ఓటీటీలోకి తెలుగులో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కో రకం- ఒకేరోజు 3 రిలీజ్- మరికొన్ని గంటల్లో 4 స్ట్రీమింగ్!

ఓటీటీలోకి ఈ వారం తెలుగులో ఏకంగా 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్‌ కానున్నాయి. అవి ఒక్కోటి ఒక్కో రకమైన జోనర్లలో ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. అందులో మూడు 3 ఒకోరేజు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Dec 18, 2025, 15:28:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఈ వారం తెలుగులో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో మూడు ఒకేరోజు ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. అలాగే, అవన్నీ ఒక్కోటి ఒక్కో రకమైన జోనర్లలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి తెలుగులో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కో రకం- ఒకేరోజు 3 రిలీజ్- మరికొన్ని గంటల్లో 4 స్ట్రీమింగ్!
ఓటీటీలోకి తెలుగులో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు- ఒక్కోటి ఒక్కో రకం- ఒకేరోజు 3 రిలీజ్- మరికొన్ని గంటల్లో 4 స్ట్రీమింగ్!

ఫార్మా ఓటీటీ

మలయాళంలో తెరకెక్కి మెడికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఫార్మా. మెడికల్ కార్పోరేషన్‌లో జరిగే అవినీతి చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. డిసెంబర్ 19న అంటే రేపు జియో హాట్‌స్టార్‌లో ఫార్మా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో సైతం ఫార్మా ఓటీటీ రిలీజ్ కానుంది.

ఫాల్అవుట్ సీజన్ 2 ఓటీటీ

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్, సర్వైవల్, డార్క్ కామెడీ సిరీస్‌గా తెరకెక్కింది ఫాల్అవుట్. ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఫాల్అవుట్ సీజన్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

నయనం ఓటీటీ

పక్క వారి జీవితంలో నాలుగు నిమిషాలు తెలుసుకునేందుకు ఓ డాక్టర్ చేసే ప్రయోగమే నయనం ఓటీటీ సిరీస్. వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ జంటగా నటించిన ఈ సైకో థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేయనుంది. జీ5లో డిసెంబర్ 19 నుంచి తెలుగుతోపాటు ఇతర భాషల్లో నయనం ఓటీటీ ప్రీమియర్ కానుంది.

ప్రేమంటే ఓటీటీ

ఐఎమ్‌డీబీలో 8 రేటింగ్ సాధించుకున్న తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేమంటే. ప్రియదర్శి, ఆనంది, యాంకర్ సుమ, వెన్నెల కిశోర్, హైపర్ ఆది నటించిన ప్రేమంటే సినిమా డిసెంబర్ 19 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సినిమా ప్రేమంటే ఓటీటీ రిలీజ్ కానుంది.

దివ్య దృష్టి ఓటీటీ

హారర్, సస్పెన్స్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రం దివ్య దృష్టి. సునీల్, ఇషా చావ్లా, కమల్ కామరాజు లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు కబీర్ లాల్ డైరెక్షన్ చేశారు. అయితే, దివ్య దృష్టి సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కానుంది.

మరికొన్ని గంటల్లో

సన్ నెక్ట్స్‌లో డిసెంబర్ 19 నుంచి తెలుగులో దివ్య దృష్టి ఓటీటీ రిలీజ్ కానుంది. అయితే, రాజు వెడ్స్ రాంబాయి మూవీ తప్పా మిగతా నాలుగు సినిమాలు మరికొన్ని గంటల్లో అంటే డిసెంబర్ 19 అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి వచ్చేయనున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More