ఓటీటీలోకి 2 రోజుల్లో 20 సినిమాలు- 15 చాలా స్పెషల్, 7 తెలుగులో ఇంట్రెస్టింగ్-డిఫరెంట్ జోనర్స్, విభిన్న ప్లాట్‌ఫామ్స్‌లలో!

ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో 15 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉంటే, అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ టు సైకో థ్రిల్లర్ వరకు విభిన్న జోనర్స్ ఉన్న ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

Jan 18, 2026, 05:35:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి రెండు రోజుల్లో ఏకంగా 20 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వివిధ జోనర్లలో, విభిన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో డిజిటల్ ప్రీమియర్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి 2 రోజుల్లో 20 సినిమాలు- 15 చాలా స్పెషల్, 7 తెలుగులో ఇంట్రెస్టింగ్-డిఫరెంట్ జోనర్స్, విభిన్న ప్లాట్‌ఫామ్స్‌లలో!
ఓటీటీలోకి 2 రోజుల్లో 20 సినిమాలు- 15 చాలా స్పెషల్, 7 తెలుగులో ఇంట్రెస్టింగ్-డిఫరెంట్ జోనర్స్, విభిన్న ప్లాట్‌ఫామ్స్‌లలో!

బ్లాక్ ఫోన్ 2 ఓటీటీ: ఇంగ్లీష్‌లో హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఇది. 15 ఏళ్ల గ్వెన్‌కు ఒక టెలిఫోన్ బూత్‌లోని బ్లాక్ కలర్ ఫోన్‌ నుంచి కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ లిఫ్ట్ చేస్తే ఊహించని భయంకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఆ డ్రీమ్స్ నుంచి గ్వెన్ ఎలా తప్పించుకున్నాడనే కథతో తెరకెక్కిన బ్లాక్ ఫోన్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్ ఓటీటీ: కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన వెబ్ సిరీస్ కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 16న ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

భా భా భా ఓటీటీ: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, దిలీప్, వినీత్ శ్రీనివాసన్ నటించిన మలయాళ యాక్షన్ కామెడీ చిత్రం భా భా భా. సీఎమ్‌ను ఓ సామాన్యుడు కిడ్నాప్ చేస్తే అనే కథాంశంతో తెరకెక్కిన భా భా భా జీ5 ఓటీటీలో ప్రీమియర్ అవుతోంది.

కాలంకావల్: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి సైకో కిల్లర్‌గా నటించిన సినిమానే కాలంకావల్. వితంతువులను చంపే కథతో తీసిన కాలంకావల్ సోనీ లివ్ ఓటీటీలో తెలుగులో అందుబాటులో రిలీజ్ అయింది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ జాబితా:

చిత్రం / సిరీస్ పేరుజోనర్ఓటీటీ రిలీజ్ డేట్
అగాథ క్రిస్టీస్ సెవెన్ డయల్స్ఇంగ్లీష్ క్రైమ్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్)జనవరి 15
బోన్ లేక్ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్జనవరి 15
టు లవ్ టు లూజ్టర్కిష్ రొమాంటిక్ డ్రామా (వెబ్ సిరీస్)జనవరి 15
ది రిప్: ట్రస్ట్ హ్యాజ్ ఏ ప్రైస్ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ (తెలుగు డబ్బింగ్)జనవరి 16
కిల్లర్ వేల్ఇంగ్లీష్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్జనవరి 16
బ్లాక్ ఫోన్ 2ఇంగ్లీష్ సూపర్‌నాచురల్ హారర్ థ్రిల్లర్జనవరి 16
కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా (తెలుగు డబ్బింగ్)జనవరి 16

జనవరి 16 నాటి ఓటీటీ రిలీజ్ సినిమాలు:

చిత్రం పేరుఓటీటీ ప్లాట్‌ఫామ్జోనర్భాష
120 బహదూర్అమెజాన్ ప్రైమ్హిస్టారికల్ యాక్షన్ వార్ డ్రామాహిందీ
ది స్మాషింగ్ మేషిన్అమెజాన్ ప్రైమ్యాక్షన్ హిస్టరీ స్పోర్ట్స్ డ్రామాఇంగ్లీష్
గుర్రం పాపిరెడ్డిజీ5 (ZEE5)క్రైమ్ కామెడీ డ్రామాతెలుగు
భా భా భాజీ5 (ZEE5)యాక్షన్ కామెడీమలయాళం
మస్తీ 4జీ5 (ZEE5)అడల్ట్ కామెడీహిందీ
సఫియా / సఫ్‌దార్జీ5 (ZEE5)సోషల్ డ్రామాహిందీ
బందూక్లయన్స్ గేట్ ప్లేక్రైమ్ థ్రిల్లర్కన్నడ
షెల్లయన్స్ గేట్ ప్లేబ్లాక్ కామెడీ బాడీ హారర్ థ్రిల్లర్తెలుగు (డబ్బింగ్)

మరిన్ని ఓటీటీ సినిమాలు:

ఇట్లు మీ ఎదవ (తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 15

కిరిక్కన్ (మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్)- సన్ నెక్ట్స్ ఓటీటీ- జనవరి 15

కాలంకావల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ సైకలాజికల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- సోనీ లివ్ ఓటీటీ- జనవరి 15

ట్విన్‌లెస్ (ఇంగ్లీష్ డార్క్ కామెడీ డ్రామా చిత్రం)- హులు ఓటీటీ- జనవరి 16

పొనీస్: పర్సన్ ఆఫ్ నో ఇంట్రెస్ట్ (అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 16

ఓటీటీలోకి 20 సినిమాలు

ఇలా రెండు రోజుల్లో (జనవరి 15, 16) కలిపి ఏకంగా 20 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో గుర్రం పాపిరెడ్డి, బందూక్, ఇట్లు మీ ఎదవ, కిరిక్కన్, కాలంకావల్, షెల్, మస్తీ 4, భా భా భా, 120 బహదూర్, బోన్ లేక్, అగాథ క్రిస్టీస్ సెవెన్ డయల్స్ సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు ది రిప్, కిల్లర్ వేల్, కెన్ దిస్ లవ్ బీ ట్రాన్స్‌లేటెడ్, బ్లాక్ ఫోన్ 2తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 15 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 7 సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More