...
...
Next Story

OTT Malayalam Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ- ఏలియన్‌కు తాగుడు అలవాటు, నో పవర్స్-ఎక్కడ చూడాలంటే?

Pluto OTT Streaming Today: మలయాళంలో వచ్చిన విభిన్న సైన్స్ ఫిక్షన్ కామెడీ చిత్రం ప్లూటో థియేటర్ల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. నీరజ్ మాధవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ప్లూటో ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ఎలాంటి పవర్స్ లేని ఏలియన్ కథగా తెరకెక్కిన ప్లూటో ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Aug 24, 2026, 20:59:29 IST
Advertisement

Pluto OTT Release Today: ఇటీవలి కాలంలో మలయాళ చిత్రసీమ సరికొత్త ప్రయోగాలకు నిలయంగా మారింది. అతి తక్కువ బడ్జెట్‌లో వైవిధ్యమైన కథాంశాలను తెరకెక్కిస్తూ మెప్పిస్తున్న మాలీవుడ్ నుంచి వచ్చిన మరో భిన్నమైన ప్రయత్నమే 'ప్లూటో' (Pluto).

ఓటీటీలోకి ప్లూటో సినిమా

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ- ఏలియన్‌కు తాగుడు అలవాటు, నో పవర్స్-ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ- ఏలియన్‌కు తాగుడు అలవాటు, నో పవర్స్-ఎక్కడ చూడాలంటే?

సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిన ప్లూటో సినిమా జులై 30న థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించుకుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఐఎమ్‌డీబీలో మాత్రం 6.7 రేటింగ్ దక్కించుకుంది ప్లూటో. అలాంటి ప్లూటో ఓటీటీలోకి ఇవాళ (ఆగస్ట్ 24) వచ్చేసింది.

ఏలియన్‌తో ఒక కుర్రాడి ప్రయాణం

ఈ కథ అంతా విక్కీ (నీరజ్ మాధవ్) అనే ఒక మధ్యతరగతి యువకుడి చుట్టూ తిరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఒక ఏలియన్ భూమిపైకి వచ్చి చిక్కుకుపోతుంది. ఆ గ్రహాంతరవాసిని చూసిన విక్కీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది.

ఏలియన్, మనిషి స్నేహం చుట్టూ

'ప్లూటో' అని పేరు పెట్టుకున్న ఆ ఏలియన్‌తో విక్కీకి ఎలాంటి బంధం ఏర్పడింది? వారిద్దరూ కలిసి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది. గతంలో వచ్చిన హాలీవుడ్ క్లాసిక్ 'ఈటీ' (E.T.), హిందీ చిత్రం 'కోయీ మిల్‌గయా' తరహాలోనే, ఒక ఏలియన్-మనిషి మధ్య స్నేహాన్ని దర్శకుడు ఇందులో వినోదాత్మకంగా మలిచారు.

భిన్నమైన సైన్స్ ఫిక్షన్ ప్రయత్నం

కొత్త ప్రదేశంలో చిక్కుకుని, ఏం చేయాలో తోచక ఇబ్బందిపడే ఒక అనాథలా కనిపిస్తాడు. తమ సొంత సమస్యల్లో ఉన్న విక్కీ, ఆ ఏలియన్ కలిసి సాగించే ప్రయాణం ప్రేక్షకులకు నవ్వులతో పాటు ఎమోషన్‌ను కూడా అందిస్తుంది. అంతేకాకుండా ఆ ఏలియన్‌కు హీరో ఆల్కహాల్ డ్రింక్ అలవాటు చేయడం వంటి సీన్లు ఆకట్టుకుంటాయి.

మిశ్రమ స్పందన.. ఎలా ఉందంటే?

తక్కువ బడ్జెట్‌లో సైన్స్ ఫిక్షన్ కామెడీని తీసేందుకు నిర్మాతలు చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినదే అయినప్పటికీ, కథనంలో మరింత ప్రతిభ చూపించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. "పరిమిత బడ్జెట్ ఉన్నంత మాత్రాన ఊహాశక్తికి హద్దులు ఉండాల్సిన అవసరం లేదు" అని రివ్యూలు వచ్చాయి.

ఎటువంటి అశ్లీలత లేకుండా

అమీర్ ఖాన్ 'పీకే' లేదా హాలీవుడ్ చిత్రం 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' తరహాలో మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్‌తో వెళ్లే అవకాశం ఉన్నా, ఒక సాధారణ కామెడీ ఎంటర్‌టైనర్‌గానే ఈ చిత్రం ముగిసిందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా, ఎటువంటి అశ్లీలత లేకుండా కుటుంబమంతా కలసి సరదాగా చూడటానికి మాత్రం 'ప్లూటో' ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

ప్లూటో ఓటీటీ స్ట్రీమింగ్

అలాంటి ప్లూటో ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకుంటోంది. సైనా ప్లే (Saina Play)లో నేడు ఆగస్ట్ 24 నుంచి నుంచి ప్లూటో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ప్లూటో ఓటీటీ రిలీజ్ తర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe