OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు- చూసేందుకు 6 చాలా స్పెషల్, తెలుగులో 3 ఇంట్రెస్టింగ్- ఎక్కడెక్కడ చూడాలంటే?
OTT Movies Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 6 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 3 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. డిఫరెంట్ ఓటీటీల్లో, విభిన్న జోనర్లతో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. పొలిటికల్, కామెడీ, రొమాంటిక్, హారర్, బయోగ్రాఫికల్ వంటి అన్ని రకాల జోనర్లలో ఈ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

ఏయే ఓటీటీలు
అలాగే, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, సోనీ లివ్, చౌపల్ వంటి ఓటీటీల్లో ఈ సినిమాలన్నీ ప్రీమియర్ అవుతున్నాయి. అయితే, నేటి ఓటీటీ రిలీజ్ అయిన 8 సినిమాల్లో ఒక్క నెట్‌ఫ్లిక్స్‌లోనే 3 మూవీస్ ఉండటం విశేషం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
తలైవర్ తంబి తలైమయిల్ (తెలుగు డబ్బింగ్ తమిళ పొలిటికల్ సెటైరికల్ మూవీ)- ఫిబ్రవరి 12
హౌ టు గెట్ టు హెవెన్ ఫ్రమ్ బెల్‌ఫాస్ట్ (ఇంగ్లీష్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12
మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్ (తైవానీస్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 12
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
ఇక్కిస్ (హిందీ బయోగ్రాఫికల్ వార్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 12
ది స్ట్రేంజర్స్ చాప్టర్ 2 (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 12
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 12
సోనీ లివ్ ఓటీటీ
బేబీ గర్ల్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా మూవీ)- ఫిబ్రవరి 12
చౌపల్ ఓటీటీ
యమ్లా (పంజాబీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 12
ఇవాళ ఓటీటీలోకి 8 సినిమాలు
ఇలా ఇవాళ (ఫిబ్రవరి 12) ఒక్కరోజు 8 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో చూసేందుకు తలైవర్ తంబి తలైమయిల్, ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్, మిలియన్ ఫాలోవర్ డిటెక్టివ్, బేబీ గర్ల్, ది స్ట్రేంజర్స్ చాప్టర్ 2, ఇక్కీస్‌తో కలిపి ఆరు సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగులో 3 ఇంట్రెస్టింగ్
ఇక వీటిలో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 3 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఈ మూడు సినిమాల విశేషాలపై ఓ లుక్కేద్దాం.
తలైవర్ తంబి తలైమయిల్ ఓటీటీ
నితీష్ సహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జీవా హీరోగా చేశాడు. తమిళంలో పొలిటికల్ సెటైరికల్ థ్రిల్లర్ కామెడీగా తెరకెక్కిన తలైవర్ తంబి తలైమయిల్ పొంగల్ కానుకగా జనవరి 15, 2026న విడుదలైంది. పెళ్లి రోజున జరిగిన మరణంతో గందరగోళానికి గురైన గ్రామ సర్పంచ్ కథను హాస్యభరితంగా ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ ఓటీటీ
ఇది ఒక సైన్స్ ఫిక్షన్ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. డాన్ ట్రాచ్‌టెన్‌బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వింత జీవితో పోరాటం నేపథ్యంలో సాగుతుంది. అదిరిపోయే విజువల్స్, యాక్షన్‌తో ఈ మూవీ అట్రాక్ట్ చేస్తుంది.
బేబీ గర్ల్ ఓటీటీ
మలయాళ పాపులర్ హీరో నివిన్ పౌలి హీరోగా చేసిన ఈ సినిమా హాస్పిటల్‌లో తప్పిపోయిన బిడ్డ చుట్టూ సాగుతుంది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 7.6 రేటింగ్ ఉంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


