ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు- 5 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో ఏకంగా 4 ఇంట్రెస్టింగ్- అన్నీ థ్రిల్లర్సే!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయ. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏకంగా 5 సినిమాలు ఉంటే అందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 4 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. థ్రిల్లర్స్ అయిన ఈ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్ట్స్, ఈటీవీ విన్, హాట్‌స్టార్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Published on: Jan 8, 2026, 21:20:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో అన్నీ థ్రిల్లర్స్ ఉండటం విశేషం. క్రైమ్, హారర్, ఇన్వెస్టిగేటివ్ ఇలాంటి అంశాలతో థ్రిల్లర్ జోనర్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు- 5 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో ఏకంగా 4 ఇంట్రెస్టింగ్- అన్నీ థ్రిల్లర్సే!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 7 సినిమాలు- 5 చూసేందుకు చాలా స్పెషల్, తెలుగులో ఏకంగా 4 ఇంట్రెస్టింగ్- అన్నీ థ్రిల్లర్సే!

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

హిజ్ అండ్ హర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ మిస్టరీ వెబ్ సిరీస్)- జనవరి 8

ది రూకీ (అమెరికన్ పోలీస్ పొసిజరల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 8

సన్ నెక్ట్స్ ఓటీటీ

సైలెంట్ స్క్రీమ్స్: ది లాస్ట్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ (తెలుగు ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ సినిమా)- జనవరి 8

రాధేయ (తెలుగు డబ్బింగ్ కన్నడ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 8

వెపన్స్ (ఇంగ్లీష్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 8

కానిస్టేబుల్ కనకం సీజన్ 2 (తెలుగు మిస్టరీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఈటీవీ విన్ ఓటీటీ- జనవరి 8

ఛల్లా మడ్ కే నహీ ఆయా (పంజాబీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- చౌపల్ ఓటీటీ- జనవరి 8

ఓటీటీలోకి ఇవాళ 7

ఇలా ఇవాళ (జనవరి 8) 7 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో కానిస్టేబుల్ కనకం సీజన్ 2, వెపన్స్, హిజ్ అండ్ హర్, సైలెంట్ స్క్రీమ్స్‌, రాధేయతో కలిపి ఐదు సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. వీటిలోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 4 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

కానిస్టేబుల్ కనకం సీజన్ 2

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ ‘కానిస్టేబుల్ కనకం’. ఈ సిరీస్ రెండో సీజన్‌లో అడవిగుట్ట అడవుల్లో తప్పిపోయిన అమ్మాయిల మిస్టరీని కనకం ఎలా ఛేదించిందనేది ఈ సీజన్‌లో మరింత ఉత్కంఠభరితంగా చూపించారు. రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రాధేయ (కన్నడ/తెలుగు)

కృష్ణ అజయ్ రావు నటించిన డార్క్ క్రైమ్ థ్రిల్లర్ ‘రాధేయ’. ఒక సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే ఈ కథలో సైకలాజికల్ అంశాలు హైలైట్‌గా నిలుస్తాయి. కిల్లర్ మనస్తత్వం, అతను చేసిన హత్యల వెనుక ఉన్న కారణాలను దర్శకుడు వేదగురు మూర్తి ఎంతో గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు.

వెపన్స్

హాలీవుడ్ హారర్ ప్రియులు ఎంతో ఎదురుచూస్తున్న మూవీ ‘వెపన్స్’. ఒక చిన్న పట్టణంలో 17 మంది పిల్లలు ఒకే రాత్రి అదృశ్యమవ్వడం వెనుక ఉన్న భయంకరమైన మిస్టరీ ఏమిటనేది ఈ సినిమా కథ. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్.

హిజ్ అండ్ హర్స్

నెట్‌ఫ్లిక్స్‌లో నేడు విడుదలైన మరో క్రేజీ సిరీస్ ‘హిజ్ అండ్ హర్స్’. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ ఆరు ఎపిసోడ్ల ఓటీటీ సిరీస్ ప్రేక్షకులను ఆద్యంతం అలరిస్తుంది. అల్యూస్ ఫీనీ నవల ఆధారంగా రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగులో అందుబాటులో ఉంది.

సైలెంట్ స్క్రీమ్స్

ఈ డాక్యుమెంటరీ ప్రధానంగా తెలంగాణలో చోటుచేసుకున్న యదార్థ సంఘటనల చుట్టూ తిరుగుతుంది. అదృశ్యమైన మహిళల కేసులు, ఆ తర్వాత బయటపడిన విస్తుపోయే నిజాలు, బాధితుల కుటుంబాల ఆవేదనను ఇందులో ఎంతో భావోద్వేగంగా చూపించారు. కేవలం నేరాలను వివరించడమే కాకుండా, మన చుట్టూ ఉన్న ప్రమాదకరమైన పరిస్థితులపై ఇది అవగాహన కల్పిస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More