటీలో ప్రీమియర్ అవుతోంది.
కాలంకావల్: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సైకో కిల్లర్‌గా నటించిన సినిమానే కాలంకావల్. వితంతువులను చంపే కథతో తీసిన కాలంకావల్ సోనీ లివ్ ఓటీటీలో తెలుగులో అందుబాటులో రిలీజ్ అయింది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ జాబితా:
| చిత్రం / సిరీస్ పేరు | జోనర్ | ఓటీటీ రిలీజ్ డేట్ |
|---|---|---|
| అగాథ క్రిస్టీస్ సెవెన్ డయల్స్ | ఇంగ్లీష్ క్రైమ్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్) | జనవరి 15 |
| బోన్ లేక్ | ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ | జనవరి 15 |
| టు లవ్ టు లూజ్ | టర్కిష్ రొమాంటిక్ డ్రామా (వెబ్ సిరీస్) | జనవరి 15 |
| ది రిప్: ట్రస్ట్ హ్యాజ్ ఏ ప్రైస్ | ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్) | జనవరి 16 |
| కిల్లర్ వేల్ | ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ | జనవరి 16 |
| బ్లాక్ ఫోన్ 2 | ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్ | జనవరి 16 |
| కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్ | కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా (తెలుగు డబ్బింగ్) | జనవరి 16 |
జనవరి 16 నాటి ఓటీటీ రిలీజ్ సినిమాలు:
| చిత్రం పేరు | ఓటీటీ ప్లాట్‌ఫామ్ | జోనర్ | భాష |
|---|---|---|---|
| 120 బహదూర్ | అమెజాన్ ప్రైమ్ | హిస్టారికల్ యాక్షన్ వార్ డ్రామా | హిందీ |
| ది స్మాషింగ్ మేషిన్ | అమెజాన్ ప్రైమ్ | యాక్షన్ హిస్టరీ స్పోర్ట్స్ డ్రామా | ఇంగ్లీష్ |
| గుర్రం పాపిరెడ్డి | జీ5 (ZEE5) | క్రైమ్ కామెడీ డ్రామా | తెలుగు |
| భా భా భా | జీ5 (ZEE5) | యాక్షన్ కామెడీ | మలయాళం |
| మస్తీ 4 | జీ5 (ZEE5) | అడల్ట్ కామెడీ | హిందీ |
| సఫియా / సఫ్దార్ | జీ5 (ZEE5) | సోషల్ డ్రామా | హిందీ |
| బందూక్ | లయన్స్ గేట్ ప్లే | క్రైమ్ థ్రిల్లర్ | కన్నడ |
| షెల్ | లయన్స్ గేట్ ప్లే | బ్లాక్ కామెడీ బాడీ హారర్ థ్రిల్లర్ | తెలుగు (డబ్బింగ్) |
మరిన్ని ఓటీటీ సినిమాలు:
ఇట్లు మీ ఎదవ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 15
{{/usCountry}}ఇట్లు మీ ఎదవ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 15
{{/usCountry}}కిరిక్కన్ (మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జనవరి 15
కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జనవరి 15
ట్విన్‌లెస్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ డ్రామా చిత్రం)- హులు ఓటీటీ- జనవరి 16
పొనీస్: పర్సన్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ (అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 16
ఓటీటీలోకి 20 సినిమాలు
ఇలా రెండు రోజుల్లో (జనవరి 15, 16) కలిపి ఏకంగా 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి, బందూక్, ఇట్లు మీ ఎదవ, కిరిక్కన్, కాలంకావల్, షెల్, మస్తీ 4, భా భా భా, 120 బహదూర్, బోన్ లేక్, అగాథ క్రిస్టీస్ సెవెన్ డయల్స్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు ది రిప్, కిల్లర్ వేల్, కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్, బ్లాక్ ఫోన్ 2తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 15 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి.