OTT Movies: ఓటీటీలోకి 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు- అన్ని ఒకేదాంట్లో స్ట్రీమింగ్- 4 హారర్ థ్రిల్లర్స్- ఎక్కడ చూడాలంటే?
OTT Release Movies This Week: ఓటీటీలోకి ఈ వారం 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. ఇవన్నీ ఒక్క ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవనున్నాయి. బోల్డ్ నుంచి హారర్ జోనర్స్‌లలో మూవీస్ ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అయితే, వీటిలో ఎక్కువగా 4 సినిమాలు హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఉండటం విశేషం.
ఓటీటీలోకి ఈ వారం (ఏప్రిల్ 6 నుంచి 13) 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ అవనున్నాయి. ఈ 8 ఒకే ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. అంతేకాకుండా వీటిలో అందరు ఇష్టపడే హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండే సినిమాలు ఎక్కువగా 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

బిలీవ్ మీ: ది ఫాల్స్ ప్రొఫెట్
యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం బిలీవ్ మీ: ది ఫాల్స్ ప్రొఫెట్. ఒక సీక్రెట్ సొసైటీలోకి ప్రవేశించి దైవం పేరుతో మోసాలకు పాల్పడే నకిలీ బాబాల గుట్టును ఒక చిత్రనిర్మాత, కల్ట్ నిపుణుడు ఎలా రట్టు చేశారనేది ఇందులో ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 8 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
టెంప్టేషన్ ఐలాండ్ సీజన్ 2
ప్రేమ, ఆకర్షణ, మోసం.. ఈ మూడింటి కలయికతో సాగే పాపులర్ ఓటీటీ రియాలిటీ షో 'టెంప్టేషన్ ఐలాండ్' రెండో సీజన్ ఏప్రిల్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభం కానుంది. తమ బంధం ఎంత బలమైనదో పరీక్షించుకోవడానికి విడిపోయి, కొత్త వ్యక్తులతో సమయం గడిపే నలుగురు జంటల కథ ఇది. బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా ఈ షో సాగుతుంది.
స్క్రీమ్ 7
హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి స్క్రీమ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి ఏడో సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో స్క్రీమ్ 7 ఓటీటీ రిలీజ్ కానుంది. ఏప్రిల్ 10 నుంచి ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
థ్రాష్
సముద్ర తీర ప్రాంత నగరాన్ని ముంచెత్తే భయంకరమైన తుఫానులు, వాటితో పాటు వచ్చే రక్తపిపాసి సొరచేపల దాడులతో సాగే హాలీవుడ్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ థ్రాష్. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 10 నుంచి థ్రాష్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.
టర్న్ ఆఫ్ ది టైడ్ సీజన్ 3
ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ ఓటీటీ సిరీస్ ఇప్పుడు తన ముగింపునకు చేరుకుంది. అక్రమ దందాలు, ప్రభుత్వ అధికారుల కుట్రలకు వ్యతిరేకంగా ఒక స్నేహితుల బృందం చేసే పోరాటమే టర్న్ ఆఫ్ ది టైడ్. ఈ సిరీస్ నుంచి వచ్చిన మూడో సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 10న ఓటీటీ రిలీజ్ కానుంది.
ఎ క్వైట్ ప్లేస్ పార్ట్ 2
సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్స్‌లో ఏ క్వైట్ ప్లేస్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎ క్వైట్ ప్లేస్ పార్ట్ 2 ఓటీటీలోకి వచ్చేయనుంది. ఏప్రిల్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఎ క్వైట్ ప్లేస్ పార్ట్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. చిన్న శబ్దం చేసినా చంపేసే వింత జీవులతో మనుషులు చేసే పోరాటంగా ఈ మూవీ సాగుతుంది.
హాలోవీన్ ఎండ్స్
పాపులర్ హారర్ థ్రిల్లర్స్‌లో 'హాలోవీన్' సిరీస్ ఒకటి. ఈ సిరీస్ నుంచి ఫైనల్ చాప్టర్‌గా హాలోవీన్ ఎండ్స్ ఓటీటీలోకి వచ్చేయనుంది. నగరంలో జరుగుతున్న మర్మమైన హత్యల వెనుక ముసుగు హంతకుడు మైఖేల్ మైయర్స్ ఉన్నాడని లారీ స్ట్రోడ్ అనుమానిస్తుంది. ఆ తర్వాత ఏమైందనేదే కథ. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 13న ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కానుంది.
ది మెన్ హూ బిల్ట్ అమెరికా: ఫ్రాంటియర్స్ మెన్
చరిత్రను ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన మినీ సిరీస్ ఇది. అమెరికన్ విప్లవం నుంచి కాలిఫోర్నియా గోల్డ్ రష్ వరకు.. నేటి ఆధునిక అమెరికా ఆవిర్భావానికి కారణమైన హీరోల వీరగాథలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 13న ది మెన్ హూ బిల్ట్ అమెరికా: ఫ్రాంటియర్స్ మెన్ ఓటీటీ ప్రీమియర్ అవనుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


