ఓటీటీలోకి గతవారం (ఫిబ్రవరి 16 నుంచి 22 వరకు) తెలుగు భాషలో కేవలం 5 సినిమాలు మాత్రమే స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు అన్నీ స్పెషల్‌గానే ఉన్నాయి. కానీ, రెండు మాత్రం తెలుగు స్ట్రయిట్ సినిమాలుగా ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు, వాటి జోనర్స్, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో రెండు సినిమాలు తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైకలాజికల్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 56 డేస్. ఓ ఇంట్లో జరిగే దారుణ హత్య చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. ఫిబ్రవరి 18 నుంచి ఈ ఓటీటీ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక మరో సినిమా ఈషా. తెలుగు హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈషా సినిమాలో హెబ్బా పటేల్, సిరి హనుమంత్, అరుణ్ కల్యాణ్, బబ్లూ పృథ్వీరాజ్, మైమ్ మధు, అఖిల్ రాజ్ ఉద్దెమరి తదితరులు నటించారు. 9.1 రేటింగ్ అందుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 20న ఓటీటీ రిలీజ్ అయింది.
చథా పచ్చ ఓటీటీ
తెలుగులో వచ్చిన మలయాళం యాక్షన్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా సినిమా చథా పచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్. ముగ్గురు అన్నదమ్ముల చుట్టూ సాగే కథగా తెరకెక్కింది ఈ సినిమా. నెట్‌ఫ్లిక్స్‌లో చథా పచ్చ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 19 నుంచి తెలుగు భాషలో కూడా చథా పచ్చా ఓటీటీ రిలీజ్ అయింది.
లక్కీ: ది సూపర్‌స్టార్ ఓటీటీ
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, మలయాళ బ్యూటిఫుల్ అనస్వర రాజన్ హీరోయిన్గా తెరకెక్కిన తమిళ ఫ్యామిలీ కామెడీ పొలిటికల్ డ్రామా సినిమా లక్కీ ది సూపర్‌స్టార్. ఓ కుక్కపిల్ల చుట్టూ ఈ సినిమా సాగుతుంది.
{{/usCountry}}సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, మలయాళ బ్యూటిఫుల్ అనస్వర రాజన్ హీరోయిన్గా తెరకెక్కిన తమిళ ఫ్యామిలీ కామెడీ పొలిటికల్ డ్రామా సినిమా లక్కీ ది సూపర్‌స్టార్. ఓ కుక్కపిల్ల చుట్టూ ఈ సినిమా సాగుతుంది.
{{/usCountry}}జియో హాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 20న లక్కీ ది సూపర్ స్టార్ ఓటీటీ రిలీజ్ అయింది. తమిళంతోపాటు తెలుగు సహా ఏడు భాషల్లో లక్కీ ది సూపర్‌స్టార్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రేమ రేఖ ఓటీటీ
ప్రతి ఆదివారం కథా సుధ వంటి ఓటీటీ వీక్లీ సిరీస్‌లో భాగంగా స్వచ్ఛమైన సినిమాలు అందించే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్. అలాంటి ఈటీవీ విన్‌లో ఫిబ్రవరి 22 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న తెలుగు ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా సినిమా ప్రేమ రేఖ. షాయాజీ షిండే ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బెస్ట్ ఛాయిస్.