టాలీవుడ్ పాపులర్ నిర్మాతల్లో స్వప్న దత్ ఒకరు. ప్రభాస్ కల్కి 2898 ఏడీ, దుల్కర్ సల్మాన్ సీతారామం, కీర్తి సురేశ్ మహానటి, నాని ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన నిర్మాతల్లో స్వప్న దత్ ఒకరు. ఇటీవల స్వప్న దత్ కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.
రెండు రోజుల ముందు

సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ మూవీ కపుల్ ఫ్రెండ్లీ ఇవాళ (ఫిబ్రవరి 14) థియేటర్లలో విడుదల అయింది. అయితే, మూవీ రిలీజ్‌కు 2 రోజుల ముందు ఫిబ్రవరి 12న కపుల్ ఫ్రెండ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత స్వప్న దత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఆ సినిమాలన్నీ ఇష్టం
ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ.. "కపుల్ ఫ్రెండ్లీ మూవీ కంటెంట్ కొత్తగా అనిపిస్తోంది. సినిమా కావాల్సినవన్నీ యూవీ సంస్థ ఇస్తుంటుంది. వాళ్ల బ్యానర్ సినిమాలన్నీ నాకు ఇష్టం" అని అన్నారు.
బ్రేక్ కోసం చూస్తున్నాడు
"సంతోష్ మా అందరికీ ఇష్టమైన యాక్టర్. అతనికి చాలా టాలెంట్ ఉంది. ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. మా సంస్థ ద్వారా అలాంటి సినిమా ఇవ్వలేకపోయాం. కానీ, కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ ఇస్తుందని ఆశిస్తున్నాం" అని స్వప్న దత్ కోరుకున్నారు.
బ్యూటిపుల్ రిలేషన్ చూస్తారు
ఇదే ఈవెంట్‌లో నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. "కపుల్ ఫ్రెండ్లీ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించాను. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య బ్యూటిపుల్ రిలేషన్ చూస్తారు" అని అన్నారు.
అందంగా కనిపించడమే కాదు
"కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ చూశాక సంతోష్ శోభన్ ఈ మూవీ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో అర్థమైంది. మానస వారణాసి అందంగా కనిపించడమే కాదు తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే క్రెడిట్ యూవీ క్రియేషన్స్‌కు ఇవ్వాలి" అని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
హిట్ దక్కాలని కోరుకుంటున్నా
{{/usCountry}}"కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ చూశాక సంతోష్ శోభన్ ఈ మూవీ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో అర్థమైంది. మానస వారణాసి అందంగా కనిపించడమే కాదు తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది. ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే క్రెడిట్ యూవీ క్రియేషన్స్‌కు ఇవ్వాలి" అని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
హిట్ దక్కాలని కోరుకుంటున్నా
{{/usCountry}}డైరెక్టర్ మేర్లపాక గాంధీ మాట్లాడుతూ.. "ఈ సినిమా పోస్టర్, టీజర్, ట్రైలర్.. ఇలా ఏ కంటెంట్ రిలీజ్ చేసినా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అజయ్ అన్నలోని పాజిటివ్ ఎనర్జీనే ఈ మూవీకి వచ్చిందని అనుకుంటున్నాను. ఈ చిత్రంతో యూవీ సంస్థకు మంచి సక్సెస్ రావాలి. డైరెక్టర్ అశ్విన్‌లోని హానెస్టీ ఈ సినిమా ప్రతి విజువల్‌లోనూ కనిపిస్తోంది. సంతోష్ శోభన్‌కు హిట్ దక్కాలని కోరుకుంటున్నా" అని ఆశించారు.
ప్రేక్షకుల మధ్యే చూడాలనుకుంటున్నా
డైరెక్టర్ అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ.. "కపుల్ ఫ్రెండ్లీ సినిమా గురించి ఆల్‌రెడీ ప్రతి ఒక్కరూ హిట్ అని చెబుతున్నారు. నేను థియేటర్‌లో ప్రేక్షకుల మధ్యే చూడాలని అనుకుంటున్నా. మా యూవీ ప్రొడ్యూసర్స్ పాషనేట్ ప్రొడ్యూసర్స్. నాతో భారీ బడ్జెట్ పెట్టి బైకర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా యూవీకి మంచి సక్సెస్ అందిస్తుంది" అని జోస్యం చెప్పారు.