...
...
Next Story

Priyanka Chopra: ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా హొయలు- మెడలో భారీ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చిన విమర్శలు

Priyanka Chopra Dress In Oscars 2026 Red Carpet: 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ప్రియాంక చోప్రా ప్రజెంటర్‌గా సందడి చేశారు. భర్త నిక్ జోనాస్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై స్ట్రాప్‌లెస్ వైట్ గౌనులో మెరిసిన ప్రియాంక చోప్రా మెడలో భారీ డైమండ్ నెక్లెస్ వేసుకుంది. అదే ఇప్పుడు విమర్శలకు దారి తీసింది.

Published on: Mar 16, 2026, 14:29:31 IST
Advertisement

హాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారాలు 'ఆస్కార్ 2026' వేడుకలు లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భారతీయ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరోసారి ప్రజెంటర్‌గా మెరిసి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

భర్తతో కలిసి హొయలు

ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా హొయలు- మెడలో భారీ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చిన విమర్శలు (Jordan Strauss/Invision/AP)
ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా హొయలు- మెడలో భారీ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చిన విమర్శలు (Jordan Strauss/Invision/AP)

భర్త, ప్రముఖ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన ప్రియాంక చోప్రా తన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే, ప్రియాంక చోప్రా ఫ్యాషన్ ఎంపికపై మాత్రం సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

వైట్ గౌనులో వింటేజ్ లుక్

ఆస్కార్ 2026 వేడుక కోసం ప్రియాంక చోప్రా ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ 'డియోర్' (Dior) రూపొందించిన స్ట్రాప్‌లెస్ వైట్ గౌనును ధరించారు. హాలీవుడ్ గోల్డెన్ ఎరా నాటి క్లాసిక్ లుక్‌ను గుర్తుకు తెచ్చేలా ఈ డ్రెస్ ఉంది. హై-స్లిట్, ఫెదర్ డీటెయిలింగ్‌తో ఉన్న ఈ గౌనుకు తోడుగా ప్రియాంక తన మెడలో భారీ డైమండ్ నెక్లెస్ ధరించారు. ఇక భర్త నిక్ జోనాస్ బ్లాక్ వెల్వెట్ టక్సేడోలో క్లాసీగా కనిపించారు.

నిరాశ పరిచిన స్టైలింగ్.. నెటిజన్ల విమర్శలు

స్టాప్‌లెస్, హై స్లిట్ వైట్ గౌనులో మెడలో పెద్ద డైమండ్ నెక్లెస్‌తో ప్రియాంక చోప్రా రెడ్ కార్పెట్‌పై కనిపించిన కొద్దిసేపటికే ఆమె లుక్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆమె ఫ్యాన్స్ కూడా ఈసారి స్టైలింగ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి మాత్రం గురి తప్పింది

ముఖ్యంగా ప్రియాంక చోప్రా హెయిర్ స్టైలింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. "జుట్టును మరీ ఆయిలీగా, చిప్కూ స్టైల్‌లో దువ్వడం అస్సలు బాలేదు. అలాగే నెక్లెస్ కూడా మరీ పెద్దదైపోయి డ్రెస్‌ను డామినేట్ చేస్తోంది" అని ఫ్యాషన్ ప్రియులు విశ్లేషిస్తున్నారు. "ఆమె చాలా అందగత్తె, కానీ ఆమె స్టైలిస్ట్ తరచుగా తప్పులు చేస్తున్నారు" అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజెంటర్‌గా ప్రియాంక

ఈ విమర్శలు ఎలా ఉన్నా, ఆస్కార్ వేదికపై దక్షిణాసియా ప్రతినిధిగా ప్రియాంక చోప్రా నిలబడటం విశేషం. అవార్డుల వేడుకకు ముందు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మేకప్ రూమ్ విశేషాలను కూడా పంచుకున్నారు. ఇకపోతే ఇటీవల ప్రియాంక చోప్రా నటించిన ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై భర్త నిక్ జోనాస్‌తో స్ట్రాప్‌లెస్ వైట్ గౌనులో ప్రియాంక చోప్రా

వారణాసి సినిమాలో హీరోయిన్‌గా

అమెజాన్ ప్రైమ్‌లో ది బ్లఫ్ ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. మరోవైపు మహేశ్ బాబుకు జోడీగా వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks