...
...
Next Story

OTT Movies: ఓటీటీలో సినిమాల జాతర- ఈ వారం 11 ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు- మీరేది చూస్తారు!

OTT Movies This Week: నవంబర్ చివరి వారంలో ఓటీటీలో 11 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సోనీ లివ్ ఓటీటీల్లో వివిధ జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Nov 24, 2026, 21:53:22 IST
Advertisement

OTT Release Movies This Week: నవంబర్ నెల ముగింపు దశకు చేరుకోవడంతో ఓటీటీ వేదికలు ప్రేక్షకులను కట్టిపడేసేందుకు భారీ కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రియులు వారాంతం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఈ వారం ఓటీటీలోకి 11 సినిమాలు

ఓటీటీలో సినిమాల జాతర- ఈ వారం 11 ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు- మీరేది చూస్తారు!
ఓటీటీలో సినిమాల జాతర- ఈ వారం 11 ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు- మీరేది చూస్తారు!

ఈ వారం (నవంబర్ 23 నుంచి నవంబర్ 30) క్రైమ్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఆధ్యాత్మిక, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జోనర్లలో మొత్తం 11 చిత్రాలు, సిరీస్‌లు డిజిటల్ తెరపై ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో 'దృశ్యం 3' సహా ఐదు క్రేజీ రిలీజ్‌లు

తెలుగులో వెంకటేష్ నటించిన 'దృశ్యం' సిరీస్‌కు ఎంతటి ఆదరణ ఉందో తెలిసిందే. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా థియేటర్లలో సంచలనం సృష్టించిన క్రైమ్ థ్రిల్లర్ 'దృశ్యం 3' (దృశ్యం: ది కంక్లూజన్) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

నవంబర్ 23 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో 'ది ట్రయల్స్ ఆఫ్ కరెన్ రీడ్' (The Trials of Karen Read) అనే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఓటీటీ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. బోస్టన్ పోలీస్ అధికారి జాన్ ఓకీఫ్ మరణం వెనుక ఉన్న మిస్టరీ, వివాదాస్పద విచారణ, కుట్ర కోణాల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. నవంబర్ 9న విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

బహుమతుల కోసం 12 సవాళ్లను

పిల్లలు, యువతను ఆకట్టుకునేందుకు నవంబర్ 28న 'సాలిష్స్ 12 గేమ్స్ ఆఫ్ క్రిస్మస్' (Salish's 12 Games of Christmas) అనే హాలిడే రియాలిటీ కాంపిటీషన్ షో నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది. సాలిష్ మ్యాటర్, ఆమె ఏడుగురు సన్నిహిత స్నేహితులు క్రిస్మస్ బహుమతుల కోసం 12 సవాళ్లను ఎదుర్కొంటారు. అయితే వారి మధ్యే దాగి ఉన్న ఒక దొంగ ఆటను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు.

చివరగా నవంబర్ 30న యానిమేటెడ్ అడ్వెంచర్ కామెడీ చిత్రం 'ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ' (The Super Mario Galaxy Movie) నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. యువరాణి రోసాలినాను బౌసర్ జూనియర్ కిడ్నాప్ చేయడం, తన తండ్రి బౌసర్‌ను విడిపించేందుకు చేసే సాహసాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది.

ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో హాలీవుడ్ హంగామా

సైన్స్ ఫిక్షన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారీ వెబ్ సిరీస్ 'బ్లేడ్ రన్నర్ 2099' (Blade Runner 2099) నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'బ్లేడ్ రన్నర్ 2049' ఘటనలు జరిగిన 50 ఏళ్ల తర్వాత లాస్ ఏంజిల్స్ నగరంలో ఈ కథ జరుగుతుంది. ఆస్కార్ విజేత మిషెల్ యో (ఓల్వెన్), హంటర్ షాఫర్ (కోరా) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ 8 ఎపిసోడ్ల సిరీస్ నగరాన్ని నాశనం చేసే ఓ భారీ కుట్రను ఛేదించేలా సాగుతుంది.

నవంబర్ 27న ప్రైమ్ వీడియోలోనే 'అలన్ కార్స్ గ్రేట్ బిగ్ బకెట్ లిస్ట్' (Alan Carr's Great Big Bucket List) అనే బ్రిటిష్ కామెడీ అడ్వెంచర్ సిరీస్ విడుదలవుతోంది. నాలుగు ఎపిసోడ్ల ఈ సిరీస్‌లో ప్రముఖ కమెడియన్ అలన్ కార్ తన స్నేహితులతో కలిసి నార్తర్న్ లైట్స్ చూడటం, బంగీ జంపింగ్, సొరచేపలతో ఈత కొట్టడం వంటి సాహసాలను వినోదాత్మకంగా చేస్తారు.

మరోవైపు హాలీవుడ్ స్టార్ క్రిస్ ప్రాట్ నటించిన డ్రామా చిత్రం 'వే ఆఫ్ ది వారియర్ కిడ్' (Way of the Warrior Kid) నవంబర్ 25న ఆపిల్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది. జాకో విల్లింక్ రాసిన ప్రసిద్ధ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మార్క్ అనే బాలుడు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో ఒక యోధుడిగా ఎలా ఎదిగాడన్నది హృద్యంగా చూపించారు.

జియో హాట్‌స్టార్, సోనీ లివ్‌లలో థ్రిల్లర్లు, ఆధ్యాత్మిక కథలు

నవంబర్ 26న జియో హాట్‌స్టార్ వేదికగా 'స్వీట్‌పీ సీజన్ 2' (Sweetpea Season 2) స్ట్రీమింగ్ కానుంది. మొదటి సీజన్ రక్తపాతంతో ముగిసిన తర్వాత, ఎల్లా పర్నెల్ పోషించిన రియానాన్ లూయిస్ పాత్ర అమాయకపు యువతి నుంచి నిర్భయమైన హంతకురాలిగా మారుతుంది. ఆమె హత్యల జాబితా పెరుగుతున్న తరుణంలో ఒక కాపీక్యాట్ కిల్లర్ ఆమెను బయటపెడతానని బెదిరించడం ఉత్కంఠ రేపుతుంది.

నవంబర్ 27న జియో హాట్‌స్టార్‌లోనే 'ధాయి చాల్' (Dhai Chaal) అనే హిందీ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. నవీన్ చౌదరి రాసిన నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ మతం, కులం, మీడియా, రాజకీయాల మధ్య ఉన్న చీకటి ఒప్పందాలను, విద్యార్థి రాజకీయాల్లోని అధికార క్రీడలను కళ్లకు కడుతుంది.

సోనీ లివ్ ఓటీటీలో

ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్న వారి కోసం నవంబర్ 27న సోనీ లివ్ ఓటీటీలో 'హనుమాన్ అంశ్' (Hanuman Ansh) అనే హిందీ చిత్రం అందుబాటులోకి వస్తోంది. విరాట్ కోహ్లీ, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖులు సైతం ఎంతో భక్తితో కొలిచే బాబా నీమ్ కరోలీ మహారాజ్ బాల్యం, ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా విశాల్ చతుర్వేది ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్టు 7, 2026న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సిరీస్‌ల నుంచి బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్లు, ఆధ్యాత్మిక చిత్రాల వరకు అన్ని రకాల జానర్లు ఈ వారం ఓటీటీ వేదికలపై కొలువుదీరాయి. వీకెండ్ వినోదం కోసం ఎదురుచూస్తున్న సినీ ప్రియులకు నవంబర్ చివరి వారం మంచి కాలక్షేపాన్ని అందించనుంది.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks