OTT Today Ugadi: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 6 స్పెషల్ సినిమాలు- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఉగాదికి ఇక్కడ చూసేయండి!

OTT Release Movies Today Ugadi 2026: ఓటీటీలోకి ఇవాళ ఉగాది సందర్భంగా 6 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు అన్నీ చాలా స్పెషల్‌గా ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 2 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అందులో స్పై యాక్షన్, ఎరోటిక్ బోల్డ్, రొమాంటిక్ డ్రామా వంటి జోనర్లలో సినిమాలు ఉన్నాయి.

Published on: Mar 19, 2026, 06:12:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఉగాది 2026 సందర్భంగా 6 స్పెషల్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటరల్లో ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ రచ్చ చేసేందుకు రెడీ అవుతుంటే ఓటీటీ ప్రియులను అలరించేందుకు కచ్చితంగా చూసేలా ఈ 6 సినిమాలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 6 స్పెషల్ సినిమాలు- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఉగాదికి ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 6 స్పెషల్ సినిమాలు- తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్- ఉగాదికి ఇక్కడ చూసేయండి!

జాజ్ సిటీ ఓటీటీ

1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట బ్యాక్‌డ్రాప్‌లో కోల్‌కతాలోని ఒక జాజ్ క్లబ్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఆ జాజ్ క్లబ్ గూఢచారులకు ఎలా నిలయంగా మారింది? అక్కడ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో జాజ్ సిటీని రూపొందించారు.

సోనీ లివ్‌లో జాజ్ సిటీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇవాళ (మార్చి 19) సోనీ లివ్‌లో జాజ్ సిటీ ఓటీటీ రిలీజ్ అయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ల్యాండ్‌లార్డ్ ఓటీటీ

వీర సింహారెడ్డి సినిమాలో విలన్‌గా చేసిన కన్నడ హీరో దునియా విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ల్యాండ్‌లార్డ్. కాటేరా డైరెక్టర్ జదేషా కె హంపీ దర్శకత్వం వహించిన ఈ కన్నడ మూవీ 1980ల నాటి కర్ణాటక గ్రామీణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సామాజిక పోరాట చిత్రం.

శతాబ్దాలుగా సాగుతున్న ఫ్యూడల్ వ్యవస్థపై తిరుగుబాటు చేసి, తమ భూమిని, హక్కులను, గౌరవాన్ని ఎలా కాపాడుకున్నారన్నదే ల్యాండ్‌ల్యాండ్ కథ. జీ5లో నేటి నుంచి అంటే మార్చి 19 నుంచి ల్యాండ్‌ల్యాండ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సుమతీ శతకం ఓటీటీ

బిగ్ బాస్ అమర్‌దీప్ చౌదరి హీరోగా నటించిన తెలుగు రొమాంటిక్ రూరల్ డ్రామా సినిమా సుమతీ శతకం. ఓ గ్రామంలో మూఢనమ్మకాలు, దైవత్వం, ప్రేమ వంటి అంశాలతో సాగే సినిమా ఇది. సుమతిని ప్రేమించిన కృష్ణ ఆమెకోసం ఏం చేశాడనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మార్చి 19 నుంచి ఈటీవీ విన్‌లో సుమతీ శతకం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

సీతా పయనం ఓటీటీ

తమిళ స్టార్ యాక్షన్ హీరో అర్జున్ సర్జా మరోసారి మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా సీతా పయనం. ఈ సినిమాలో హీరోయిన్‌గా అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్‌ను పరిచయం చేశారు. తెలుగు రోడ్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా సీతా పయనం సినిమాను రూపొందించారు.

అర్జున్ సర్జాతోపాటు అతని మేనల్లుడు ధ్రువ్ సర్జా కూడా కీలక పాత్రలు పోషించిన సీతా పయనం ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 19 నుంచి సన్ నెక్ట్స్‌లో సీతీ పయనం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోందని తెలుస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో సీతా పయనం ఓటీటీ రిలీజ్ అయింది.

మోహ్ ఓటీటీ

పంజాబీలో రొమాంటిక్ ట్రాజెడీ డ్రామాగా తెరకెక్కిన సినిమానే మోహ్. గితజ్ బింద్రాఖియా, సర్గున్ మెహతా, పరమిందర్ గిల్, కుల్జిందర్ సింగ్ సిద్ధు, అనిత మీత్, ప్రకాష్ గదు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు జగ్‌దీప్ సిద్ధు దర్శకత్వం వహించారు. చౌపల్ ఓటీటీలో నేటి నుంచి మోహ్ స్ట్రీమింగ్ అవుతోంది.

ది హౌజ్‌మెయిడ్ ఓటీటీ

అమెరికన్ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ది హౌజ్‌మెయిడ్. ఓ ఇంట్లో పనిచేసే ఆయా చుట్టూ ఈ సినిమా ఉత్కంఠంగా సాగుతుంది. బోల్డ్, సస్పెన్స్, ఇంట్రెస్టింగ్ సీన్లతో ఈ మూవీని పాల్ ఫీగ్ తెరకెక్కించారు. రెబెకా సొన్నెన్‌షైన్ రచించారు. థ్రిల్లర్స్ ఇష్టపడేవారు నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 19 నుంచి ది హౌజ్‌మెయిడ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై లుక్కేయవచ్చు.

తెలుగులో 2 మాత్రమే

ఇలా ఇవాళ (మార్చి 19) 6 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వాటిలో అన్నీ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉండగా.. తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా సీతా పయనం, సుమతీ శతకం రెండు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More