OTT Today: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు- 6 చాలా స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

OTT Releases Today: ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 6 సినిమాలు ఉంటే తెలుగులో 4 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, హాట్‌స్టార్ వంటి వేదికలపై యాక్షన్, ఫాంటసీ, రొమాంటిక్ జోనర్లతో వచ్చిన నేటి ఓటీటీ సినిమాలపై లుక్కేద్దాం.

Published on: Jun 25, 2026, 14:00:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Today OTT Release Movies: థియేటర్లతో పాటు ఓటీటీ స్క్రీన్లపై సరికొత్త కథలను ఆస్వాదించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వీకెండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఒక రోజు ముందే ప్లాన్ చేసుకునేలా సరిగ్గా జూన్ 25న అంటే ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. తెలుగు స్ట్రయిట్ సినిమాలతో పాటు యాక్షన్ థ్రిల్లర్లు, గ్లోబల్ హిట్ సిరీస్‌లు డిజిటల్ వీక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి అవేంటో చూద్దాం.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు- 6 చాలా స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజు 8 సినిమాలు- 6 చాలా స్పెషల్, తెలుగులో 4 ఇంట్రెస్టింగ్- ఇక్కడ చూసేయండి!

నెట్‌ఫ్లిక్స్‌లో యాక్షన్ ‘బ్లాస్ట్’.. గ్లోబల్ ఫాంటసీ సిరీస్

నెట్‌ఫ్లిక్స్ తన తెలుగు సబ్‌స్క్రైబర్ల కోసం రెండు విభిన్నమైన ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తోంది. తమిళంలో మంచి అంచనాలున్న యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రం ‘బ్లాస్ట్’ (Blast) తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో జూన్ 25 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

దీంతో పాటు, ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న హాలీవుడ్ ఫాంటసీ అడ్వెంచర్ సిరీస్ ‘అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్’ సీజన్ 2 (Avatar: The Last Airbender Season 2) కూడా ఇవాళే తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీ రిలీజ్ అయింది.

ఈటీవీ విన్‌లో స్వచ్ఛమైన తెలుగు వినోదం

మన నేటివిటీకి తగిన సరికొత్త కథలను అందిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ (ETV Win) ఈసారి రెండు క్రేజీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్లను సిద్ధం చేసింది. అందులో మొదటిది ‘కొత్త కొత్తగా’ (Kotha Kothaga) సినిమా.

ఫ్యామిలీ ఎమోషన్స్, యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో సాగే ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ‘డియర్ కేరళ కుట్టి’ (Dear Kerala Kutti) అనే సరికొత్త తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ కూడా జూన్ 25న డిజిటల్ వీక్షకుల ముందుకు వచ్చేసింది. లోకల్ ఫ్లేవర్‌తో సాగే లవ్ స్టోరీలను ఇష్టపడే యువతకు ఇది మంచి ఛాయిస్ కానున్నాయి.

జియో హాట్‌స్టార్, ప్రైమ్ వీడియోలలో గ్లోబల్ హిట్స్

ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సైకలాజికల్ వర్క్‌ప్లేస్ కామెడీ డ్రామా సిరీస్ ‘ది బేర్’ సీజన్ 5 (The Bear Season 5) ఇంగ్లీష్ వెర్షన్‌లో జియో హాట్‌స్టార్ ద్వారా అందుబాటులోకి వచ్చింది. రెస్టారెంట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఇంటెన్స్ డ్రామాకు గ్లోబల్ లెవెల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.

మరోవైపు, చిన్న పిల్లలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో యానిమేషన్ కామెడీ అడ్వెంచర్ ఓటీటీ సిరీస్ ‘క్యాంప్ స్నూపీ’ సీజన్ 2 (Camp Snoopy Season 2) నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రాంతీయ భాషల వైవిధ్యమైన చిత్రాలు

ఇతర భాషా చిత్రాల్లోని వైవిధ్యాన్ని కోరుకునే సినీ ప్రియుల కోసం ఇవాళ మరికొన్ని ఆప్షన్లు రెడీగా ఉన్నాయి. చౌపల్ (Chaupal) ప్లాట్‌ఫామ్‌లో పంజాబీ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సిరీస్ ‘మొహబ్బతీ రత్’ (Mohabbati Rat) నేడు ఓటీటీ రిలీజ్ అయింది.

అలాగే మనోరమ మ్యాక్స్ (Manorama Max) ఓటీటీలో మలయాళ స్పోర్ట్స్ రొమాంటిక్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీ ‘కప్: లవ్ ఆల్ ప్లే’ (Cup: Love All Play) స్ట్రీమింగ్ కానుంది. మలయాళీ సినిమాల్లోని సహజత్వానికి తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతుండటంతో ఈ స్పోర్ట్స్ డ్రామాపై కూడా మంచి ఆసక్తి నెలకొంది.

ఇవాళ ఓటీటీ రిలీజ్ సినిమాల జాబితా:

సినిమా / సిరీస్ పేరుజోనర్ (Genre)ఓటీటీ ప్లాట్‌ఫామ్అందుబాటులో ఉన్న భాషలు
బ్లాస్ట్ (Blast)యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్నెట్‌ఫ్లిక్స్ (Netflix)తమిళం (తెలుగు డబ్బింగ్)
అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ (సీజన్ 2)ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్నెట్‌ఫ్లిక్స్ (Netflix)ఇంగ్లీష్ (తెలుగు డబ్బింగ్)
కొత్త కొత్తగారొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామాఈటీవీ విన్ (ETV Win)తెలుగు (ఒరిజినల్)
డియర్ కేరళ కుట్టిరొమాంటిక్ కామెడీ సిరీస్ఈటీవీ విన్ (ETV Win)తెలుగు (ఒరిజినల్)
ది బేర్ (సీజన్ 5)సైకలాజికల్ వర్క్‌ప్లేస్ కామెడీజియో హాట్‌స్టార్ (Jio Hotstar)ఇంగ్లీష్
క్యాంప్ స్నూపీ (సీజన్ 2)యానిమేషన్ ఫ్యామిలీ అడ్వెంచర్అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)ఇంగ్లీష్
మొహబ్బతీ రత్మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాచౌపల్ (Chaupal)పంజాబీ
కప్: లవ్ ఆల్ ప్లేస్పోర్ట్స్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామామనోరమ మ్యాక్స్ (ManoramaMAX)మలయాళం

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

ఇలా ఇవాళ (జూన్ 25) ఒక్కరోజే 8 సినిమాలు ఓటీటీలోకి వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా బ్లాస్ట్, అవతార్: ది లాస్ట్ ఎయిర్‌బెండర్ సీజన్ 2, కొత్త కొత్తగా, డియర్ కేరళ కుట్టి, మొహబ్బతి రట్, కప్ లవ్ ఆల్ ప్లేతో కలిపి 6 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 4 ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More