...
...
Next Story

Dhurandhar 2 Piracy: నిషేధం ఉన్న ధురంధర్ 2 పైరసీ చూసిన పాక్ రిపోర్టర్- పాకిస్థాన్‌లో స్పైగా మొదటి రోజు అంటూ!

Pak Reporter Watched Dhurandhar 2 Piracy At Lahore: రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. పాకిస్థాన్‌లో ఈ సినిమాపై నిషేధం ఉన్నప్పటికీ, అక్కడి ఒక జర్నలిస్ట్ ధురంధర్ 2 పైరసీ వెర్షన్ చూస్తూ సోషల్ మీడియాలో వీడియో పెట్టడం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Mar 21, 2026, 14:55:34 IST
Advertisement

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన గూఢచారి యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సంచలనం సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే భారత్‌లో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

ధురంధర్ 2పై నిషేధం

నిషేధం ఉన్న ధురంధర్ 2 పైరసీ చూసిన పాక్ రిపోర్టర్- పాకిస్థాన్‌లో స్పైగా మొదటి రోజు అంటూ!
నిషేధం ఉన్న ధురంధర్ 2 పైరసీ చూసిన పాక్ రిపోర్టర్- పాకిస్థాన్‌లో స్పైగా మొదటి రోజు అంటూ!

అయితే, ఇండియా సరిహద్దు దేశమైన పాకిస్థాన్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ధురంధర్ 2 సినిమాపై నిషేధం విధించారు. కానీ, ఏ నిషేధాలు అడ్డుకోలేని విధంగా పాక్ ప్రజలు ఈ సినిమాను చూసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు.

ట్విట్టర్‌లో పాక్ జర్నలిస్ట్ వీడియో కలకలం

లాహోర్‌కు చెందిన ఖలీద్ మెహమూద్ అనే పాక్ జర్నలిస్ట్ తన ఇంట్లోని టీవీలో ‘ధురంధర్ 2’ సినిమా చూస్తున్నట్లు ఒక వీడియోను ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో రణ్‌వీర్ సింగ్‌కు సంబంధించిన ఒక కీలకమైన సీన్ ప్లే అవుతోంది.

పైరేటెడ్ వెర్షన్

"లాహోర్‌లో ధురంధర్ 2 చూస్తున్నాను" అంటూ పాకిస్థాన్ జర్నలిస్ట్ ఖలీద్ పెట్టిన పోస్ట్ చూస్తుంటే, అది థియేటర్లలో దొంగతనంగా రికార్డ్ చేసిన పైరేటెడ్ వెర్షన్ (కెమెరా ప్రింట్ లేదా పైరసీ) అని స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్థాన్‌లోని ఒక ప్రముఖ వార్తాపత్రికలో పనిచేస్తున్నానని చెప్పుకునే వ్యక్తి ఇలా బహిరంగంగా పైరసీని ప్రోత్సహించడం ఇప్పుడు చర్చకు దారితీసింది.

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ చూసినప్పుడు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భారతీయ నెటిజన్లు తమదైన శైలిలో కౌంటర్లు ఇస్తున్నారు. టీవీ స్క్రీన్ పై ఉన్న ఒక చిన్న గీతను చూసి, "ఆ టీవీకి పగుళ్లు ఉన్నాయి.. బహుశా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ చూసినప్పుడు పగిలిపోయినట్టుంది" అని ఒకరు ఎద్దేవా చేశారు.

"పాకిస్థాన్‌లో గూఢచారిగా మొదటి రోజు".. నెటిజన్ల సెటైర్లు

మరికొందరైతే "సినిమా ఎంత బాగుందంటే.. పాకిస్థానీయులు కూడా నిషేధాన్ని లెక్కచేయకుండా ఎంజాయ్ చేస్తున్నారు" అని కామెంట్స్ పెడుతున్నారు. గతంలో డిసెంబర్‌లో మొదటి భాగం విడుదలైనప్పుడు, అలాగే ఫిబ్రవరిలో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చినప్పుడు కూడా పాక్ మార్కెట్లలో ఈ సినిమా పైరేటెడ్ కాపీలు కేవలం రూ. 16 రూపాయలకే అమ్ముడయ్యాయనే వార్తలు వచ్చాయి.

సినిమా విశేషాలు

‘ధురంధర్ 2’ కథ విషయానికొస్తే.. రెహమాన్ డెకాయ్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత ల్యారీకి 'బాద్‌షా'గా మారిన హమ్జా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) ప్రయాణం ఈ పార్ట్‌లో కొనసాగుతుంది. బలూచిస్థాన్‌లోని ఒక గ్యాంగ్‌లో చేరి, ఉగ్రవాద ముఠాను లోపలి నుంచి దెబ్బతీసే భారతీయ గూఢచారిగా రణ్‌వీర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

సరిహద్దులు దాటి మరి

ధురంధర్ 2 సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తోపాటు అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ ఇక్బాల్, యామీ గౌతమ్ తదితరులు తమ పాత్రలతో మెప్పించారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా, కంటెంట్ బాగుంటే సరిహద్దులు దాటి మరి ప్రేక్షకులు ఆదరిస్తారని ‘ధురంధర్ 2’ మరోసారి నిరూపించింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks