...
...
Next Story

OTT Telugu: ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 5 మరింత ఇంట్రెస్టింగ్- రెండింట్లో 7, 7!

OTT Release Movies Telugu This Week: ఓటీటీలోకి గత వారం తెలుగులో 18 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అందులో తెలుగు స్ట్రయిట్ సినిమాలు అయిన 5 మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ నుంచి సోనీ లివ్ వరకు విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

Published on: Oct 13, 2026, 06:26:25 IST
Advertisement

Telugu OTT Release Movies: ఓటీటీలోకి గత వారం తెలుగు భాషలో ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, సోనీ లివ్, జియో హాట్‌స్టార్‌లలో విభిన్న జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ ప్రీమియర్ అవుతున్నాయి. మరి అవేంటో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 5 మరింత ఇంట్రెస్టింగ్- రెండింట్లో 7, 7!
ఓటీటీలోకి తెలుగులో ఏకంగా 18 సినిమాలు- చూసేందుకు అన్నీ స్పెషల్, 5 మరింత ఇంట్రెస్టింగ్- రెండింట్లో 7, 7!

మండాడి (తెలుగు, తమిళ డబ్బింగ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమా)- అక్టోబర్ 08

ఎపిక్: క్లాసిక్ ది ఫస్ట్ సెమిస్టర్ (తెలుగు రొమాంటిక్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09

ప్రథమ దృష్ట్యా కుట్టక్కర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- అక్టోబర్ 09

రిపోర్టింగ్ లైవ్ (తెలుగు డబ్బింగ్ హిందీ ఇన్విస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- అక్టోబర్ 09

టేక్ ఛార్జ్ ఆఫ్ మై హార్ట్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ రొమాంటిక్ కామెడీ ఫాంటసీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 09

యానిమల్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09

100 డేస్ ఆఫ్ డిసెప్షన్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ హిస్టారికల్ రొమాంటిక్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 10

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఎన్‌సీఐఎస్ సీజన్ 24 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- అక్టోబర్ 06

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 06 (రెంట్)

కేరీ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ టీన్ హారర్ సైకలాజికల్ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 07

మారెమ్మ (తెలుగు రూరల్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- అక్టోబర్ 09 (ఆహా ఓటీటీలో కూడా)

ఖలీఫా: ది రూలర్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 09

వీడియో (తెలుగు డబ్బింగ్ ఫౌండ్ ఫుటేజ్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ సినిమా)- అక్టోబర్ 09

ఈటీవీ విన్ ఓటీటీ

లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- అక్టోబర్ 09 (నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోనూ)

కచేరి (తెలుగు మ్యూజికల్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- అక్టోబర్ 11

హాట్‌స్టార్ - సోనీ లివ్

మోర్టల్ కాంబాట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- అక్టోబర్ 08

ఐస్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- అక్టోబర్ 08

ఓటీటీలోకి తెలుగులో 18 సినిమాలు

ఇలా గత వారం (అక్టోబర్ 5 నుంచి 11) ఏకంగా 18 సినిమాలు తెలుగులో ఓటీటీలోకి వచ్చాయి. వీటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, ఇందులోనూ మండాడి, ఎపిక్, లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, కచేరి, మారెమ్మ వంటి 5 తెలుగు స్ట్రయిట్ సినిమాలు మాత్రమే మరింత ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

రెండింట్లో 7, 7 స్ట్రీమింగ్

అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ రెండు ఓటీటీల్లో 7, 7 సినిమాలు అందుబాటులో ఉండటం విశేషం. అంటే, ఈ రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలోనే ఏకంగా 14 సినిమాల వరకు చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks