రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ (The Raja Saab) ఎట్టకేలకు వెండితెరపై సందడి చేస్తోంది. ‘కల్కి 2898 AD’ లాంటి భారీ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్ పూర్తిగా భిన్నమైన హారర్ కామెడీ జానర్‌లో కనిపించడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.

ఇవాళ (జనవరి 9) థియేటర్లలో ది రాజా సాబ్ రిలీజ్ కానుండగా.. ఈపాటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ది రాజా సాబ్ ట్విటర్ రివ్యూలోకి వెళితే..!
మళ్లీ పాత ప్రభాస్ వచ్చేశాడు!
ట్విట్టర్ (ఎక్స్) రివ్యూల ప్రకారం.. ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ ‘వింటేజ్ లుక్’ అందరినీ కట్టిపడేస్తోంది. "డార్లింగ్ ప్రభాస్‌లో ఆ పాత ఎనర్జీని, కామెడీ టైమింగ్‌ని మళ్లీ చూస్తున్నాం. ‘బుజ్జిగాడు’, ‘డార్లింగ్’ రోజులను ఈ సినిమా గుర్తు చేస్తోంది" అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ వేసిన స్టెప్పులు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
మారుతి మార్క్ హారర్ కామెడీ
దర్శకుడు మారుతి తనదైన శైలిలో కామెడీని, హారర్‌ను కలగలిపి ప్రేక్షకులను అలరించడంలో సఫలమయ్యారని నెటిజన్లు పేర్కొంటున్నారు. "సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా సాగిపోతుంది, సెకండాఫ్‌లో వచ్చే కొన్ని హారర్ ట్విస్టులు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి" అని ఒక యూజర్ పేర్కొన్నారు. తమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్లను మరో స్థాయికి తీసుకెళ్లాయని రివ్యూలు వస్తున్నాయి.
నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందంటే?
"ప్రభాస్ మాస్ మరియు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఉన్నాడు. ఈ సంక్రాంతి విన్నర్ రాజా సాబ్!", "సినిమాలో కామెడీ వర్కవుట్ అయ్యింది. ప్రభాస్ తన వన్-మ్యాన్ షోతో సినిమాను నిలబెట్టాడు.", "కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్లు అనిపించినా, క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది" అంటూ రాసుకొచ్చారు.
{{/usCountry}}"ప్రభాస్ మాస్ మరియు క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఉన్నాడు. ఈ సంక్రాంతి విన్నర్ రాజా సాబ్!", "సినిమాలో కామెడీ వర్కవుట్ అయ్యింది. ప్రభాస్ తన వన్-మ్యాన్ షోతో సినిమాను నిలబెట్టాడు.", "కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్లు అనిపించినా, క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది" అంటూ రాసుకొచ్చారు.
{{/usCountry}}"ఫస్టాఫ్ అదిరిపోయింది. మాళవిక ఫైట్ బాగుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వింటేజ్ డార్లింగ్ ఈజ్ బ్యాక్. తమన్ బీజీఎమ్ భయపెట్టింది. ప్రభాస్‌ను ఇలా చూపించినందుకు డైరెక్టర్ మారుతికి థ్యాంక్స్" అని ఒకరు రాసుకొచ్చారు.
"ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. తమన్ సంగీతం సీన్స్‌కు ఎలివేట్ ఇచ్చింది. హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ స్టన్నింగ్‌గా కనిపించారు. ఎవ్వరూ ఊహించని పాత్ర ది రాజా సాబ్‌లో ఉంది. సంజయ్ దత్ లుక్ ఇంప్రెసివ్‌గా ఉంది. హారర్ సీన్స్ డీసెంట్‌గా ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అయితే అదిరిపోయింది" అని ఒకరు రివ్యూ ఇచ్చారు.
ఇలా ది రాజా సాబ్‌పై చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ గ్లామర్ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చిందని అంటున్నారు.