Survival Thriller Photographer OTT Release: దట్టమైన అడవి.. ఊహకందని రహస్యాలు.. ఒక్క ఫొటోతో జీవితాన్నే మార్చేసుకోవాలనుకునే ఒక యువకుడి సాహసోపేత ప్రయాణం. వినోదప్రియులకు థ్రిల్లింగ్ అనుభూతిని పంచే సస్పెన్స్ చిత్రాలకు ఓటీటీ వేదికలపై ఎప్పుడూ విశేష ఆదరణ ఉంటుంది.
మిస్టీరియస్ సర్వైవల్ థ్రిల్లర్

అదే బాటలో విభిన్నమైన మిస్టీరియస్ ఫాంటసీ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం 'ఫొటోగ్రాఫర్' (Photographer) ప్రస్తుతం ఓటీటీలో సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
గుర్తింపు కోసం అడవిబాట పట్టిన వీరా
ఆష్రఫ్ ఏ. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫొటోగ్రాఫర్ చిత్రంలో అష్రఫ్ అలీ, కలట్‌పడై జై, కరుణాకరన్, జనని సామంతనం కీలక పాత్రలు పోషించారు. తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించడం లేదన్న తీవ్ర అసంతృప్తితో ఉన్న వీరా (అష్రఫ్ అలీ) అనే ఫొటోగ్రాఫర్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
అడవిలో అరుదైన దృశ్యం
కెరీర్‌లో ఎలాగైనా పెద్ద విజయం సాధించాలనే తపనతో ఉన్న అతనికి 'మ్యాథికెట్టన్ సోలై' అనే రహస్యమైన ఫారెస్ట్ రిజర్వ్ గురించి సమాచారం అందుతుంది. ఆ అడవిలో చాలా అరుదుగా సంభవించే ఒక అద్భుతమైన సహజ దృశ్యాన్ని తన కెమెరాలో బంధిస్తే తిరుగుండదని భావించి, ప్రాణాలకు తెగించి ఒంటరిగా అడవిలోకి అడుగుపెడతాడు.
ప్రకృతి అందాల చాటున దాగున్న భయం
అడవిలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో ప్రకృతి రమణీయత వీరాను ఎంతగానో అలరిస్తుంది. అయితే, అడవి లోపలికి వెళ్లేకొద్దీ అక్కడి ప్రతికూల వాతావరణం అతడిలో అసౌకర్యాన్ని పెంచుతుంది. తాను అన్వేషిస్తున్న ఆ అరుదైన దృశ్యం వెనుక ఏదో అసాధారణమైన మిస్టరీ ఉందనే నిజం మెల్లగా తెలుస్తుంది.
వెంటాడే గతం తాలూకు ఘటనలు
దీనికితోడు అతడి గతానికి సంబంధించిన ఘటనలు కూడా ఈ ప్రయాణంలో నీడలా వెంటాడుతాయి. తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ప్రమాదాన్ని సైతం లెక్కచేయకుండా ముందడుగు వేస్తాడు వీరా. కానీ, అడుగడుగునా చావు భయం చూపిస్తుంది ఆ అడవి.
మిస్టరీని ఛేదించాడా? థ్రిల్ పంచే మలుపులు
{{/usCountry}}దీనికితోడు అతడి గతానికి సంబంధించిన ఘటనలు కూడా ఈ ప్రయాణంలో నీడలా వెంటాడుతాయి. తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ప్రమాదాన్ని సైతం లెక్కచేయకుండా ముందడుగు వేస్తాడు వీరా. కానీ, అడుగడుగునా చావు భయం చూపిస్తుంది ఆ అడవి.
మిస్టరీని ఛేదించాడా? థ్రిల్ పంచే మలుపులు
{{/usCountry}}ప్రాణాపాయం పొంచి ఉందని తెలిసినా ముందుకు సాగిన వీరా, చివరికి ఆ అరుదైన దృశ్యాన్ని కెమెరాలో బంధించగలిగాడా? ఆ దట్టమైన అడవి అతనికి నేర్పిన పాఠమేంటి? అక్కడ దాగి ఉన్న అసలు రహస్యమేంటి? అసలు ఆ అడవిలో వింతలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రాణాలతో వీరా బయటపడ్డాడా? అనే ఆసక్తికర ప్రశ్నలకు సమాధానంగా ముగింపు సాగుతుంది.
ఫొటోగ్రాఫర్ ఐఎమ్‌డీబీ రేటింగ్
ప్రశాంతమైన అడవి నేపథ్యంలో మొదలై ఉత్కంఠభరితమైన ఫాంటసీ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపాంతరం చెందే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఫొటోగ్రాఫర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో 7.9 రేటింగ్ కూడా దక్కించుకుంది.
ఫొటోగ్రాఫర్ ఓటీటీ స్ట్రీమింగ్
ఇంతటి థ్రిల్లింగ్ క్రేజీ సినిమా ఫొటోగ్రాఫర్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో నిన్న అంటే సెప్టెంబర్ 25న ఫొటోగ్రాఫర్ ఓటీటీ రిలీజ్ అయింది. వీకెండ్‌లో విభిన్నమైన సస్పెన్స్, ఫాంటసీ, థ్రిల్లింగ్, మిస్టరీ అంశాలతో కూడిన సినిమాలను ఇష్టపడేవారికి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఫొటోగ్రాఫర్ బెస్ట్ ఆప్షన్.