ఓటీటీలోకి ఇవాళ ఉగాది 2026 సందర్భంగా 6 స్పెషల్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటరల్లో ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ రచ్చ చేసేందుకు రెడీ అవుతుంటే ఓటీటీ ప్రియులను అలరించేందుకు కచ్చితంగా చూసేలా ఈ 6 సినిమాలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
జాజ్ సిటీ ఓటీటీ

1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట బ్యాక్‌డ్రాప్‌లో కోల్‌కతాలోని ఒక జాజ్ క్లబ్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆ జాజ్ క్లబ్ గూఢచారులకు ఎలా నిలయంగా మారింది? అక్కడ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జాజ్ సిటీని రూపొందించారు.
సోనీ లివ్‌లో జాజ్ సిటీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (మార్చి 19) సోనీ లివ్‌లో జాజ్ సిటీ ఓటీటీ రిలీజ్ అయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
ల్యాండ్‌లార్డ్ ఓటీటీ
వీర సింహారెడ్డి సినిమాలో విలన్‌గా చేసిన కన్నడ హీరో దునియా విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ల్యాండ్‌లార్డ్. కాటేరా డైరెక్టర్ జదేషా కె హంపీ దర్శకత్వం వహించిన ఈ కన్నడ మూవీ 1980ల నాటి కర్ణాటక గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సామాజిక పోరాట చిత్రం.
శతాబ్దాలుగా సాగుతున్న ఫ్యూడల్ వ్యవస్థపై తిరుగుబాటు చేసి, తమ భూమిని, హక్కులను, గౌరవాన్ని ఎలా కాపాడుకున్నారన్నదే ల్యాండ్‌ల్యాండ్ కథ. జీ5లో నేటి నుంచి అంటే మార్చి 19 నుంచి ల్యాండ్‌ల్యాండ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సుమతీ శతకం ఓటీటీ
బిగ్ బాస్ అమర్దీప్ చౌదరి హీరోగా నటించిన తెలుగు రొమాంటిక్ రూరల్ డ్రామా సినిమా సుమతీ శతకం. ఓ గ్రామంలో మూఢనమ్మకాలు, దైవత్వం, ప్రేమ వంటి అంశాలతో సాగే సినిమా ఇది. సుమతిని ప్రేమించిన కృష్ణ ఆమెకోసం ఏం చేశాడనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మార్చి 19 నుంచి ఈటీవీ విన్లో సుమతీ శతకం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సీతా పయనం ఓటీటీ
{{/usCountry}}బిగ్ బాస్ అమర్దీప్ చౌదరి హీరోగా నటించిన తెలుగు రొమాంటిక్ రూరల్ డ్రామా సినిమా సుమతీ శతకం. ఓ గ్రామంలో మూఢనమ్మకాలు, దైవత్వం, ప్రేమ వంటి అంశాలతో సాగే సినిమా ఇది. సుమతిని ప్రేమించిన కృష్ణ ఆమెకోసం ఏం చేశాడనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మార్చి 19 నుంచి ఈటీవీ విన్లో సుమతీ శతకం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
సీతా పయనం ఓటీటీ
{{/usCountry}}తమిళ స్టార్ యాక్షన్ హీరో అర్జున్ సర్జా మరోసారి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా సీతా పయనం. ఈ సినిమాలో హీరోయిన్‌గా అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్‌ను పరిచయం చేశారు. తెలుగు రోడ్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా సీతా పయనం సినిమాను రూపొందించారు.
అర్జున్ సర్జాతోపాటు అతని మేనల్లుడు ధ్రువ్ సర్జా కూడా కీలక పాత్రలు పోషించిన సీతా పయనం ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 19 నుంచి సన్ నెక్ట్స్‌లో సీతీ పయనం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోందని తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో సీతా పయనం ఓటీటీ రిలీజ్ అయింది.
మోహ్ ఓటీటీ
పంజాబీలో రొమాంటిక్ ట్రాజెడీ డ్రామాగా తెరకెక్కిన సినిమానే మోహ్. గితజ్ బింద్రాఖియా, సర్గున్ మెహతా, పరమిందర్ గిల్, కుల్జిందర్ సింగ్ సిద్ధు, అనిత మీత్, ప్రకాష్ గదు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు జగ్‌దీప్ సిద్ధు దర్శకత్వం వహించారు. చౌపల్ ఓటీటీలో నేటి నుంచి మోహ్ స్ట్రీమింగ్ అవుతోంది.
ది హౌజ్‌మెయిడ్ ఓటీటీ
అమెరికన్ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ది హౌజ్‌మెయిడ్. ఓ ఇంట్లో పనిచేసే ఆయా చుట్టూ ఈ సినిమా ఉత్కంఠంగా సాగుతుంది. బోల్డ్, సస్పెన్స్, ఇంట్రెస్టింగ్ సీన్లతో ఈ మూవీని పాల్ ఫీగ్ తెరకెక్కించారు. రెబెకా సొన్నెన్‌షైన్ రచించారు. థ్రిల్లర్స్ ఇష్టపడేవారు నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 19 నుంచి ది హౌజ్‌మెయిడ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేయవచ్చు.
తెలుగులో 2 మాత్రమే
ఇలా ఇవాళ (మార్చి 19) 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో అన్నీ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉండగా.. తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా సీతా పయనం, సుమతీ శతకం రెండు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.