సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ హీరోలుగా, నటులు దర్శకులుగా, హీరోయిన్స్ సింగర్స్‌గా మారి అందరిని ఆశ్చర్యపరచడం సర్వసాధారణమే. ఈ క్రమంలోనే ఓ నిర్మాత నటుడిగా మారి గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. నిర్మాతగా మంచి సినిమాలు నిర్మించిన ఆయన నటుడిగానూ మెప్పిస్తున్నారు.
మేనల్లుడైన విజయ్ దేవరకొండతో

ఆయనే ప్రొడ్యూసర్ యశ్ రంగినేని. టాలీవుడ్‌లో ఓ నిర్మాతగా యశ్ రంగినేని మంచి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రాన్ని నిర్మించారు.
నిర్మాతగా యశ్ రంగినేని సినిమాలు
ఆ తరువాత యశ్ రంగినేని నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.
ఛాంపియన్ సినిమాలో
ఇక నిర్మాతగా తన అభిరుచిని చాటుకుంటూనే నటుడిగా తన సత్తాను ప్రదర్శించుకుంటున్నారు యశ్ రంగినేని. తాజాగా జాతీయ అవార్డ్ గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ‘ఛాంపియన్’ చిత్రం ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
వీరయ్య అనే పాత్రలో
సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా వచ్చిన ఛాంపియన్ చిత్రంలో యశ్ రంగినేని ఓ అద్భుతమైన పాత్రను పోషించారు. వీరయ్య అనే అద్భుతమైన రోల్‌లో యశ్ రంగినేని అంతే గొప్పగా జీవించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిన ఆ కారెక్టర్‌లో యశ్ రంగినేని నటన అందరికీ గుర్తుండిపోయేలా ఉంది.
అణగారిన వర్గాలకు ప్రతినిధిగా
‘ఛాంపియన్’ చిత్రంలో ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రని యశ్ రంగినేని చాలా గొప్పగా పోషించి అందరి చేత మన్నల్ని పొందారు.
మలయాళ బ్యూటి అనస్వర రాజన్
{{/usCountry}}‘ఛాంపియన్’ చిత్రంలో ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రని యశ్ రంగినేని చాలా గొప్పగా పోషించి అందరి చేత మన్నల్ని పొందారు.
మలయాళ బ్యూటి అనస్వర రాజన్
{{/usCountry}}ప్రస్తుతం ఛాంపియన్ చిత్రం థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఛాంపియన్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా రోషన్ మేక నటనకు బాగా మార్కులు పడుతున్నాయి. ఈ సినిమాలో రోషన్‌కు జోడీగా మలయాళ హీరోయిన్ అనస్వర రాజన్ నటించింది.
మిక్కీ జే మేయర్ సంగీతం
అవంతిక, కల్యాణ్ చక్రవర్తి, రచ్చ రవి, బలగం సంజయ్, కెకె మీనన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా నిర్మాత అయిన యశ్ రంగినేని పాత్ర అందరిని ఆకట్టుకుంటుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఛాంపియన్ పాటలు చార్ట్ బస్టర్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే.