ఓటీటీలో గత వారం తెలుగు భాషలో ఏకంగా 12 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో హారర్, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ జోనర్లతో కచ్చితంగా చూసేలా ఉన్నాయి.

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్, జియో హాట్‌స్టార్, జీ5, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఆ ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
బ్రింగ్ హర్ బ్యాక్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 24
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా సిరీస్)- నవంబర్ 26
జింగిల్ బెల్ హీస్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ క్రైమ్ హీస్ట్ మూవీ)- నవంబర్ 26
మాస్ జాతర (తెలుగు కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- నవంబర్ 28
ఆర్యన్ (తెలుగు డబ్బింగ్ తమిళ సైకో మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- నవంబర్ 28
మరిన్ని ఓటీటీల్లో
అమృతం (తెలుగు సిట్-కామ్ సిరీస్)- యూట్యూబ్- నవంబర్ 24
పాంచ్‌మినార్ (తెలుగు క్రైమ్ కామెడీ సినిమా)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- నవంబర్ 28
శశివదనే (తెలుగు రొమాంటిక్ రూరల్ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ-నవంబర్ 28
{{/usCountry}}శశివదనే (తెలుగు రొమాంటిక్ రూరల్ డ్రామా సినిమా)- సన్ నెక్ట్స్ ఓటీటీ-నవంబర్ 28
{{/usCountry}}ఆన్ పావమ్ పొల్లతతు (తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- జియో హాట్‌స్టార్ ఓటీటీ- నవంబర్ 28
ది పెట్ డిటెక్టివ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ సినిమా)- జీ5 ఓటీటీ- నవంబర్ 28
ప్రేమిస్తున్నా (తెలుగు బోల్డ్ రొమాంటిక్ సినిమా)- ఆహా ఓటీటీ- నవంబర్ 28
కరిముల్లా బిర్యానీ పాయింట్(తెలుగు కామెడీ డ్రామా ఫిల్మ్)- ఈటీవీ విన్ ఓటీటీ- నవంబర్ 30
ఓటీటీలోకి తెలుగులో 12
ఇలా గత వారం (నవంబర్ 24 నుంచి నవంబర్ 30) వరకు తెలుగు భాషలో ఏకంగా 12 సినిమాలు ఓటీటీ ప్రీమియర్‌కు వచ్చాయి. ఈ 12 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
తెలుగు స్ట్రయిట్ సినిమాలు
అయితే, వాటిలో మాస్ మహారాజా రవితేజ-శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన మాస్ జాతర, రొమాంటిక్ సినిమాలు శశివదనే, ప్రేమిస్తున్నా, రాజ్ తరుణ్ రాశి సింగ్‌ల క్రైమ్ కామెడీ చిత్రం పాంచ్ మినార్, కామెడీ సినిమా కరిముల్లా బిర్యాని పాయింట్ తెలుగు స్ట్రయిట్ సినిమాలు.
మొత్తంగా 6 ఇంట్రెస్టింగ్
ఈ 5 సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. వీటితోపాటు సిట్ కామ్ సిరీస్‌గా వచ్చిన అమృతం మరింత స్పెషల్‌గా ఉంది. ఇలా మొత్తంగా ఆరు తెలుగు స్ట్రయిట్ సినిమాలు చూసేందుకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఏడింట్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.