బాలీవుడ్ చరిత్రలో సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ మధ్య జరిగిన వివాదం గురించి తెలియని వారుండరు. ఐశ్వర్య రాయ్ ప్రేమ విషయంలో సల్మాన్ ఖాన్ తనను బెదిరిస్తున్నారని, ప్రాణ భయం ఉందంటూ వివేక్ 2003లో ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ఆరోపణలు చేశారు.
20 ఏళ్ల నాటి షాకింగ్ నిజాలు

సరిగ్గా ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ ఎక్కడ ఉన్నారు? ఆయన స్పందన ఏంటి? అనే షాకింగ్ నిజాలను 20 ఏళ్ల తర్వాత నిర్మాత శైలేంద్ర సింగ్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
సల్మాన్ చాలా కోపంగా ఉన్నారు!
ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ.. "వివేక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన సమయంలో నేను సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నాను. అది చూసి సల్మాన్ విపరీతమైన ఆగ్రహానికి లోనయ్యారు. 'అసలేం జరుగుతోంది ఇక్కడ?' అంటూ అసహనం వ్యక్తం చేశారు. అప్పట్లో సల్మాన్ తన భావోద్వేగాలను దాచుకునేవారు కాదు, వెంటనే బయటపెట్టేసేవారు. ఇప్పుడు మాత్రం ఆయనలో చాలా నిగ్రహం పెరిగింది" అని శైలేంద్ర సింగ్ వివరించారు.
జీవితంలో నటించాలి
సల్మాన్ ఖాన్‌ను శాంతింపజేయడానికి తాను చేసిన ప్రయత్నం గురించి చెబుతూ.. "జీవితంలో నటించాలి (Act), కానీ అనవసరంగా రియాక్ట్ కాకూడదు అని సల్మాన్‌కు చెప్పాను. ఏం చేయాలో తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి అతన్ని అలా చేయనివ్వు అని నచ్చజెప్పాను" అని శైలేంద్ర సింగ్ పేర్కొన్నారు.
నిశ్శబ్దంగా పోరాడారు..
ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సల్మాన్‌కు సూచించానని శైలేంద్ర తెలిపారు. "సైలెంట్‌గా యుద్ధం చేయమని చెప్పాను. బహుశా ఆయన అదే చేసి ఉంటారు. ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్‌కు బాలీవుడ్లో అవకాశాలు రాకుండా సల్మాన్ జాగ్రత్త పడ్డారని నా అభిప్రాయం. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ, బయటకు కనిపిస్తున్నది మాత్రం అదే" అని శైలేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేక్ ఒబెరాయ్ ఆవేదన
{{/usCountry}}ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సల్మాన్‌కు సూచించానని శైలేంద్ర తెలిపారు. "సైలెంట్‌గా యుద్ధం చేయమని చెప్పాను. బహుశా ఆయన అదే చేసి ఉంటారు. ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్‌కు బాలీవుడ్లో అవకాశాలు రాకుండా సల్మాన్ జాగ్రత్త పడ్డారని నా అభిప్రాయం. అది నిజమో కాదో నాకు తెలియదు కానీ, బయటకు కనిపిస్తున్నది మాత్రం అదే" అని శైలేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేక్ ఒబెరాయ్ ఆవేదన
{{/usCountry}}ఈ వివాదం తర్వాత వివేక్ ఒబెరాయ్ కెరీర్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీనిపై గతంలోనే వివేక్ స్పందిస్తూ.. "షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా వంటి హిట్ తర్వాత కూడా 14 నెలల పాటు పని లేకుండా ఇంట్లో కూర్చోవడం ఎంత బాధాకరమో నాకు తెలుసు. పరిశ్రమలో నాపై లాబీయింగ్ జరిగిందని అర్థమైంది. అది నన్ను చాలా అలసిపోయేలా చేసింది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పిరిట్ మూవీలో వివేక్
ఇదిలా ఉంటే, చాలా కాలం తర్వాత వివేక్ ఒబెరాయ్ ఒక భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
సల్మాన్ న్యూ మూవీ
న్యూ నేషనల్ క్రష్, బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న స్పిరిట్ మూవీ 2027 మార్చి 5న విడుదల కానుంది. ఇక సల్మాన్ ఖాన్ అపూర్వ లఖియా దర్శకత్వంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ (Battle of Galwan) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలోకి రానుంది.