...
...
Next Story

OTT: ఓటీటీలోకి 3 రోజుల్లో 5 స్పెషల్ సినిమాలు-తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో-ఓ లుక్కేయండి

ఓటీటీ లవర్స్ అలర్ట్. మూడు రోజుల్లో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేసేందుకు 5 స్పెషల్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం సినిమాలున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

Published on: Jan 29, 2026, 13:52:33 IST
Advertisement

ఓటీటీలో ఎంటర్ టైన్మెంట్ జోష్ నింపేందుకు, డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను అలరించేందుకు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈ మూడు రోజుల్లో అయిదు స్పెషల్ మూవీస్ ఓటీటీ ఆడియన్స్ కోసం స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సినిమాలున్నాయి. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ తదితర జోనర్లలో చిత్రాలున్నాయి.

ఛాంపియ‌న్

ఓటీటీలో స్పెషల్ సినిమాలు (X)
ఓటీటీలో స్పెషల్ సినిమాలు (X)

సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక కొడుకు రోషన్ మేక హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛాంపియన్’. ఇది పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో హీరో ఓ ఆంగ్లో ఇండియన్. ఫుట్ బాల్ ప్లేయర్ కావాాలని కలలు కంటాడు. ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ క్లబ్ కు ఆడాలని అనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల కారణంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొంటాడు. ఈ మూవీ ఈ రోజు (జనవరి 29) నుంచే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సర్వం మాయ

రీసెంట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మలయాళం హారర్ థ్రిల్లర్ సర్వం మాయ. ఇది నివిన్ పౌలీకి మంచి కమ్ బ్యాక్ సినిమా. సాంప్రదాయ పూజారి కుటుంబంలో పుట్టిన హీరో యూరోప్ కు వెళ్లాలనుకుంటాడు. అతను నాస్తికుడు. కానీ ఒక రోజు అతనో దెయ్యాన్ని కలుస్తాడు. అప్పటి నుంచి అతని జీవితంలో అనూహ్య మార్పులు కలుగుతాయి. ఈ మూవీ జనవరి 30న జియోహాట్‌స్టార్ లో రిలీజ్ కానుంది.

వా వాతియార్

నిజాయితీ కలిగిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కథనే ‘కానిస్టేబుల్’ మూవీ. ఇందులో వరుణ్ సందేశ్ లీడ్ రోల్ ప్లే చేశాడు. గ్రామంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. మంకీ మాస్క్ పెట్టి చంపుతుంటారు. మరి దీని వెనుక ఎవరున్నారనేది థ్రిల్ పంచుతుంది. ఈ మూవీ ఈ రోజు (జనవరి 29) ఈటీవీ విన్ లో రిలీజ్ అయింది.

పతంగ్

తెలుగులో వచ్చిన యూత్ ఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘పతంగ్’. ఇందులో ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల, వంశీ పూజిత్ కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. గాలిపటాలు ఎగరేసే పోటీలతో ఈ సినిమాను ఇంట్రెస్టింగ్ గా మలిచారు. పతంగ్ మూవీ జనవరి 30న సన్ నెక్ట్స్ ఓటీటీలోకి రానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks