Priyanka Chopra Survival Thriller Reset Movie: హాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌ను టచ్ చేస్తున్నారు. ఎమ్మీ అవార్డు గ్రహీత మ్యాట్ స్మక్లర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రీసెట్ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.
అడవి మధ్యలో

నాగరిక ప్రపంచానికి దూరంగా, అడవి మధ్యలో స్పృహలోకి వచ్చిన ఒక మహిళకు.. తను అక్కడికి ఎలా వెళ్లిందో గుర్తుండదు. ఆ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలతో బయటపడాలంటే, అక్కడ కలిసిన ఒక అపరిచితుడిని ఆమె నమ్మాల్సి ఉంటుంది. కానీ, ఆ వ్యక్తి నిజంగా సహాయం చేసేవాడా లేక మరేదైనా కుట్ర ఉందా? అనే ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ రీసెట్ సినిమా సాగనుంది.
ప్రియాంక - ఓర్లాండో బ్లూమ్ కెమిస్ట్రీపై అంచనాలు
'పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి భారీ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఓర్లాండో బ్లూమ్ ఈ రీసెట్ చిత్రంలో ప్రియాంకకు జోడీగా నటిస్తున్నారు. ఈ జంట గురించి దర్శకుడు మ్యాట్ స్మక్లర్ మాట్లాడుతూ.. "ఆకర్షణ, అనుమానం రెండూ ఏకకాలంలో కనిపించే జంట కోసం నేను వెతికాను. ప్రియాంక, ఓర్లాండో ఈ పాత్రలకు వంద శాతం న్యాయం చేయగలరని నమ్ముతున్నాను. వారి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది" అని పేర్కొన్నారు.
నిర్మాణ భాగస్వామిగా ప్రియాంక
కేవలం నటిగానే కాకుండా, తన సొంత నిర్మాణ సంస్థ 'పర్పుల్ పెబుల్ పిక్చర్స్' ద్వారా ప్రియాంక చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓర్లాండో బ్లూమ్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంటే, ఈ హీరో హీరోయిన్లు రీసెట్ మూవీకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అంతర్జాతీయ విక్రయాల కోసం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్కెట్‌లో మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వైవల్, రోమాన్స్, సస్పెన్స్ కలగలిసిన ఈ రీసెట్ కథలో షాకింగ్ ట్విస్టులు ఉంటాయని నిర్మాతలు జోన్, ఎరిక్ హోబెర్ వెల్లడించారు.
గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ప్రియాంక హవా
ఇటీవల కాలంలో ప్రియాంక చోప్రా నటించిన 'ది బ్లఫ్', 'హెడ్స్ ఆఫ్ స్టేట్' వంటి చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్ సాధించాయి. తాజాగా ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' సీజన్-2 కూడా విడుదలై మంచి స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో సిటాడెల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
{{/usCountry}}ఇటీవల కాలంలో ప్రియాంక చోప్రా నటించిన 'ది బ్లఫ్', 'హెడ్స్ ఆఫ్ స్టేట్' వంటి చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డు వ్యూస్ సాధించాయి. తాజాగా ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' సీజన్-2 కూడా విడుదలై మంచి స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో సిటాడెల్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
{{/usCountry}}కేవలం హాలీవుడ్‌కే పరిమితం కాకుండా, దాదాపు పదేళ్ల తర్వాత ప్రియాంక చోప్రా భారతీయ వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి'లో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారణాసి చిత్రం 2027 ఏప్రిల్‌లో విడుదల కానుంది.